NTR-Trivikram God of War Update: గాడ్ ఆఫ్ వార్ .. ఈ సినిమాని ఎప్పుడైతే త్రివిక్రమ్ బన్నీతో చేయబోతున్నాడు అన్న వార్తలు మీడియాలో వచ్చాయో అప్పటి నుండే రోజులు లెక్కెట్టుకోవడం మొదలెట్టారు మూవీ లవర్స్. తీరా బన్నీ డేట్స్ కుదిరేలా లేవని, తారక్ తోనే గురూజీ ఈ సినిమా చేయబోతున్నాడు అన్న టాక్ వినబడింది.ఇక సినిమా పేరు స్కంద సేన అని, ఈ సినిమా కుమారస్వామి బ్యాక్ డ్రాప్ లో జరగబోతుంది అన్న హింట్ రావడంతో ఇది కదా మాక్కావలసింది అంటూ మురిసిపోయారు తారక్ ఫ్యాన్స్.అయితే సినిమా పై ఎన్ని గాసిప్స్ సర్క్యులేట్ అయినా అటు తారక్ నుండి కాని, ఇటు త్రివిక్రమ్ నుండి కాని ఎలాంటి అప్ డేట్స్ రాకపోవడం గమనార్హం.
ఇక తారక్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే డ్రాగన్ కోసం జట్టు కట్టడం, ఈ గ్యాప్ లో గురూజీ ఖాళీగా ఉండకుండా వెంకీ మామతో ఆదర్శకుటుంబం అంటూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని సెట్స్ పైకి తీసికెళ్ళడం చక చక జరిగిపోయాయ్.ఇక తాజాగా ఆదర్శకుటుంబం అక్టోబర్ 2న రిలీజ్ కాబోతుందని అనౌన్స్ చేశారు కూడా.దీనితో ఇక త్రివిక్రమ్ మళ్ళీ మనసు గాడ్ ఆఫ్ వార్ మీదికి వెళ్తుందని సోషల్ మీడియా ఊదరగొట్టేసింది.
ఈ క్రమంలోనే చెప్పి చెప్పనట్టుగా ది టైమ్ హాస్ కమ్ ఓ క్రేజీ లీక్ వదిలాడు ప్రొడ్యూసర్ నాగ వంశీ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పెన్ పవర్ ఏంటో ప్రపంచానికి చూపించే టైమ్ వచ్చేసింది! ఆయన కెరీర్‌లోనే అత్యంత భారీ లెవెల్‌లో, ఎలాంటి లిమిట్స్ లేని ఒక పెద్ద ప్రాజెక్ట్‌తో మన ముందుకు రాబోతున్నారు.ఆయన ఊహల్లోంచి పుట్టిన ఆ క్రేజీ విజన్ మరికొన్ని గంటల్లోనే మన కళ్లముందుకు రాబోతోంది.అంటూ ట్విట్టర్ లో పోస్ట్ వదలడంతో ఒక్కసారిగా టాలీవుడ్ షేక్ అయిపొయింది.అందరు అనుకుంటున్నట్టుగానే త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ గురించి ఒక సాలిడ్ అప్ డేట్ వదలనున్నారని ఆశ పడుతున్నారు తారక్ ఫ్యాన్స్.
ఇంకెన్ని సంచలనాలకి వేదిక అవుతుందో
అజ్ఞాతవాసి లాంటి అట్టర్ ప్లాప్ తర్వాత గురూజిని మళ్ళీ ఇండస్ట్రీలో నిలబెట్టిన సినిమా 2018 అక్టోబర్ 11న విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’. ఈ సినిమాలో తారక్ నట విశ్వరూపాన్ని మరోసారి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించాడు త్రివిక్రమ్.దీంతో ఈ కాంబోలో మరో సినిమా ఎప్పుడెప్పుడా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కి ఇది మాంచి కిక్కిచ్చే న్యూస్ అనే చెప్పాలి.ఇక ఈ సినిమా విషయానికి వస్తే తారక్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో హరిని హసిక క్రియేషన్స్ ఈ సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించనుందని సమాచారం.
ఇక చూస్తుంటే మరికొద్ది గంటల్లోనే రాబోతున్న క్రేజీ అప్ డేట్ కోసం అప్పుడే సోషల్ మీడియాలో రచ్చ మొదలైపోయింది.ఇంకొందరు అయితే ఇలా ఉంటుంది, అలా ఉంటుంది అంటూ కుమారస్వామీ లుక్ లో తారక్ ని అచ్చు గుద్దినట్టు దించేస్తున్నారు కూడా. చూడాలి మరి ఎన్నడూ రానటువంటి సరికొత్త మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ వార్ మూవీ ఇంకెన్ని సంచలనాలకి వేదిక అవుతుందో !
The time has come to unleash the unparalleled power of Trivikram Srinivas’ pen to the world on the grandest canvas of his career, a canvas without boundaries, without limitations.
His most ambitious vision begins unfolding in just a few hours. 🦚
— Naga Vamsi (@vamsi84) June 29, 2026