E-Paper
Advertisement

చెత్త యానిమేషన్ అని తిట్టారు.. రూ.లక్షతో తీస్తే కోట్లు కొల్లగొడుతోంది

చెత్త యానిమేషన్ అని తిట్టారు.. రూ.లక్షతో తీస్తే కోట్లు కొల్లగొడుతోంది
Advertisement

Niu Lai:మాములుగా సినిమాలు హిట్ అవ్వాలంటే మంచి పాజిటివ్ టాక్ రావాలి, ఆహ,ఓహో అని ఆకాశానికి ఎత్తేయ్యాలి.అలా అయితేనే జనాలు ఏముందా అని క్యూరియస్ గా సినిమాని చూడటానికి క్యూలు కట్టేస్తారు. కాని ఇక్కడ ఒక సినిమా విషయంలో మాత్రం అంచనాలు తలకిందులు అయ్యాయి.అవును ..అసలు ఇదేం సినిమారా బాబు అని ట్రోల్ చేసిన సినిమానే ఇపుడు ఏకంగా బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతుంది.అదే చైనాకి చెందిన ‘న్యూ లాయ్‌’ (Niu Lai). అనే యానిమేషన్ సినిమా.

కథ ఏంటంటే 

ఇంతకీ సినిమా కథంటే తెలుసా ..చాలా సింపుల్ ..చైనా బాషలో ‘న్యూ లాయ్‌’ (Niu Lai) అంటే ఆవు వస్తుంది అని అర్థం.సినిమా కథ అంతా ఓ లేగదూడ, ఓ పిచ్చుక చుట్టూ సాగే విచిత్రమైన కలల ప్రపంచం.దాన్నే అద్భుతంగా యానిమేషన్ లో ఒడిసి పట్టేశాడు గ్జిన్ ఎమెంగ్ (Xin Yumeng).ఇక 86 నిమిషాల లెంత్ ఉన్న ఈ సినిమాకి డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు కానే కాదు. కేవలం 1680 యువాన్ లతో గ్జిన్ ఎమెంగ్ (Xin Yumeng)అతని తల్లి సన్ లిఫాంగ్ లు ఇద్దరు కలిసి ఏకంగా ఐదేళ్ళు కష్టపడి సినిమాని పూర్తి చేయడం విశేషం.

కలెక్షన్స్ అక్షరాల 1.2 లక్షలు మాత్రమే

Advertisement

ఇక ఈ సినిమా ఆగస్టు 5, 2026న థియేటర్ లోకి ఇలా వచ్చింది.కానీ థియేటర్ లోకి వచ్చాక సినిమాని పట్టించుకునే నాధుడే లేడంటే ఆశ్చర్యం లేదు’.ఇక థియేటర్ లో జనాలు కనీసం డబుల్ డిజిట్స్ కూడా దాటకపోవడం ఇక్కడ గమనార్హం.ఈ సినిమాకి వచ్చిన కలెక్షన్స్ ఎంతో తెలుసా …అక్షరాల 1.2 లక్షలు మాత్రమే.దీంతో ఈ సినిమా పని అయిపొయింది అనుకున్నారంతా..కానీ ఇక్కడే అసలైన మ్యాజిక్ జరిగింది.

