E-Paper
Advertisement

Harish Shankar: సినిమాలో నేను ఇచ్చిన మెసేజ్ కన్నా నాకు వచ్చిన మెసేజ్లు ఎక్కువ.. తన సినిమాపై తనే జోకు వేసుకున్న హరిష్ శంకర్..!

Harish Shankar: సినిమాలో నేను ఇచ్చిన మెసేజ్ కన్నా నాకు వచ్చిన మెసేజ్లు ఎక్కువ.. తన సినిమాపై తనే జోకు వేసుకున్న హరిష్ శంకర్..!
Advertisement

Harish Shankar:దర్శకుడు హరీష్ శంకర్ ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తీసిన గబ్బర్ సింగ్ సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన మళ్లీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఉగాది సందర్భంగా విడుదలై ప్రస్తుతం మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకుంటోంది. కొంతమంది ప్రేక్షకులు సినిమా ఎంజాయ్ చేస్తుంటే, మరికొందరు మాత్రం ఇది ప్రోతిన్ సినిమా లాగా ఉందని భావిస్తున్నారు.

హరీష్ శంకర్ సినిమాలంటే సాధారణంగా మాస్ ఎంటర్టైన్మెంట్‌తో పాటు ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. ఆయన గతంలో పలు హిట్ సినిమాలు ఇచ్చినా, మధ్యలో కొన్ని ఫ్లాప్‌లను కూడా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఆయన కొత్త సినిమా ఎలా ఉంటుంది అన్న ఆసక్తి అందరిలో పెరిగింది.

Advertisement

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్స్ సమయంలో హరీష్ శంకర్ పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒక యాంకర్ ఆయనను ఆసక్తికరమైన ప్రశ్న అడిగారు. మీ సినిమాల్లో ఎప్పుడూ ఒక మెసేజ్ ఉంటుందని, ఈ సినిమాలో కూడా అలాంటి మెసేజ్ ఉందా అని ప్రశ్నించారు.

నాకు వచ్చిన మెసేజ్లే ఎక్కువ..;

దానికి హరీష్ శంకర్ చమత్కారంగా సమాధానం ఇచ్చారు. “మిస్టర్ బచ్చన్ సినిమాకి నేను ఇచ్చిన మెసేజ్ కంటే, ఆ సినిమాపై నాకు వచ్చిన మెసేజ్ లే ఎక్కువ” అని చెప్పారు. ఈ సమాధానం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Advertisement

ఈ కామెంట్ ద్వారా ఆయన మిస్టర్ బచ్చన్ సినిమాపై వచ్చిన విమర్శలను పరోక్షంగా గుర్తు చేశారు ఈ దర్శకుడు. అదే సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్‌ను కూడా సరదాగా తీసుకున్నట్టు కనిపించింది.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆశించే అన్ని మాస్ అంశాలు ఉన్నాయి. యాక్షన్, డైలాగ్స్, ఎంటర్టైన్మెంట్ అన్నీ కలగలిపి తెరకెక్కించారు. స్పందన చాలా గొప్పగా లేకపోయినా, ఉగాది పండగ కారణంగా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.

ALSO READ: Peddi Movie: పెద్ది స్పెషల్ సాంగ్ లో మృణాల్ ఠాకూర్.. నిజమేనా?

Related News

విడాకుల వార్తలకు చెక్ పెట్టిన కియారా సిద్దార్థ్ మల్హోత్రా!

పూర్తి అబ్బాయిగా మారిన స్నిగ్ధ.. గర్ల్ ఫ్రెండ్ కూడా?

అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ కు బిగ్ షాక్.. గచ్చిబౌలిలో కేసు నమోదు!

టికెట్ ధరల పెంపు.. సినిమాకే నష్టం.. నిర్మాతలు ఆలోచించండి!

ఇట్స్ అఫీషియల్ వాయిదా పడిన ప్రశాంత్ నీల్ ‘418’ ..కారణం ఇదేనా?

ఒకవైపు ట్రోల్స్..మరోవైపు రికార్డులు.. ఏష నాగుల కట్ట సాంగ్ కొత్త రికార్డు!

కావ్య కళ్యాణ్ రామ్ కాలభైరవ పెళ్లి ఫిక్స్.. ముహూర్తం ఎప్పుడంటే?

మంచు మనోజ్ ‘డేవిడ్ రెడ్డి’ మళ్లీ పట్టాలెక్కేదెప్పుడు?

Big Stories

Advertisement
×