Sex Before Marrige: పెళ్లి చూపులు ఎలా జరుగుతాయి? సింపుల్ గా అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రుల సమక్షంలో ఒకరికొకరు చూసుకుంటారు. ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడుకుంటారు. ఒకరికొకరు నచ్చితే తల్లిదండ్రులు ఇద్దరి పెళ్లి చేస్తారు. ఇదీ మామూలుగా జరిగే పెళ్లి చూపుల వ్యవహారం. కానీ, మనదేశంలో ఓ చోట చాలా డిఫరెంట్ గా పెళ్లి చూపులు జరుగుతాయి. పెళ్లికి ముందే తమ పిల్లలు లైంగికంగా ఒక్కటయ్యేలా తల్లిందండ్రులే ప్రత్యేకంగా వారికి ఇంటికి దూరంగా గుడిసెలు ఏర్పాటు చేస్తారు. సుమారు వారం రోజుల పాటు అమ్మాయి, అబ్బాయిలను ఏకాంతంగా గడిపేందుకు ప్రోత్సహిస్తారు. మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే కదా మీ ప్రశ్న? అయితే, ఈ స్టోరీ చదవాల్సిందే!
ఇంతకీ, ఈ సంప్రదాయం ఎక్కడుందో తెలుసా?
అరుదైన ఈ సంప్రదాయం మనకు దగ్గరలోనే ఉన్న చత్తీస్ గఢ్ లో అనాదిగా వస్తోంది. ఈ రాష్ట్రంలోని ఓ ప్రాచీన తెగలో ఇప్పటికీ ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ముఖ్యంగా మురియా తెగలోని ఈ సంప్రదాయం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. బస్తర్ జిల్లాలోని ఇంద్రావతి నది సమీపంలో ఈ తెగ ప్రజలు నివసిస్తుంటారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో ఇక్కడికి బయటి వ్యక్తులు రారు. ఈ తెగలోని పిల్లలకు పెళ్లిళ్లు కుదర్చరు. తమకు నచ్చిన జీవిత భాగస్వామిని పెళ్లి చేసుకునే స్వేచ్ఛను పిల్లలకే వదిలేస్తారు. అంతేకాదు, వారిని పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొని ఎంచుకునే అవకాశం కల్పిస్తారు. ఈ సంప్రదాయాన్ని ‘గోటుల్’ అని పిలుస్తారు. పెళ్లికి ముందు యువతీ యువకులు తమ భాగస్వామి లైంగిక సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు నచ్చిన వారితో గడిపేందుకు అనుమతిస్తారు.
ఇంటికి దూరంగా గుడిసెల ఏర్పాటు
పెళ్లి వయసుకు వచ్చిన యువతీ యువకులు కలుసుకునేలా తల్లిందండ్రులే ఇంటికి కాస్త దూరంలో గుడిసె ఏర్పాటు చేస్తారు. ఒక గుడిసెలో ఒక జంట మాత్రమే ఉండాలి. అందులో వాళ్లు ముచ్చట్లు చెప్పుకోవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు. చివరికి లైంగికంగానూ కలవచ్చు. వారం రోజుల పాటు వారిని ఎవరూ డిస్ట్రబ్ చేయరు. అమ్మాయిలను గుడిసెలోకి పంపే ముందు వేడుక నిర్వహిస్తారు. అబ్బాయికి అమ్మాయి నచ్చినట్టయితే, ఆమె తలలో పువ్వు పెట్టాలి. ఆ అబ్బాయి నచ్చితేనే అమ్మాయి తన తలలో పువ్వు పెట్టేందుకు అనుమతిస్తుంది. ఒకవేళ వారికి నచ్చకపోతే వేరొకరిని ఎంపిక చేసుకుని మరో వారం రోజులు గడిపే అవకాశం ఉంటుంది. ఈ సంప్రదాయం వల్ల ఆ ప్రాంతంలో లైంగిక నేరాలు లేవంటున్నాయి పలు నివేదికలు.
కాంబోడియాలోనూ ఇలాంటి సంప్రదాయం
మన దేశంలోనే కాదు.. కంబోడియాలో కూడా ఇలాంటి సాంప్రదాయమే ఉంది. అక్కడ కూడా అమ్మాయిలను గుడిసెల్లోకి పంపి ఏడు రోజులుపాటు నచ్చని అబ్బాయితో ఏకాంతంగా గడిపేందుకు ప్రోత్సహిస్తారు. ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకుంటారు. లేదంటే, మరొకరితో ఇలాగే గడిపి సెలెక్ట్ చేసుకుంటారు. రతనకిరిలోని క్రెయుంగ్ లాంటి తెగలలో ఈ సంప్రదాయం కనిపిస్తుంది. అ దానివల్ల చాలామంది పెళ్లి కాకుండానే తల్లులు అవుతున్నారట. ఈ నేపథ్యంలో ఈ సంప్రదాయాన్ని నిషేధించాలని పలువురు సామాజిక కార్యకర్తలు కోరుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: ఖైరతాబాద్ లో ఆత్మలు, అక్కడ అడుగు పెట్టారో ప్రాణాలు పోయినట్టే!