E-Paper

NTR 31.. ‘డ్రాగన్’ లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్.. ప్రశాంత్ నీల్ ఆ రిస్క్ దాటుతాడా?

NTR 31.. ‘డ్రాగన్’ లేటెస్ట్ షూటింగ్ అప్‌డేట్.. ప్రశాంత్ నీల్ ఆ రిస్క్ దాటుతాడా?
Advertisement

Dragon Movie: ‘డ్రాగన్’ (NTR 31)…’మ్యాన్ ఆఫ్ మాసెస్’ జూనియర్ ఎన్టీఆర్ మరియు సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ ఇది. కేజీఎఫ్, సలార్ చిత్రాలతో మాస్ పల్స్ పట్టుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇప్పుడు తారక్‌ను సరికొత్తగా  ఎలా చూపిస్తాడనే క్యూరియాసిటీ అందరిలో కనిపిస్తుంది.ఇక ఈ మధ్య ఇటీవలే  విడుదలైన గ్లింప్స్ ఒక రేంజ్ హైప్ క్రియేట్ చేసినప్పటికీ, ఈ ప్రాజెక్ట్ చుట్టూ వినిపిస్తున్న మిక్స్డ్ టాక్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

వదిలిన గ్లిమ్ప్స్ చూస్తే  ఈ సినిమా అంతర్జాతీయ ఓపియం అంటే నల్లమందు స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే పీరియాడిక్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది.ఇందులో ఎన్టీఆర్ పాత్ర పేరు ‘లూగర్’ అని, ఇది ఒక పవర్‌ఫుల్ జర్మన్ పిస్టల్ పేరును సూచిస్తుందని ప్రచారం జరుగుతోంది. దానికి తగ్గట్టుగానే తారక్ క్యారెక్టర్ సినిమాలో అత్యంత క్రూరంగా, వైల్డ్ అండ్ రగ్గడ్‌గా ఉండబోతోందనే వార్త మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పిస్తోంది.

రుక్మిణి వసంత్ మరియు ఎన్టీఆర్‌లపై లవ్ సాంగ్‌

Advertisement

ప్రస్తుతం జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా తర్వాతి  షెడ్యూల్ కోసం శ్రీలంకలోని దట్టమైన అడవులు, ఎత్తైన కొండలు, సముద్రతీర లొకేషన్లను ఎంపిక చేశారట. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ల పర్యవేక్షణలో అక్కడ భారీ ఎత్తున ప్లాన్ చేసిన ఇంటర్నేషనల్ ఫైట్ సీక్వెన్స్ సినిమాకే మేజర్ హైలైట్ కానుందని టాక్.ఇక ఇదే షెడ్యూల్‌లో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ మరియు ఎన్టీఆర్‌లపై ఒక రిచ్ లవ్ సాంగ్‌ను కూడా చిత్రీకరించనున్నారు,చూస్తుంటే  ఈ ఫ్రెష్ జోడీ స్క్రీన్ పై సరికొత్త మ్యాజిక్ క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Also read :కృతి శెట్టితో శంకర్ కొడుకు రొమాన్స్.. ‘లవర్ బాయ్’గా అర్జిత్ గ్రాండ్ ఎంట్రీ!

Advertisement

దీనికి తోడు బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, మలయాళ స్టార్ బిజు మీనన్ లాంటి వర్సటైల్ యాక్టర్స్ ప్రాజెక్ట్‌లోకి రావడం సినిమాకు గ్లోబల్ అప్పీల్ తెచ్చిపెట్టింది. రవి బస్రూర్ మాస్ మ్యూజిక్, ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లను షేక్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు మేకర్స్.

అలా అయితే కష్టమే 

అయితే ఈ ప్రాజెక్ట్ పై ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయో, అంతే స్థాయిలో డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.ప్రశాంత్ నీల్ అనగానే మనకు గుర్తొచ్చేది కోల్‌మైన్స్, కేజీఎఫ్ షేడ్స్, సలార్‌లోని డార్క్ విజువల్స్. ఇప్పుడు ‘డ్రాగన్’ కూడా అదే డార్క్ థీమ్, నల్లమందు స్మగ్లింగ్ బ్యాక్‌డ్రాప్ అంటే ఆడియన్స్‌కు మళ్లీ పాత ఫ్లేవర్ రిపీట్ అయినట్టు అనిపిస్తుందా అనే టెన్షన్ ఫ్యాన్స్‌లో మొదలైంది. కథలో బలమైన ఎమోషన్, కొత్తదనం లేకపోతే కేవలం బిల్డప్స్, ఎలివేషన్లతో మాత్రమే సినిమాను నెట్టుకురావడం కష్టమనే అభిప్రాయాలు ఉన్నాయి.

బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో

మరో ప్రధాన సమస్య డేట్స్ మేనేజ్మెంట్ మరియు షూటింగ్ డిలేస్…ఇప్పటికే అనుకున్న దాని కన్నా షెడ్యూల్స్ మరిన్ని వేయాల్సిన పరిస్థితి. అలాగే మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా అత్యంత భారీ ఖర్చుతో ఈ సినిమాను నిర్మిస్తున్నందున బాక్సాఫీస్ వద్ద రికవరీ ప్రెజర్ కూడా చాలా ఎక్కువ.

Also read :మణికొండ మొత్తం కొనేసేవాడిని.. ఓవర్ కాన్ఫిడెన్స్ ముంచేసింది.. ‘చిత్రం’ శ్రీను షాకింగ్ కామెంట్స్!

ఇటీవల కాలంలో భారీ యాక్షన్ చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పరంగా గట్టి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడకుండా అవుట్‌పుట్ తీసుకురావాల్సి ఉంది. 2027 జూన్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ చిత్రం, రొటీన్ ఫార్ములా అనే నెగెటివిటీని దాటుకుని ప్రశాంత్ నీల్ మార్క్ యాక్షన్ ఎలివేషన్స్, తారక్ ఇంటెన్సిటీతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

Related News

బాహుబలి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదుగా.. ఫ్రాన్స్‌లో ప్రభాస్ యానిమేషన్ సినిమా సెన్సేషన్!

కృతి శెట్టితో శంకర్ కొడుకు రొమాన్స్.. ‘లవర్ బాయ్’గా అర్జిత్ గ్రాండ్ ఎంట్రీ!

మణికొండ మొత్తం కొనేసేవాడిని.. ఓవర్ కాన్ఫిడెన్స్ ముంచేసింది.. ‘చిత్రం’ శ్రీను షాకింగ్ కామెంట్స్!

షాకింగ్ సర్ప్రైజ్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘స్పైడర్‌మ్యాన్’ కపుల్!

సెక్యూరిటీలో ‘మహిళా బౌన్సర్’.. తలపతి విజయ్ క్రేజీ డెసిషన్ వైరల్

మెగాస్టార్ 158 సెట్స్ లోకి ఎంట్రీ.. భారీ అంచనాలు, అంతకుమించిన అనుమానాలు!

ఆ హిట్ సినిమా రీమేక్ ? అనిల్ రావిపూడి కొత్త సినిమా కథపై సరికొత్త లీక్స్ !

×