Roja On RP: సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగిన సీనియర్ నటి రోజా(Roja) తెలుగు తమిళ భాష చిత్రాలలో అగ్రతారగా ఓ వెలుగు వెలిగారు. ఇక వెండి తెరపై సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో రోజా రాజకీయాలలో(Politics)కి వచ్చారు. రాజకీయాల పరంగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు ఎమ్మెల్యే గాను మంత్రిగా కూడా ఈమె బాధ్యతలు తీసుకున్నారు. ఇకపోతే రోజా రాజకీయాలలో ఎమ్మెల్యేగా కొనసాగుతూనే బుల్లితెర కార్యక్రమం అయిన జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరించిన రోజా ఆ కార్యక్రమంలో పాల్గొనే కంటెస్టెంట్ల అందరికి కూడా తన వంతు సహాయం అందిస్తూ వారిని ప్రోత్సహించారు.
డబ్బులు ఎందుకు ఇస్తారు…
ఈ విషయాన్ని స్వయంగా జబర్దస్త్ కమెడియన్స్ ఎన్నో సందర్భాలలో చెబుతూ వచ్చారు. ఇక ఈమెకు మంత్రిగా పదవి రావడంతో జబర్దస్త్ నుంచి కూడా తప్పుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం రోజా ఎన్నికలలో ఓటమిపాలు కావడంతో తిరిగి బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా సినీ సెలబ్రెటీల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రోజా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సమయంలో తిరుపతిలో ఎంతోమంది సెలబ్రిటీలకు విఐపి దర్శనాలు చేయించిన విషయం తెలిసిందే అయితే అలా చేయించినందుకు డబ్బు తీసుకుంది అంటూ ఒక జబర్దస్త్ కమెడియన్ ఆరోపణలు చేశారు.
అన్ని సదుపాయాలు చేశాను…
ఇక ఈ విషయం గురించి రోజా మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు ఎంతోమంది తిరుపతికి వస్తున్నామని ఫోన్ చేస్తే వాళ్ళందరికీ రూమ్ దగ్గర నుంచి మొదలుకొని దర్శనం అవ్వడం అన్ని విషయాలు దగ్గరుండి చూసుకున్నానని తెలిపారు. కానీ ఒక్కరి దగ్గర కూడా నేను రూపాయి తీసుకోలేదు. నాకు బాగా కావలసిన వాళ్లు వస్తే నాకన్నా చిన్నవాళ్ళైనా స్వయంగా నేనే తీసుకెళ్లి దర్శనం చేయించాను. ఇలా చేయటం వల్ల నాకేంటి లాభం.
https://www.facebook.com/100077862469845/videos/1920546258787103/?rdid=V6IdttpP6qRcnkpW#
ఇలా ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చినా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా కంఫర్ట్ గా చూసుకున్నాము. అలా కంఫర్ట్ గా చూసుకున్న వాడే ఇప్పుడు మాట్లాడుతున్నాడు. వాడికి కచ్చితంగా దేవుడు పనిష్మెంట్ ఇస్తాడు. జబర్దస్త్ లో పని చేసిన వారందరూ కూడా దర్శనానికి వచ్చారు అందరూ కూడా మా ఇంటికి వచ్చారు. అందరికీ ఈ విషయంలో ఎంతో కృతజ్ఞత ఉంది. ఆ ఒక్కడికి తప్ప అంటూ రోజా మాట్లాడిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే రోజా ఈ వీడియోలో కిరాక్ ఆర్పీ(Kirak Rp)ను ఉద్దేశించి మాట్లాడారు అంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇక రోజా వ్యక్తిగతంగా ఆర్పీకి ఎంతో సహాయం చేశారు. తిరుపతిలో చేపల పులుసు రెస్టారెంట్ స్వయంగా రోజా చేతుల మీదగా ప్రారంభించడమే కాకుండా మంచి సక్సెస్ అవ్వాలి కోరుకున్నారు. కానీ ఆర్పీ మాత్రం రోజాను రాజకీయ పరంగా టార్గెట్ చేస్తూ ఆమె పట్ల వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
Also Read: మొన్న విశ్వంభర.. నేడు ఘాటీ వాయిదా… అసలేం జరుగుతుంది?