New Hyundai Bayon SUV: హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్త మిడ్‌సైజ్ SUV బేయాన్ ను ఆవిష్కరించింది. ఈ నెల 26న భారత మార్కెట్లో విడుదల కానున్న ఈ కారుపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. కొత్త డిజైన్, అడ్వాన్స్ డ్ టెక్నాలజీ, AI వాయిస్ అసిస్టెంట్ వంటి ఫీచర్లతో దీన్ని తీసుకొస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న కస్టమర్లు రూ.11,000 టోకెన్ అమౌంట్ తో ఆన్‌లైన్‌లో లేదంటే డీలర్‌షిప్‌లలో బుకింగ్ చేసుకోవచ్చు. వెన్యూ, క్రెటా మోడళ్ల మధ్య స్థానంలో ఉండే ఈ SUVలో పెట్రోల్‌తో పాటు ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG ఆప్షన్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
హ్యుందాయ్ బేయాన్ SUVని 2026 అక్టోబర్ 26న భారత మార్కెట్లో విడుదల చేయనున్నారు. పండుగ సీజన్ లో డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కంపెనీ ఇప్పటికే కారు ఎక్స్ టీరియర్, ఇంటీరియర్ ఫొటోలతో పాటు కీలక స్పెసిఫికేషన్లను వెల్లడించింది. అయితే, పూర్తి వేరియంట్లు, ధరల వివరాలు విడుదల సమయంలో తెలిసే అవకాశం ఉంది.
బేయాన్ SUVని హ్యుందాయ్ కొత్త ‘ఆర్ట్ ఆఫ్ స్టీల్’ డిజైన్ లాంగ్వేజ్ ఆధారంగా రూపొందించారు. సుమారు 4.2 మీటర్ల పొడవుతో, పొడవైన బాక్సీ ప్రొఫైల్‌ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్, బోనెట్ అంచున H ఆకారంలో కనిపించే LED DRLలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. బంపర్ పై కింది వైపు ప్రధాన హెడ్ ల్యాంప్ యూనిట్‌ను అమర్చారు. బ్లాక్, సిల్వర్ క్లాడింగ్‌తో కూడిన బంపర్‌కు స్పోర్టీ లుక్ ఇచ్చారు. సైడ్ ప్రొఫైల్‌లో ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్ లు, పెటల్ స్టైల్ అల్లాయ్ వీల్స్, షార్ప్ క్యారెక్టర్ లైన్లు కనిపిస్తాయి. వెనుకవైపు సన్నని టెయిల్ ల్యాంప్ డిజైన్, రూఫ్ స్పాయిలర్, డ్యూయల్ టోన్ బంపర్ ను అందించారు.
బేయాన్‌లో టెక్నాలజీకి కంపెనీ ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో 12.3 అంగుళాల రెండు డిస్ ప్లేలు ఉంటాయి. ఒకటి ఇన్ఫోటైన్‌మెంట్ కోసం, మరొకటి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌గా పని చేస్తుంది. అలాగే జనరేటివ్ AI వాయిస్ అసిస్టెంట్, ఎన్విడియా టెక్నాలజీ ఆధారిత కనెక్టెడ్ కార్ నావిగేషన్, OTA సాఫ్ట్ వేర్ అప్ డేట్స్, 70కి పైగా హ్యుందాయ్ బ్లూలింక్ ఫీచర్లు ఇందులో ఉంటాయి. వాయిస్ కమాండ్స్ ద్వారా వివిధ పనులు చేసుకునే సౌకర్యం కూడా ప్రత్యేకంగా నిలవనుంది.
ఈ SUVలో 1.5 లీటర్, నాలుగు సిలిండర్ల న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌ను అందిస్తున్నారు. ఇది 115hp పవర్, 144Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉంటాయి. బేయాన్ లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ CNG కిట్‌ను కూడా అందించనున్నట్లు సమాచారం. మొత్తంగా కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, పెట్రోల్, CNG ఆప్షన్లతో బేయాన్ SUV మార్కెట్లో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూడాలి.
Read Also: టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ టీజ్.. కొత్త లుక్ తో అదిరిపోయే ఎంట్రీ!