Meenakshi Chaudhary : టాలీవుడ్ ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ మధ్య ఈమె చేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అవుతున్నాయి. రీసెంట్ గా విక్టరీ వెంకటేష్ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించింది.. ఆ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఈమె వరుసగా సినిమాలకు బిజీ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ ప్రస్తుతం వాణిజ్య ప్రకటనలు మాత్రమే కనిపిస్తుంది. పెద్దగా సినిమాలను అనౌన్స్ చేసినట్లు కనిపించలేదు. అయితే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. అదేంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీ ఈమె పక్కనపెట్టేసిందనే టాక్..
టాలీవుడ్ కు మీనాక్షి దూరం..?
ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అవ్వడం అనేది మీనాకు కరెక్ట్ గా సెట్ అవుతుంది. గతంలో చేసిన సినిమాలు అన్నీ ఒక ఎత్తు.. సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా ఆమె క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం `అనగనగా ఒక రోజు` అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా ప్రారంభమైన దగ్గర నుంచి మళ్లీ ఎలాంటి అప్ డేట్ లేదు. ఇది మీనాక్షి కెరీర్ లో ఏమాత్రం ఊహించనది.. హిట్ మూవీతో బోణి కొట్టినా వర్కౌట్ కాలేదు. స్టార్ లీగ్ లో చేరడం పెద్ద పనిగా కనిపించలేదు. సక్సెస్ తో వచ్చిన గుర్తింపు.. పెర్పార్మర్ కావడంతో? టాలెంట్ తో తన సత్తాను చూపించుకోవాలని అనుకున్న కూడా చేతిలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు అయితే లేవు. ఈ వార్తలు కాస్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి. మీనాక్షిని టాలీవుడ్ ఇండస్ట్రీ దూరం పెట్టేసిందా? ఎందుకు ఆపర్స్ రావడం లేదు.. ఇలా ఆమె అభిమానులకు అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ ఇస్తుందో చూడాలి..
Also Read :ఆదివారం టీవీల్లో అదరగొట్టే సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
ఇండస్ట్రీలో పోటీ ఎక్కువే..
సినీ ఇండస్ట్రీలో కొత్త హీరోయిన్లకు కొదవలేదు. అయితే ఒక్క సినిమా హిట్ అయితే వాళ్లని నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. ఒక్క ఫ్లాప్ కనుక పడితే ఆ తర్వాత ఆ హీరోయిన్ ఇండస్ట్రీకి దాదాపు దూరమైనట్టే. ఈమధ్య సక్సెస్ సినిమాలు ఉన్నా కూడా ఛాన్సులు రావడం లేదు. టాలీవుడ్ యంగ్ హీరోయిన్ మీనమ్మ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ట్యాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉంటేనే అవకాశాలు వస్తున్నాయి. పైగా మీనాక్షి చౌదరి కొన్ని పరిమితులతోనే నటిగా కొనసాగుతోంది. గ్లామర్ పాత్రలకు తొలి నుంచి దూరంగానే ఉంది. ఆ కారణంగానూ కొన్ని అవకాశాలు కోల్పోయింది.. మరి ఈ ఏడాదిలో కనీసం ఒక్కటైనా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పడుతుందేమో చూడాలి… ప్రస్తుతం తమిళంలో కూడా బిజీగా సినిమాలు చేస్తుంది.