E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

దర్శకుడంటే వీడ్రా బాబు..టాలీవుడ్‌కి క్లాస్ పీకుతున్న హాలీవుడ్ కుర్రోడు !

దర్శకుడంటే వీడ్రా బాబు..టాలీవుడ్‌కి క్లాస్ పీకుతున్న హాలీవుడ్ కుర్రోడు !
Advertisement

Obsession Movie: మనం సినిమా తీస్తే మాములుగా ఉండదు మరి ..మినిమం వంద కోట్లు ఉండాలి. ఇక పబ్లిసిటీ పాన్ ఇండియా లెవెల్ కి తగ్గొద్దు.ఇంత చేసి సినిమా థియేటర్ లోకి వస్తే మాత్రం పట్టుమని రెండు రోజులు కూడా ఉండని పరిస్థితి. కానీ అక్కడ హాలీవుడ్‌లో ఒక కుర్రాడు మాత్రం మన మేకర్స్ కళ్ళు తెరిపిస్తున్నాడు.కేవలం ఏడున్నర కోట్ల రూపాయల పాకెట్ మనీ లాంటి బడ్జెట్‌తో సినిమా తీసి మన టాలీవుడ్ బడా మేకర్ల మైండ్ బ్లాక్ చేస్తున్నాడు.

2026లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హాలీవుడ్ హిట్‌

Advertisement

అవును ..26 ఏళ్ల కర్రీ బార్కర్ అనే మాజీ యూట్యూబర్ డైరెక్ట్ చేసిన ‘అబ్సెషన్’ అనే చిన్న హారర్ సినిమా ఇప్పుడు ఇండియాలో రీసౌండ్ ఇస్తోంది. నిన్న మొన్నటి వరకు కోట్లకు కోట్లు కుమ్మరించి తీసిన ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ లాంటి భారీ సినిమాలే 75 కోట్లు దాటడానికి ఆయాసపడితే, ఈ చిన్న సినిమా ఏకంగా 79 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి 2026లో ఇండియాలోనే బిగ్గెస్ట్ హాలీవుడ్ హిట్‌గా నిలవడం ఒక విచిత్రం. ఇంకొక కోటి రూపాయలు వసూలు చేస్తే చాలు, ఇక్కడ ఎంతో క్రేజ్ ఉన్న ‘అవెంజర్స్: ఏజ్ ఆఫ్ అల్ట్రాన్’ లైఫ్‌టైమ్ కలెక్షన్లను కూడా ఇది ఓవర్ టేక్ చేసేస్తుంది.

సినిమాకు ఇంత రెస్పాన్స్ ఏంట్రా బాబూ

Advertisement

నిజానికి మన టాలీవుడ్‌లో కథల కొరత లేదన్నట్టు బిల్డప్ ఇస్తారు కానీ, ఒకే రకమైన మూస ఫార్ములాలు, హీరోల ఎలివేషన్ల చుట్టూనే కోట్లు తగలేస్తుంటారు. ఐదు వందల కోట్లు పెట్టి గ్రాఫిక్స్ పాతాళ భైరవి రేంజ్‌లో చేసామని ప్రచారం చేసుకునే మన మేకర్స్, కంటెంట్ స్ట్రాంగ్‌గా ఉంటే జనం ఎలా బ్రహ్మరథం పడతారో ఈ సినిమా చూసైనా నేర్చుకోవాలి. ప్యూర్ వర్డ్ ఆఫ్ మౌత్‌తో ఈ సినిమా ఇండియాలో వైరల్ అయిపోయింది. మనోళ్లు థియేటర్లలో ఈ హారర్ సీన్లు చూసి భయపడటం పక్కన పెడితే, సోషల్ మీడియాలో సీన్లను రీక్రియేట్ చేస్తూ మీమ్స్, కామెడీ వీడియోలు, ఫ్యాన్ ఆర్ట్‌లతో రచ్చ లేపుతున్నారు. ఇది చూసి ఆ దర్శకుడే బిత్తరపోయి, ఇండియాలో నా సినిమాకు ఇంత రెస్పాన్స్ ఏంట్రా బాబూ షాక్ అయిపోతున్నాడట మరి.

హిట్ అవ్వాలంటే సినిమాలో దమ్ముండాలి 

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 334 మిలియన్ డాలర్ల మార్కును దాటేసి ట్రేడ్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ‘అబ్సెషన్’, కేవలం అల్గారిథమ్‌లను నమ్ముకుని సినిమాలు తీసే కార్పొరేట్ సంస్థల చెంప చెల్లుమనిపించింది. ఒకప్పుడు 1999లో వచ్చిన ‘ది బ్లెయిర్ విచ్ ప్రాజెక్ట్’ లేదా మన దగ్గర రామ్ గోపాల్ వర్మ తీసిన ‘రాత్రి’, ‘దెయ్యం’ లాంటి సినిమాలు ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో, ఇప్పుడు ఈ సినిమా అదే మ్యాజిక్ రిపీట్ చేస్తోంది. భారీ స్టార్లు, విదేశీ లొకేషన్లు, వందల మంది ఫైటర్లు ఉంటేనే సినిమా ఆడదు, సినిమాలో దమ్ముండాలి అని ఈ చిత్రం నిరూపిస్తోంది.

పెద్ద డైరెక్టర్ల నిద్ర గాయబ్ 

మన టాలీవుడ్ దర్శకులు ఇప్పటికైనా హీరోల డేట్ల కోసం ఏళ్లకెళ్లు కాపలా కాయడం మానేసి, ఇలాంటి క్రియేటివ్ కంటెంట్ వైపు దృష్టి పెడితే మంచిది. కార్పొరేట్ ఆఫీసుల చుట్టూ తిరగడం కంటే, క్రియేటివ్ కంట్రోల్ మన చేతిలో ఉంచుకుని సినిమా తీస్తే ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయవచ్చో కర్రీ బార్కర్ చేసి చూపించాడు. ఇకనైనా మన మేకర్లు ఈ హాలీవుడ్ ‘అబ్సెషన్’ నుంచి బయటపడి సొంతంగా కొత్త ఐడియాలతో వస్తారో లేక పాత చింతకాయ పచ్చడి ఫార్ములాలనే నమ్ముకుంటారో చూడాలి. వసూళ్ల పరంగా ప్రస్తుతం భారత్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాల లిస్టులో 28వ స్థానంలో కూర్చున్న ఈ చిన్న దెయ్యం సినిమా, మన పెద్ద డైరెక్టర్ల నిద్ర కచ్చితంగా చెడగొడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

Related News

బోల్డ్ సబ్జెక్ట్‌తో సందీప్ కిషన్ ఫన్ రైడ్.. ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ అదిరిపోయిందిగా !

సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. ఆ పరేషాన్ వెనుక 9 ఏళ్ల లవ్ స్టోరీ!

టాలీవుడ్ టు ఫ్రాన్స్.. ఇంటర్నేషనల్ వేదికపై ‘బాహుబలి’ గ్రాండ్ ఎంట్రీ

స్క్రీన్ పై నీతులు… స్క్రీన్ వెనుక కోతులు.. టాలీవుడ్ పై సింగర్ సునీత పంచ్

సుడిగాలి సుధీర్, రష్మిల మధ్య ఏం లేదా ..?

నేషనల్ అవార్డుల వార్ ..చిరంజీవి బన్నీని టార్గెట్ చేశాడా…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!

వెండితెరపై ‘మీర్జాపూర్’ రచ్చ.. థియేటర్లలోకి కల్ట్ ఫ్రాంచైజీ!

Big Stories

×