OTT Movie : సైన్స్ ఫిక్షన్ సినిమాలుస్పెషల్ ఎఫెక్ట్స్ తో మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అందులోనూ ఏలియన్ సినిమాలను మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా 1995 లో విడుదలైంది.1996 సాటర్న్ అవార్డ్స్‌లో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ గెలుచుకుంది. నటాషా హెన్స్ట్రిడ్జ్ బెస్ట్ యాక్ట్రెస్‌కు నామినేట్ అయింది. MTV మూవీ అవార్డ్స్ 1996లో హెన్స్ట్రిడ్జ్ బెస్ట్ కిస్ (మాడ్సెన్‌తో) ను కూడా గెలుచుకుంది. విమర్శకులు క్రీచర్ డిజైన్, యాక్షన్ సీక్వెన్స్‌లను మెచ్చుకున్నారు. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
కథలోకి వెళ్తే
1993లో SETI (సెర్చ్ ఫర్ ఎక్స్‌ట్రాటెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్) అనే ప్రోగ్రామ్ గ్రహాంతర వాసుల సందేశాన్ని అందుకుంటుంది. ఇందులో మానవ DNAతో కలిపి హైబ్రిడ్ జీవిని సృష్టించే సూచనలు ఉంటాయి. జేవియర్ ఫిచ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం, ఈ ప్రయోగాన్ని రహస్య ల్యాబ్‌లో నిర్వహిస్తుంది. ఫలితంగా సిల్ అనే హైబ్రిడ్ జీవి జన్మిస్తుంది. ఆమె బయటి నుండి మనిషిగా కనిపిస్తుంది, కానీ వేగవంతమైన పెరుగుదలను కలిగి ఉంటుంది. 12 ఏళ్ల వయసులో సిల్ ల్యాబ్ నుండి తప్పించుకుంటుంది. లాస్ ఏంజిల్స్‌లోకి పారిపోతుంది. ఫిచ్ తనని పట్టుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటుచేస్తాడు. ఇంతలో సిల్ మానవులతో ఏకాంతంగా గడుపుతూ, తన జాతిని విస్తరించే పనిలో ఉంటుంది.
సిల్ తన గ్రహాంతర శక్తులను ఉపయోగించి, ఆ బృందం నుండి తప్పించుకుంటూ, మగాళ్లతో గడిపేందుకు క్లబ్‌లు, బార్‌లలో తిరుగుతుంది. ఆమె ఒక వ్యక్తిని ఎంచుకుని, సంతానం కోసం ప్రయత్నిస్తుంది. కానీ అతను పనికిరాడని తెలిసి హత్య చేస్తుంది. ఆ తరువాత సిల్ మరో ఏలియన్ తో తలపాడాల్సి వస్తుంది. ఇక్కడ స్టోరీ భయంకరమైన మలుపులు తీసుకుంటుంది. సిల్ ని సైంటిస్టులు బంధిస్తారా ? సిల్ మరో ఏలియన్ తో ఎందుకు తలపడుతుంది ? సిల్ సంతతి పేరుగుతుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో
‘స్పీసీస్’ (Species) ఒక అమెరికన్ సైన్స్ ఫిక్షన్ హారర్ చిత్రం. ఇది రోజర్ డోనాల్డ్సన్ దర్శకత్వంలో రూపొందింది. ఇందులో నటాషా హెన్స్ట్రిడ్జ్ (సిల్), బెన్ కింగ్స్లీ (జేవియర్ ఫిచ్), మైఖేల్ మాడ్సెన్ (ప్రెస్టన్ లెనాక్స్), ఆల్ఫ్రెడ్ మోలినా (డాన్ స్మిత్సన్) నటించారు. ఈ సినిమా జులై 7, 1995న విడుదలై, $35 మిలియన్ బడ్జెట్‌తో $113 మిలియన్ లు వసూలు చేసింది. ఆతరువాత స్పీసీస్ II (1998), స్పీసీస్ III (2004), స్పీసీస్: ది అవేకనింగ్ (2007) సీక్వెల్స్‌కు దారితీసింది. ఇది IMDbలో 5.8/10 రేటింగ్ ని పొందింది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీ, ఫండాంగో ఎట్ హోమ్ లో అందుబాటులో ఉంది.