E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

జులైలో లాంచ్ కానున్న మోస్ట్ అవేటెడ్ మొబైల్స్.. Oppo Reno 16 నుంచి Vivo V80 వరకు అదరగొట్టే లిస్ట్ ఇదే!

జులైలో లాంచ్ కానున్న మోస్ట్ అవేటెడ్ మొబైల్స్.. Oppo Reno 16 నుంచి Vivo V80 వరకు అదరగొట్టే లిస్ట్ ఇదే!
Advertisement

Upcoming Phones July 2026: టెక్ ప్రియులకు జులై నెల పండగలా మారబోతోంది. ఎందుకంటే.. ఈ నెలలో మొబైల్ కంపెనీలు పోటాపోటీగా సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమయ్యాయి. మిడ్‌రేంజ్ ధరల నుంచి ప్రీమియం ఫోన్ల వరకు ఎన్నో ఆప్షన్లు మనకు అందుబాటులోకి రానున్నాయి. ఒప్పో, శాంసంగ్, వివో, మోటోరోలా, నథింగ్ వంటి ప్రముఖ బ్రాండ్లు తమ లేటెస్ట్ డివైజ్‌లతో సందడి చేయబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే టెక్ ప్రియుల్లో హాట్ టాపిక్‌గా మారిన కొన్ని ముఖ్యమైన ఫోన్ల వివరాలను ఇప్పుడు చూద్దాం.

OPPO Reno 16

ఒప్పో బ్రాండ్ నుంచి వస్తున్న ఈ మోడల్ జులై 2న విడుదల కానుంది. దీనిలో 6.32 అంగుళాల డిస్‌ప్లేతో పాటు కంటెంట్‌ను త్వరగా సేవ్ చేసుకోవడానికి వీలుగా ‘AI స్నాప్ కీ’ అనే సరికొత్త ఫీచర్‌ను ఇస్తున్నారు. ఫొటోగ్రఫీ ఇష్టపడే వారి కోసం వెనుక వైపు మూడు 50MP కెమెరాలను, ముందు వైపు 50MP సెల్ఫీ కెమెరాను అందించారు. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 6,700mAh భారీ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. నీటిలో పడినా పాడవకుండా ఉండేలా దీనికి గట్టి ప్రొటెక్షన్ ఇచ్చారు.

Oppo Reno 16C

Advertisement

ఇది ఒప్పో రెనో 16కు తక్కువ ధరలో వచ్చే మోడల్ అని చెప్పవచ్చు. ఇది కూడా జులై 2నే లాంచ్ కానుంది. దీనిలో పెద్దదైన 6.57 అంగుళాల డిస్‌ప్లేను అమర్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300-ఎనర్జీ ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్‌లో ఏకంగా 7,000mAh బ్యాటరీని ఇస్తున్నారు. తక్కువ ధరలోనే ప్రీమియం డిజైన్, బలమైన అల్యూమినియం ఫ్రేమ్, AI కెమెరా ఫీచర్లు ఇందులో లభించనున్నాయి.

Also Read: Instagramలో పిచ్చి పిచ్చి పోస్టుల గోల వద్దు అనుకుంటున్నారా? అయితే ఆ రెండు కొత్త బటన్లు మీ కోసమే!

Nothing Phone (4b)

Advertisement

నథింగ్ బ్రాండ్ నుంచి వస్తున్న ఈ ఫోన్ జులై 7న భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఎప్పటిలాగే తనదైన ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో, వెనుక వైపు చిన్న గ్లిఫ్ లైటింగ్‌తో ఇది అలరించనుంది. 6.7 అంగుళాల స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 ప్రాసెసర్, 50MP కెమెరా దీని సొంతం. ఇందులో 5,400mAh వరకు బ్యాటరీ ఉండవచ్చని అంచనా. ముఖ్యంగా రూ.25,000 లోపు బడ్జెట్‌లో మంచి డిజైన్ ఫోన్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ కానుంది.

Vivo V80

వివో నుంచి రాబోతున్న ఈ పవర్‌ఫుల్ ఫోన్ జులైలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. దీనిలో ఏకంగా 200MP ప్రధాన కెమెరాను ఇస్తుండటం విశేషం. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అయ్యే ఈ ఫోన్‌లో 7,000mAh భారీ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్ ఉన్నాయి. దీని ధర దాదాపు రూ.41,000 నుంచి రూ.46,000 మధ్యలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

Moto G87

మోటరోలా కంపెనీ జులైలో మోటో G87 ఫోన్‌ను లాంచ్ చేయాలని చూస్తోంది. ఇందులో 6.78 అంగుళాల డిస్‌ప్లేతో పాటు వెనుక వైపు 200MP కెమెరా, ముందు వైపు 32MP సెల్ఫీ కెమెరాను ఇస్తున్నారు. డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌తో పనిచేసే ఈ ఫోన్ బడ్జెట్ ధరలోనే అదిరిపోయే కెమెరా ఫీచర్లను అందించనుంది.

Also Read: యాపిల్ స్మార్ట్ స్కెచ్.. మెటా మార్కెట్‌ను దెబ్బకొట్టేలా సరికొత్త గ్లాసెస్.. లాంచింగ్ ఎప్పుడంటే?

Related News

వారెవ్వా.. సింగిల్ ఛార్జ్‌తో 50 గంటలు నడిచే ఇయర్‌బడ్స్ తెచ్చిన వివో, ధర ఎంతంటే?

ఫ్రిజ్ క్లీన్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే.. ప్రాణాలకే ప్రమాదం!

ఆఫర్ అంటే ఇది కదా.. Amazon SAleలో బ్రాండెడ్ స్మార్ట్ టీవీలపై 65% డిస్కౌంట్.. ఏ మోడల్ ఎంతంటే?

అమ్మ, నాన్నల కోసం ఫోన్ కొంటున్నారా? మార్కెట్లోని సీనియర్ ఫ్రెండ్లీ మెుబైల్స్ ఇవే!

డిస్‌ప్లే అదుర్స్.. డిజైన్ నెక్స్ట్ లెవెల్, ఇలాంటి ఫీచర్లు ఇతర స్మార్ట్ ఫోన్‌లో ఉండవు

తక్కువ కరెంట్ బిల్లు, హెల్తీ ఎయిర్ ఇచ్చే 5 బెస్ట్ 1.5 టన్ ఆటో క్లీన్ ఏసీలు!

Instagramలో పిచ్చి పిచ్చి పోస్టుల గోల వద్దు అనుకుంటున్నారా? అయితే ఆ రెండు కొత్త బటన్లు మీ కోసమే!

Big Stories

×