ఏకంగా 21 కోట్లని కొల్లగొట్టిన సినిమా 

ఎప్పుడైతే సినిమా నుండి కొన్ని క్లిప్పింగ్స్ బయటికి రావడంతో ఒక్కసారిగా తమ ట్రోల్స్ కి పని పెట్టారు నెటిజన్లు.అసలు ఇది సినిమానా,యానిమేషన్ అంటే ఇలా ఉంటుందా,చూస్తుంటే ఇది AI జనరేటేడ్ లా ఉందే అంటూ కామెంట్ల వర్షం కురిపించారు. ఈ నెగెటివిటీనే ఈ ‘న్యూ లాయ్‌’ (Niu Lai). సినిమాకి ఎక్కడ లేని పబ్లిసిటీ తెచ్చిపెట్టింది.అసలు సోషల్ మీడియాలో ఇంత దారుణంగా సినిమాని ఏకి పారేస్తున్నారు.ఎందుకో చూద్దామంటూ సినిమాకి క్యూ కట్టారు.దీంతో స్క్రీన్ లు ఒకసారిగా పెంచేశారు.దాంతో ప్లాప్ అనుకున్న సినిమా కాస్తా నెగెటివ్ కామెంట్స్ తో ఒక్కసారిగా వసూళ్ళ వర్షంలో తడిసి ముద్దైపోయింది.మొదట్లో అరా కొరా వసూళ్లు వచ్చిన సినిమా సినిమా 17.1 మిలియన్‌ యువాన్లు(రూ.21 కోట్లకు) కొల్లగొట్టడం గమనార్హం

Advertisement

అయితే ఇలాగే వచ్చిన యానిమేషన్ మూవీ Ne Zha 2 భారీ బడ్జెట్ లో తెరకెక్కి చైనాలో వసూళ్ళ సునామి స్ప్రుష్టించిన సంగతి తెల్సిందే.కానీ ‘న్యూ లాయ్‌’ (Niu Lai) అందుకు భిన్నంగా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సౌండ్ చేస్తుండటంతో ఇపుడందరి దృష్టి దీనిపైనే పడింది.

పాజిటివ్ టాకే కాదు నెగెటివ్ టాక్ కూడా ముఖ్యమే 

ఏది ఏమైనా చిన్న బడ్జెట్ లో ఒక ఇద్దరు వ్యక్తులు పడ్డ కష్టం ఇలా నెగెటివ్ టాక్ తెచ్చుకొని ఇపుడు బాక్సాఫీస్ వద్ద సంచనలం స్ప్రుష్టిస్తుందంటే నిజంగా మెచ్చుకొని తీరాల్సిందే.అయితే గతంలో వచ్చిన ‘The Room’అనే సినిమా కూడా మొదట్లో నెగెటివ్ టాక్ తెచ్చుకుని ఆ తర్వాత సూపర్ హిట్ అయిన సంగతి తెల్సిందే.

ALSO READ :విశ్వంభర ..ఒకప్పుడు ఫుల్ హైప్ – ఇప్పుడు నో హోప్ !

ఇక ఇపుడు అదే బాటలో ‘న్యూ లాయ్‌’ (Niu Lai) కూడా బాగోలేదని టాక్ తెచ్చుకుని, క్రమంగా సూపర్ హిట్ అవడం ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.మొతానికి సినిమాకి కాసుల వర్షం కురిపించాలంటే పాజిటివ్ టాకే కాదు నెగెటివ్ టాక్ కూడా దోహదపడుతుంది అనడానికి ఈ సినిమానే ఒక మంచి ఉదాహరణ !

Tags

Related News

ఆ రోజు వచ్చేసరికి నేను చనిపోయి ఉంటా.. తేజ వైరల్ కామెంట్స్

బాలయ్య అసలు సీక్రెట్ బయటపెట్టిన సిద్ధు జొన్నలగడ్డ!

విశ్వంభర ..ఒకప్పుడు ఫుల్ హైప్ – ఇప్పుడు నో హోప్ !

‘కాకా’ మెగా 158 టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ లాక్.. సంబరాలు సిద్ధం చేస్కో!

మాటలు కాదు.. చేతల్లో చూపిస్తా: అనసూయ స్ట్రాంగ్ మెసేజ్

సెన్సార్ పూర్తి చేసుకున్న రవితేజ ‘ఇరుముడి’.. రన్ టైమ్ లాక్!

దేవా మళ్లీ దిగుతున్నాడట.. సలార్ 2పై ఇంట్రెస్టింగ్ న్యూస్

Big Stories

Advertisement
×