E-Paper
Advertisement

మూవీలో ఛాన్స్ ఇస్తా.. ఒక నైట్ పడుకోమన్నాడు.. నీతి టేలర్ సంచలన కామెంట్స్!

మూవీలో ఛాన్స్ ఇస్తా.. ఒక నైట్ పడుకోమన్నాడు.. నీతి టేలర్ సంచలన కామెంట్స్!
Advertisement

Niti Taylor : చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై ఎంతోమంది హీరోయిన్స్ బహిరంగంగా తాము ఎదుర్కొన్న సమస్యల గురించి నిర్భయంగా చెప్పుకొస్తున్న విషయం తెలిసిందే. అయితే అందులో కొంతమంది పేరును మెన్షన్ చేస్తే.. మరి కొంతమంది పేరు ప్రస్తావించకుండా తాము ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ తాను మళ్ళీ సినిమాలలో నటించకపోవడానికి గల కారణాన్ని, ఇండస్ట్రీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ హీరోయిన్ నీతి టేలర్.

అందుకే టాలీవుడ్ కి గుడ్ బై..

2012లో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తనీష్ హీరోగా వచ్చిన మేం వయసుకు వచ్చాం అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఆ తర్వాత అదే ఏడాది రాహుల్ రవీంద్రన్ ‘పెళ్లి పుస్తకం’ సినిమాలో కూడా నటించింది. చివరిగా లవ్ డాట్ కాం అనే సినిమాలో కనిపించిన ఈమె.. ఆ సినిమాలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడంతో ఇక టాలీవుడ్ కి గుడ్ బై చెప్పేసింది. తెలుగులో సినిమాలు చేయకపోయినా.. సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అభిమానులకు టచ్ లోనే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

అవకాశం కావాలంటే.. పడుకోమన్నారు..

Advertisement

అలాంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ..” నేను రెండు తెలుగు సినిమాలు చేశాను. అయితే నేను పనిచేసిన దర్శకులలో ఒకరు తన తర్వాత సినిమా అవకాశం ఇవ్వడానికి నాకు ఫోన్ చేశారు. అయితే ఆ అవకాశం కోసం తనతో పడుకోమని అడిగారు. నిజానికి నేను ఆ ముసలాయనను ఇతర అమ్మాయిలతో చూశాను. కానీ అతను నాతోనే అలా చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు” అంటూ ఆవేదన వ్యక్తం చేసింది నీతి టేలర్. అయితే ఇక్కడ ఈమె డైరెక్టర్ పేరు మెన్షన్ చేయకపోవడంతో ఆ డైరెక్టర్ ఎవరు? అంటూ అభిమానులు ఆరా తీస్తున్నారు. మొత్తానికి అయితే ఇండస్ట్రీలో అవకాశం కావాలి అంటే తనను తాను సమర్పించుకోవాల్సిందేనా అనే కొత్త అనుమానాలను నీతి టేలర్ కలిగించిందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా నీతి టేలర్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

also read: నవరాత్రి స్పెషల్.. ‘ భరత వర్ష’ నుండి “అమ్మ కదిలి వచ్చే” సాంగ్ ప్రోమో రిలీజ్!

నీతి టేలర్ కెరియర్..

Advertisement

నీతి టేలర్ విషయానికి వస్తే.. 1994 నవంబర్ 8న ఢిల్లీలో జన్మించిన ఈమె.. తొలిసారి న్యూస్ ప్రెసెంటర్ గా తన కెరియర్ ను ప్రారంభించింది 2015. డిసెంబర్లో యునైటెడ్ కింగ్ డం ఆధారిత వార్తాపత్రిక ఈస్టర్న్ ఐ 50 సెక్సీయెస్ట్ ఆసియన్ ఉమెన్ లిస్టులో అగ్రస్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఈమె తండ్రి గుజరాతికి చెందినవారు కాగా, ఈమె తల్లి కోల్కతాకు చెందిన బెంగాలీ క్రైస్తవ మతస్థురాలు. సినిమాల్లోకి అడుగు పెట్టిన తర్వాత టెలివిజన్ సిరీస్ లు, వెబ్ సిరీస్ లతో పాటు సినిమాలు, మ్యూజిక్ వీడియోలు కూడా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Related News

రాజకీయాల్లోకి నయనతార భర్త ఎంట్రీ.. ఇదిగో క్లారిటీ వచ్చేసిందిగా..

సినిమాల్లో నల్గొండ గద్దర్ హవా.. ఒక్క పాటకు ఎంత తీసుకుంటాడంటే?

గ్లామర్‌తో అదరగొడుతోంది.. కానీ సినిమాల సంగతేంటి నభా?

తమిళనాడు సీఎం విజయ్ ను కలిసిన విజయ్ దేవరకొండ రష్మిక దంపతులు!

మోక్షజ్ఞ సినిమాలపై ఒత్తిడి.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన బాలయ్య చిన్నల్లుడు!

అనుపమకు ఆ సినిమా అంటే అంత పిచ్చా..50 సార్లు చూసానంటూ!

నానిని బావ అని ఎందుకు పిలుస్తానో తెలుసా? స్నిగ్ధ చెప్పిన అసలు విషయం ఇదే!

Big Stories

Advertisement
×