Intinti Ramayanam Today Episode August 31st: నిన్నటి ఎపిసోడ్ లో.. పార్వతికి ఇచ్చిన మాట ప్రకారం అక్షయ పూజకు వచ్చేలా చేస్తుంది అవని. అక్షయ్ ఈ హడావిడిగా ఇంటికి వస్తాడు. నాకోసం ఎవరైనా వచ్చారా అని అడుగుతాడు.. అక్షర రావడం చూసిన అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. పల్లవి శ్రియాలు మాత్రం షాక్ లో ఉండిపోతారు. నేను ఇక్కడికి వచ్చింది నా బాస్ కోసం అని తెలిస్తే వీళ్లు ఏమనుకుంటారు అని మౌనంగా ఉండిపోతారు. అప్పుడే ఇంటికి వాళ్ళ బాస్ వస్తుంది. ఇంట్లో వాళ్ళందరికీ బాస్ ని పరిచయం చేస్తాడు..
అయితే రాజేంద్రప్రసాద్ కాలేజీ ఫ్రెండ్ కావడంతో పార్వతి వాళ్ళిద్దరి సాన్నిత్యం చూసి కుళ్ళుకుంటుంది. నీ భార్యని కూడా పరిచయం చేయమని మేడమ్ అడుగుతుంది. అక్షయ్ మాత్రం అవని దగ్గరికి వెళ్లి వేడుకుంటాడు. మొత్తానికి అవని మాట ప్రకారం అక్షయ్ తన మేడం దగ్గర పొగడ్తల వర్షం కురిపిస్తాడు.. రాజేంద్రప్రసాద్ కు అసలు నిజం చెప్పేస్తుంది అవని. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే… అవనితో సీక్రెట్ గా మాట్లాడతాడు శ్రీకర్.. అన్నయ్య చేత డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్న అతను మనకు ఒకసారి దొరికినట్లే దొరికి తప్పించుకున్నాడు కదా వదినా.. ఇప్పుడు అతను నా దగ్గరే ఉన్నాడు నా ఫ్రెండ్ ఇంట్లో సేఫ్ గా ఉంచాను. అతని ఇక్కడికి తీసుకొని వస్తే అసలు విషయం బయట పడుతుంది కదా.. పల్లవి వాళ్ళ నాన్న చేస్తున్న మోసాలు బయట పడతాయి కదా అని శ్రీకర్ అంటాడు. ఆ మాటలు పల్లవి విని షాక్ అవుతుంది.. వ్రతం జరిగే సమయంలో ఇవన్నీ ఎందుకు శ్రీకర్ అని అవని అంటుంది. ఇదే మంచి సమయం వదిన..
నువ్వు ఏ తప్పు చేయలేదని అమ్మ కూడా తెలుసుకుంటుంది అన్నయ్య నువ్వు మళ్ళీ మనస్పర్ధలు తొలగిపోయి కలుసుకుంటారు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు.. అప్పుడే తన ఫ్రెండు ఆ వ్యక్తిని తీసుకొని అక్కడికి వస్తాడు. వీడు లాయర్లు పోలీసులు అంటూ నన్ను బెదిరిస్తున్నాడు రా అందుకే తీసుకొచ్చాను అని అంటాడు. నేను ఇప్పుడే రా వదినతో అంటున్నాను అని శ్రీకర్ అంటాడు. నీ చేత ఎవరు సంతకాలు చేయించుకుని రమ్మన్నారు చెప్పు అని అందరూ అతన్ని కొడతారు.
ఇలా అయితే వాడు నోరు విప్పడు. నాకు వదిలేయండి అని కమలంటాడు.. అక్షయ్ ఎప్పుడు అక్కడికి వస్తాడు.. ఎవడ్రా నీ చేత సంతకాలు పెట్టించింది చెప్పురా అని అడుగుతాడు. ముగ్గురు అన్నదమ్ములు కలిసి వాడిని దారుణంగా కొడతారు. ఇక అతను పల్లవి వాళ్ళ నాన్న ఇద్దరు కలిసి నా చేత ఈ సంతకాలు చేయించుకోమని అన్నారు అని బయటపెడతాడు. ఆ మాట వినగానే కమల్ రెచ్చిపోతాడు. పార్వతి మంచిగానే ఉంటూ మా ఇంటికి మంచి చేస్తున్నానని ఇలాంటి చెడు బుద్ధి ఎలా ఆలోచించావు అని అంటుంది. పాముకి పాలు పోసినట్లు నిన్ను ఇన్ని రోజులు ఇంట్లో పెట్టి దేవతల చూసుకున్నాం కదా అని భానుమతి అంటుంది.
Also Read: అల్లు అర్జున్ – అట్లీ మూవీలో స్పెషల్ గెస్ట్.. ఇది కదా ఫ్యాన్స్ కు కావాల్సింది..!
సొంత మనవరాలు కదా రెండు కుటుంబాలు నీవల్లే కలిసాయి అని సంతోషపడ్డాను. కానీ నువ్వు మాత్రం ఇలాంటి దానివని అస్సలు ఊహించలేదు అని అంటుంది. ఇక కమల్ ఇలాంటిది నాకొద్దు దీన్ని చంపేస్తాను అని అంటాడు. ఇక అందరూ కలిసి కమల్ ని ఆపుతారు. కమల్ పల్లవిని బయటకి గెంటేస్తాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. మరి ఇది నిజంగానే జరుగుతుందా? నిజం తెలిస్తే జరిగేది ఇదే అని పల్లవి కలగంటుందా? పల్లవి దొరికితే సీరియల్ అయిపోతుంది. ఏదైన ట్విస్ట్ ఇస్తాడేమో డైరెక్టర్ అన్నది సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..