E-Paper
Advertisement

30 ఏళ్లుగా దాచుకున్న రహస్యం… పెళ్లిలో అన్నదమ్ముల అరాచకం… ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్

30 ఏళ్లుగా దాచుకున్న రహస్యం… పెళ్లిలో అన్నదమ్ముల అరాచకం… ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చూస్తే మైండ్ బ్లాంక్
Advertisement

Psychological Drama: చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినా… ఒకే ఇంట్లో ఉన్నా… వాళ్లిద్దరి మనసులు మాత్రం ఎప్పుడూ కలవలేదు. ఒకరి కోపం, మరొకరి భయం… కాలం గడిచేకొద్దీ ఓ వింత బంధంగా మారిపోయాయి. ఏళ్ల తర్వాత వాళ్లు తమ జీవితాల్లో సెటిల్ అయిపోయారని అనుకునే సమయంలో… పెళ్లి రోజునే ఒకడు ఊహించని విధంగా తిరిగి వస్తే ? ఆ ఒక్కడి రాకతో దశాబ్దాలుగా దాచిన రహస్యాలన్నీ బయటపడితే ? అసలు వాళ్ల మధ్య ఇంత ద్వేషం ఎందుకు వచ్చింది ? ఒకరిని ఒకరు వదిలించుకోలేని స్థితికి ఎలా చేరుకున్నారు ? గతం వాళ్ల ప్రస్తుత జీవితాలను ఎంతలా వెంటాడిందో చూపించే బ్రిటిష్ సైకలాజికల్ డ్రామా ‘హాఫ్ మ్యాన్’ (Half Man). ఈ ఇంట్రెస్టింగ్ సిరీస్ ని ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

కథ 1980ల కాలంలో మొదలవుతుంది. నియాల్ ప్రశాంతంగా, సున్నితంగా ఉండే కుర్రాడు. అతని తల్లి రూబెన్ తండ్రితో కలిసి జీవించడం మొదలు పెట్టడంతో.. రూబెన్ కూడా నియాల్ జీవితంలోకి వస్తాడు. చిన్నప్పటి నుంచే రూబెన్ చాలా కోపంగా, దూకుడుగా ఉంటాడు. అతని ప్రవర్తన వల్ల ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి.

Advertisement

నియాల్ మాత్రం అన్నింటినీ మౌనంగా భరించే రకం. రూబెన్ చేసే పనులు అతనికి ఇబ్బంది కలిగించినా… అతనితో పూర్తిగా తెగతెంపులు చేసుకోలేడు. ఇద్దరి మధ్య ఒక విచిత్రమైన బంధం మొదలవుతుంది. బయటకు చూస్తే శత్రువుల్లా కనిపించినా… లోపల మాత్రం ఒకరి జీవితంపై మరొకరికి బలమైన ప్రభావం ఉంటుంది.

సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ బంధం మరింత సంక్లిష్టంగా మారుతుంది. చిన్ననాటి గొడవలు, అవమానాలు, కోపం… చివరికి ఇద్దరి జీవితాలపైనా గాయాలుగా మిగులుతాయి. రూబెన్ తనలోని కోపాన్ని అదుపు చేసుకోలేకపోతుంటే, నియాల్ మాత్రం ఆ గతాన్ని వెనక్కి నెట్టేసి కొత్త జీవితం మొదలు పెట్టాలని చూస్తాడు. చాలా ఏళ్ల తర్వాత నియాల్ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతాడు. గతాన్ని దాదాపుగా మర్చిపోయానని అనుకునే సమయంలో… అతని జీవితంలోకి రూబెన్ మళ్లీ వస్తాడు. అదీ కూడా మామూలు సమయంలో కాదు… నియాల్ పెళ్లి రోజునే.

Advertisement

రూబెన్ ప్రత్యక్షం కావడంతో పెళ్లి వేడుకలో పరిస్థితులు ఒక్కసారిగా అదుపు తప్పుతాయి. ఒకప్పుడు చిన్నతనంలో జరిగిన సంఘటనలు మళ్లీ గుర్తుకు వస్తాయి. ఇద్దరి మధ్య ఉన్న కోపం, బాధ, అవమానాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఇంతకాలం దాచిపెట్టిన కొన్ని నిజాలు బయటకు రావడంతో… అసలు వాళ్ల బంధం ఇంత విషపూరితంగా మారడానికి కారణమేంటో తెలుస్తుంది.

నియాల్ ఇప్పటికైనా బాగు పడాలని కోరుకుంటే, రూబెన్ మాత్రం గతాన్ని అంత సులభంగా వదిలేయడానికి సిద్ధంగా ఉండడు. ఇద్దరూ ఎదురెదురుగా నిలబడిన ప్రతిసారీ పాత గాయాలు మరింత రేగుతాయి. చివరికి ఒకరిని ఒకరు నాశనం చేసుకునే స్థాయికి వెళ్లిన ఈ బంధం వెనుక అసలు నిజం ఏంటనేది సిరీస్‌లో నెమ్మదిగా బయటపడుతుంది. మరి ఈ అన్నదమ్ముల మధ్య అంతా శతృత్వం ఎలా వచ్చింది ? దానికి కారణం ఎవరు ? చివరికి ఏం జరిగిందో తెలియాలంటే ఈ సిరీస్ ను పూర్తిగా చూడాల్సిందే.

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

‘హాఫ్ మ్యాన్’ ప్రస్తుతం ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ ఆడియో లేదు. ఒరిజినల్ ఇంగ్లీష్ ఆడియో, సబ్‌టైటిల్స్‌తోనే చూడాలి.

Read Also: చనిపోయిన అమ్మాయి నుంచి వాయిస్ మెసేజ్… అసలు కథ తెలిస్తే దిమ్మతిరుగుతుంది మావా

Related News

ఆ ఊరిలో ప్రతి 10 ఏళ్లకో నరబలి… ఓటీటీలోకి అల్టిమేట్ డార్క్ థ్రిల్లర్… హనుమాన్ చాలీసాను పక్కన పెట్టుకుని చూడండి

లోకాన్ని నాశనం చేయాల్సిన విలన్ బాబు మిస్సింగ్… ఏంజెల్ డెమన్ల టెన్షన్ పీక్స్… మతిపోగొట్టే ఫ్యాంటసీ సిరీస్

తండ్రినే చంపాలని కూతురికి ఆర్డర్… మైండ్ బ్లాకింగ్ స్పై థ్రిల్లర్ సిరీస్

30 వేల ఏళ్లుగా నిద్రపోతున్న డెవిల్ ని గెలికింది… క్యూట్ ఫెయిరీ చేసిన పనికి వరల్డ్ కే వణుకు… ఈ ఫాంటసీ లవ్ కాంబో వేరే లెవెల్

కేస్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి లవ్ డ్రామా… డాక్టర్ తో ఫైర్‌ఫైటర్ రొమాంటిక్ లవ్ ట్రాక్

లండన్‌లో వడాపావ్ బిజినెస్‌తో కోట్ల సంపాదన… కానీ ఆ ఒక్క సీక్రెట్ బయటపడితే అంతా షెడ్డుకే

18 ఏళ్ల శత్రుత్వం… బద్దశత్రువుల ఇంట్లో పుట్టి ప్రేమలో పడే జంట… క్రేజీ కొరియన్ రొమాంటిక్ సిరీస్

24 ఏళ్లకే ఫార్ములా వన్ ప్రపంచ ఛాంపియన్… షుమాకర్ లెజెండ్ గా మారిన గూస్‌బంప్స్ మూమెంట్

Big Stories

Advertisement
×