E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

డిస్‌ప్లే అదుర్స్.. డిజైన్ నెక్స్ట్ లెవెల్, ఇలాంటి ఫీచర్లు ఇతర స్మార్ట్ ఫోన్‌లో ఉండవు

డిస్‌ప్లే అదుర్స్.. డిజైన్ నెక్స్ట్ లెవెల్, ఇలాంటి ఫీచర్లు ఇతర స్మార్ట్ ఫోన్‌లో ఉండవు
Advertisement

Samsung Galaxy Fit3:  ఫిట్‌నెస్ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రముఖ టెక్ దిగ్గజం శ్యామ్‌సంగ్ నుండి సరికొత్త ‘గెలాక్సీ ఫిట్ 3’ (Samsung Galaxy Fit3) మార్కెట్లోకి వచ్చింది. ఇది కేవలం మీ హెల్త్ ట్రాకర్ మాత్రమే కాదు, మీ చేతికి ఒక క్లాసీ లుక్ ఇచ్చే ప్రీమియం గ్యాడ్జెట్. చాలా తేలికగా, స్టైలిష్‌గా ఉండే ఈ స్మార్ట్ బ్యాండ్, తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లను అందిస్తోంది. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో హెల్త్ కేర్ అనేది చాలా ముఖ్యం అయిపోయింది. ముఖ్యంగా రోజుకు ఎన్ని అడుగులు వేస్తున్నాం, ఎంతసేపు నిద్రపోతున్నాం, మన హార్ట్ రేట్ ఎలా ఉంది? ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక మంచి ఫిట్‌నెస్ బ్యాండ్ చేతికి ఉంటే ఆ కిక్కే వేరు. ఒకప్పుడు ఫిట్‌నెస్ బ్యాండ్స్ అంటే చిన్న డిస్‌ప్లేతో, నల్లటి బెల్టుతో రొటీన్‌గా ఉండేవి. కానీ.. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఫిట్ 3 ఆ ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ స్మార్ట్ బ్యాండ్ ఫీచర్లు, ధర,దీని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్ల పూర్తి వివరాలు:

1.లైట్ అండ్ స్లీక్ డిజైన్:

ఈ బ్యాండ్ చూడటానికి చాలా ప్రీమియంగా ఉంటుంది. అల్ట్రా-లైట్‌వెయిట్ అల్యూమినియం బాడీతో రావడం వల్ల దీని బరువు కేవలం 18.5 గ్రాములు మాత్రమే. అంటే చేతికి పెట్టుకుంటే అసలు ఉన్నట్టే తెలియదు. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తున్నా లేదా రాత్రి నిద్రపోతున్నా ఇది చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది.

2.పెద్ద డిస్‌ప్లే.. అదిరిపోయే విజువల్స్:

Advertisement

గెలాక్సీ ఫిట్ 3లో 1.6 అంగుళాల (4.0 cm)లార్జ్ అమోలెడ్ డిస్‌ప్లే ఇచ్చారు. పాత మోడల్‌తో పోలిస్తే.. ఇది 45% పెద్దది. దీని వల్ల మెసేజ్‌లు, నోటిఫికేషన్లు, హెల్త్ డేటా చాలా స్పష్టంగా కనిపిస్తాయి. ఇందులో.. వందకు పైగా వాచ్ ఫేసెస్ ఉన్నాయి. కాబట్టి మీ డ్రెస్‌కు తగ్గట్టు ప్రతి రోజూ లుక్ మార్చేయొచ్చు.

3. సూపర్బ్ బ్యాటరీ లైఫ్:

స్మార్ట్ వాచీలలాగా దీన్ని ప్రతి రోజూ ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం లేదు.ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 13 రోజుల పాటు బ్యాటరీ లైఫ్ వస్తుంది. దీని వల్ల ట్రావెలింగ్ చేసేటప్పుడు ఛార్జర్ల తలనొప్పి ఉండదు.

4. హెల్త్ అండ్ ఫిట్‌నెస్ ఫీచర్లు:

Advertisement

100+ వర్కౌట్ మోడ్స్: రన్నింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ నుండి యోగా వరకు దాదాపు 100కు పైగా స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో ఉన్నాయి.

