Adhira Movie:ప్రశాంత్ వర్మ (Prasanth varma ) .. ఇండియన్ సినీ పరిశ్రమకు దొరికిన ఆణిముత్యం అని చెప్పడంలో సందేహం లేదు. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ ఒక బ్రాండ్ గా మారిపోయారు. ఆయన చేసింది నాలుగు సినిమాలే అయినా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న ఈయన.. సూపర్ హీరో కాన్సెప్ట్ తో హనుమంతుని బ్యాక్ డ్రాప్ లో సినిమా చేసి ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ వసూలు చేశారు. విడుదలైన 13 రోజుల్లోనే ఏకంగా రూ.230 కోట్లకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు ప్రశాంత్ వర్మ. దీంతో ఈయన నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ తర్వాత ఎలాంటి సినిమాలు చేస్తాడు? మళ్లీ సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే వస్తాడా? అందులో హీరో ఎవరు? ఇలా నెటిజన్స్ కూడా తెగ వెతికారు.
కళ్యాణ్ హీరోగా అధీర..
ఇకపోతే ప్రశాంత్ వర్మ సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అదే జై హనుమాన్. రిషబ్ శెట్టి కీలక పాత్రలో ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆగిపోయింది కారణం రిషబ్ శెట్టి మరొకవైపు ‘ కాంతారా చాప్టర్ 1’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మరొకవైపు తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా మరో సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రకటించిన మూవీ అధీర (Adhira). ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య(DVV danayya) కొడుకు దాసరి కళ్యాణ్ (Dasari kalyan) హీరోగా పరిచయం అవుతున్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం వెలుగును సూపర్ హీరో పవర్ గా తీసుకోబోతున్నట్లు గతంలో వెల్లడించిన విషయం తెలిసిందే. తనకున్న లైటింగ్ పవర్ తో ఈ సూపర్ హీరో ఏం చేశాడు అనేది ఈ సినిమా కథ.
అధీర నుండీ తప్పుకున్న ప్రశాంత్ వర్మ..
ముఖ్యంగా ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైందని ప్రశాంత్ వర్మ గతంలో తెలిపారు. అందుకు సంబంధించి ఇంట్రో వీడియో కూడా రిలీజ్ చేశారు.. ఇక ఈ సినిమా గత ఏడాది ఎండింగ్ లోనే వచ్చే అవకాశం ఉందని వార్తలు కూడా వినిపించాయి. కానీ ఏదీ కూడా నిజం కాలేదు. అయితే ఇప్పుడు సడన్గా ఈ సినిమా నుండి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్లు సమాచారం.
నిర్మాతకు కోటి నష్టం తప్పదా..
వాస్తవానికి ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ప్రశాంత్ వర్మ నుంచి బిన్నీ తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన నుంచి ‘తిమ్మరసు’ సినిమా దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిన ప్రశాంత్ వర్మ మాత్రం ఈ సినిమాకు క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు. పైగా కథ కూడా ఆయనదే. ఇటు సౌత్ నుంచి పెద్ద పెద్ద స్టార్స్ ఈ సినిమాలో నటించబోతున్నారు అని, ఊహించని కాంబో కూడా సెట్ అయ్యి.. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్నారని సమాచారం. దీనికి తోడు 2022లోనే డీవీవీ దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి హీరోగా ఈ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాకు కథ అందించిన ప్రశాంత్ వర్మకు కోటి రూపాయలు అడ్వాన్స్ గా కూడా ఇచ్చాడు. అయితే ఇప్పుడు సడన్గా ఈ సినిమా నుండి ప్రశాంత్ వర్మ తప్పుకున్నట్లు తెలుస్తోంది.ఇక మొత్తానికైతే డైరెక్టర్ తప్పుకోవడంతో డీవీవీ దానయ్యకు కోటి రూపాయల నష్టం వాటిల్లినట్టు సమాచారం. మొత్తానికి అయితే ప్రశాంత్ వర్మ తప్పుకోవడం పై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ALSO READ:Dil Raju Wife Tejaswini: దిల్ రాజు రెండో భార్య తేజస్విని ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా?