E-Paper

మణికొండ మొత్తం కొనేసేవాడిని.. ఓవర్ కాన్ఫిడెన్స్ ముంచేసింది.. ‘చిత్రం’ శ్రీను షాకింగ్ కామెంట్స్!

మణికొండ మొత్తం కొనేసేవాడిని.. ఓవర్ కాన్ఫిడెన్స్ ముంచేసింది.. ‘చిత్రం’ శ్రీను షాకింగ్ కామెంట్స్!
Advertisement

Chitram Srinu: టాలీవుడ్ కమర్షియల్ సినిమాల్లో తనదైన బాడీ లాంగ్వేజ్, డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో మెప్పించిన సీనియర్ కమెడియన్ ‘చిత్రం’ శ్రీను సంచలన వ్యాఖ్యలు చేశారు. తేజ దర్శకత్వంలో 2000 జూన్ 9న విడుదలైన ‘చిత్రం’ సినిమాతో వెండితెరకు పరిచయమై, ఆ సినిమా పేరే తన ఇంటిపేరుగా మార్చుకున్న శ్రీనివాసులు.. కెరీర్ పీక్ స్టేజ్‌లో తాను చేసిన తప్పులను ఓపెన్‌గా ఒప్పుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

చేతి నిండా డబ్బు.. కానీ ముందుచూపు లేదు!

“నేను ఎప్పుడూ డబ్బును డబ్బుగా చూడలేదు. చేతికి వచ్చిన డబ్బునల్లా స్నేహితులకు, పార్టీలకే విపరీతంగా ఖర్చు చేశాను. ఆ రోజుల్లోనే నేను గనుక కాస్త బుద్ధి ఉపయోగించి డబ్బును పొదుపు చేసుంటే.. ఈరోజు మణికొండలో సగం ఏరియా నా చేతుల్లోనే ఉండేది” అంటూ శ్రీను తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also read :షాకింగ్ సర్ప్రైజ్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘స్పైడర్‌మ్యాన్’ కపుల్!

ఒకప్పుడు రోజుకి నాలుగైదు సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. “అప్పట్లో ఉన్న రియల్ ఎస్టేట్ రేట్లకు, నాకు వచ్చిన సంపాదనకు మణికొండలో సగం ఆస్తులు కొనడం పెద్ద లెక్కేం కాదు. కానీ, అవకాశాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, డబ్బులు ఎప్పుడూ కురుస్తూనే ఉంటాయనే భ్రమలో బతికేశా. అది ఎంత పెద్ద తప్పు అనేది తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది” అని వాపోయారు.

జూబ్లీహిల్స్ లో ఇల్లు.. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ముంచేసింది!

Advertisement

తన పతనానికి కారణమైన ‘ఓవర్ కాన్ఫిడెన్స్’ గురించి శ్రీను మాట్లాడుతూ.. “నేను చాలా గొప్ప ఆర్టిస్ట్‌ని, ఎప్పుడూ బిజీగానే ఉంటాను, త్వరలోనే జూబ్లీహిల్స్‌లో పెద్ద ఇల్లు కొంటాను అనే ఓవర్ కాన్ఫిడెన్స్ నాలో బలంగా ఉండేది. మనుషులకు కాన్ఫిడెన్స్ ఉండాలి కానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదనే చేదు నిజం లైఫ్ ప్రాక్టికల్‌గా నేర్పించింది” అని చెప్పారు.

సినిమా అవకాశాలు తగ్గినప్పుడు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, ఆ టైమ్‌లో స్టేజ్ ఈవెంట్స్, కొందరు ప్రాణ స్నేహితులు తనను ఆదుకున్నారని కృతజ్ఞత భావంతో గుర్తు చేసుకున్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ క్రమశిక్షణ, ముందుచూపు ఎంత అవసరమో ఇప్పుడు తనకు పూర్తిగా అర్ధమైందని స్పష్టం చేశారు.

‘ఎల్లమ్మ’తో సెకండ్ ఇన్నింగ్స్ రీ-బూస్ట్!

‘చిత్రం’ తర్వాత ‘నువ్వు నేను’ (2001), ‘మనసంతా నువ్వే’ (2001), ‘ఆది’ (2002), ‘దిల్’ (2003) వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించిన చిత్రం శ్రీను.. ఇప్పుడు సరికొత్త ప్రాజెక్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తన స్నేహితుడు వేణు దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఎల్లమ్మ’లో శ్రీను ఒక అత్యంత కీలకమైన, డిఫరెంట్ రోల్  పోషిస్తున్నారు.

Also read :మెగాస్టార్ 158 సెట్స్ లోకి ఎంట్రీ.. భారీ అంచనాలు, అంతకుమించిన అనుమానాలు!

“నా బెస్ట్ ఫ్రెండ్ వేణు డైరెక్షన్‌లో నేను యాక్ట్ చేయడం నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ సినిమా నా కెరీర్‌లో ఖచ్చితంగా ఒక మైలురాయిగా నిలుస్తుంది” అని  ధీమా వ్యక్తం చేశారు శ్రీను.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం గురించిన మరిన్ని అప్‌డేట్స్ త్వరలోనే రివీల్ కానున్నాయి. ఒకప్పటి స్టార్ కమెడియన్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘ఎల్లమ్మ’ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ఇస్తారో చూడాలి మరి !

Related News

కృతి శెట్టితో శంకర్ కొడుకు రొమాన్స్.. ‘లవర్ బాయ్’గా అర్జిత్ గ్రాండ్ ఎంట్రీ!

షాకింగ్ సర్ప్రైజ్.. సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ‘స్పైడర్‌మ్యాన్’ కపుల్!

సెక్యూరిటీలో ‘మహిళా బౌన్సర్’.. తలపతి విజయ్ క్రేజీ డెసిషన్ వైరల్

మెగాస్టార్ 158 సెట్స్ లోకి ఎంట్రీ.. భారీ అంచనాలు, అంతకుమించిన అనుమానాలు!

ఆ హిట్ సినిమా రీమేక్ ? అనిల్ రావిపూడి కొత్త సినిమా కథపై సరికొత్త లీక్స్ !

నజ్రియా కొంపముంచిన సెన్సేషనల్ పోస్ట్.. ఆ ఒక్క మాటతో బుక్కయిపోయిందా?

రామ్ చరణ్ ప్రేమను పరీక్షించిన ఉపాసన.. కార్ తలుపులు బాదిన జనాలు!

×