స్లీప్ ట్రాకింగ్ : మీ నిద్ర నాణ్యతను ఇది అద్భుతంగా అనలైజ్ చేస్తుంది. మీరు ఎంతసేపు గాఢ నిద్రలో ఉన్నారు, ఎప్పుడు మెలకువగా ఉన్నారనేది శ్యామ్‌సంగ్ హెల్త్ యాప్ ద్వారా క్లియర్ గా చూపిస్తుంది.

హార్ట్ రేట్ & SpO2 మానిటరింగ్: 24 గంటల హార్ట్ రేట్ ట్రాకింగ్ , బ్లడ్ ఆక్సిజన్ లెవెల్స్ సులువుగా కొలవవచ్చు.

స్ట్రెస్ మేనేజ్‌మెంట్: మీ ఒత్తిడి స్థాయిలను కనిపెట్టి, రిలాక్స్ అవ్వడానికి బ్రీతింగ్ ఎక్సర్‌సైజులను సూచిస్తుంది.

Also Read: ఇల్లు ఊడ్చే పనికి గుడ్ బై.. రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్లపై భారీ డిస్కౌంట్లు!

5. మరికొన్ని క్రేజీ ఫీచర్లు:

ఇందులో ‘ఫాల్ డిటెక్షన్’, ‘ఎమర్జెన్సీ SOS’ ఫీచర్లు ఉన్నాయి. అంటే మీరు ఎక్కడైనా అనుకోకుండా కిందపడిపోతే.. ఇది వెంటనే మీ లొకేషన్‌తో సహా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్‌కు అలర్ట్ పంపుతుంది. అలాగే మీ ఫోన్ కెమెరాను కంట్రోల్ చేయడానికి, మ్యూజిక్ మార్చడానికి, కాల్/మెసేజ్ నోటిఫికేషన్లు చూడటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది 5ATM, IP68 రేటింగ్‌తో వస్తుంది. కాబట్టి నీటిలో, దుమ్ములో కూడా సేఫ్‌గా ఉంటుంది.

6.ధర వివరాలు :

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఫిట్ 3 మార్కెట్లో సుమారుగా రూ.4,499 నుంచి రూ.4,999 ధరలో లభిస్తోంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, శ్యామ్‌సంగ్ అధికారిక స్టోర్లలో బ్యాంక్ ఆఫర్లను బట్టి మరింత తక్కువ ధరకే లభించే అవకాశం ఉంది. ఈ బడ్జెట్‌లో బ్రాండెడ్ ప్రీమియం లుక్ , నమ్మకమైన ట్రాకింగ్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్.

Related News

వారెవ్వా.. సింగిల్ ఛార్జ్‌తో 50 గంటలు నడిచే ఇయర్‌బడ్స్ తెచ్చిన వివో, ధర ఎంతంటే?

ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే.. ప్రాణాలకే ప్రమాదం!

ఆఫర్ అంటే ఇది కదా.. Amazon SAleలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీలపై 65% డిస్కౌంట్.. ఏ మోడల్ ఎంతంటే?

అమ్మ, నాన్నల కోసం ఫోన్ కొంటున్నారా? మార్కెట్లోని సీనియర్ ఫ్రెండ్లీ మెుబైల్స్ ఇవే!

జులైలో లాంచ్ కానున్న మోస్ట్ అవేటెడ్ మొబైల్స్.. Oppo Reno 16 నుంచి Vivo V80 వరకు అదరగొట్టే లిస్ట్ ఇదే!

తక్కువ కరెంట్ బిల్లు, హెల్తీ ఎయిర్ ఇచ్చే 5 బెస్ట్ 1.5 టన్ ఆటో క్లీన్ ఏసీలు!

Instagramలో పిచ్చి పిచ్చి పోస్టుల గోల వద్దు అనుకుంటున్నారా? అయితే ఆ రెండు కొత్త బటన్లు మీ కోసమే!

Big Stories

×