E-Paper
Advertisement

మాస్టర్ గేమ్ మొదలుపెట్టిన శివాజీ.. రియల్ లైఫ్ లో అదే స్ట్రాటజీ!

మాస్టర్ గేమ్ మొదలుపెట్టిన శివాజీ.. రియల్ లైఫ్ లో అదే స్ట్రాటజీ!
Advertisement

Bigg Boss: బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ ఎంతోమంది జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా ఎటువంటి గుర్తింపు లేని వారికి ఊహించని ఇమేజ్ ను అందించిన ఈ షో.. అటు పేరు మోసిన సెలబ్రిటీలపై నెగెటివిటీని కూడా స్ప్రెడ్ చేసింది. ఇకపోతే ఇప్పటివరకు తెలుగులో 9 సీజన్లు పూర్తి కాగా, ఎంతోమంది సెలబ్రిటీలు, సామాన్యులు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసి తమకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్నారు. కానీ వీరందరినీ బిగ్ బాస్ ఏ రేంజ్ లో వాడుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటిది బిగ్ బాస్ నే ఏకంగా వాడుకొని తన కెరీర్ కు పునాదులు వేసుకున్నాడు ఒక నటుడు. ముఖ్యంగా తన అద్భుతమైన తెలివితేటలతో బిగ్ బాస్ ని బురిడీ కొట్టించి అందరి చేత ప్రశంసలు అందుకోవడమే కాకుండా ఇప్పుడు తన కెరీర్లో వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నాడు.

బిగ్ బాస్ నే వాడుకున్న ఏకైక నటుడు..

ఆయన ఎవరో కాదు శివాజీ.. వాస్తవానికి అదృష్టం అనేది ఎప్పుడు? ఎలా? ఎవరి తలుపు తడుతుందో చెప్పడం అసాధ్యం . అందుకే జీవితంలో ఉన్నత ఎత్తుకు ఎదగాలి అంటే ఆవగింజంత అదృష్టమైనా ఉండాలి అని అంటారు. అయితే ఈ నటుడికి అదృష్టం బిగ్ బాస్ రూపంలో వచ్చింది. ఇప్పటివరకు బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోలను వాడుకొని ఎంతో మంది సెలబ్రిటీలుగా మారితే..ఆ షోని వాడుకొని తన కెరీర్ ని బిల్డ్ చేసుకున్న ఈయన అందరికీ రోల్ మోడల్ గా నిలుస్తున్నారు.అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారానే తన కెరీర్ ను మొదలుపెట్టి చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరియర్ను ఆరంభించారు. నెమ్మదిగా హీరోగా మారి మంచి విజయాలను అందుకుంటూ కెరియర్ పీక్స్ లో ఉండగానే పాలిటిక్స్ అంటూ చేతులు కాల్చుకున్నారు.

బిగ్ బాస్ రూపంలో అదృష్టం..

Advertisement

ఇక దాంతో అటు పాలిటిక్స్ లేవు .. ఇటు సినిమాలు లేవు.. చేసేదేం లేక కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ కూడా ఇచ్చాడు. అయితే ఇండస్ట్రీ తన ఉనికిని మర్చిపోతున్న సమయంలో సడన్గా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టి పెద్దన్నగా మారి, తన ఆటతో కాకుండా స్ట్రాటజీతో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ ను విన్నర్ గా నిలబెట్టినా.. అందరి హృదయాలను దోచుకొని తానే విన్నర్ గా బయటకు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు.

also read:ఇండస్ట్రీలోకి కొత్త హీరో.. వారసుడి కోసం బడా సెలబ్రిటీలు!

మైండ్ గేమ్ మొదలుపెట్టిన శివాజీ..

Advertisement

ఇక హౌస్ లో ఉన్నంతసేపు తన స్ట్రాటజీ తో, మైండ్ గేమ్ తో అందరిని విస్మయానికి గురిచేసిన శివాజీ.. ఇప్పుడు రియల్ లైఫ్ లో అసలైన ఆట మొదలుపెట్టారు. మంచి మంచి కథలను ఎంచుకుంటూ ఆచితూచి అడుగులు వేస్తూ దూసుకుపోతున్నార. బిగ్ బాస్ నుంచి బయటకు రాకముందే ఆయన నటించిన #90స్ వెబ్ సిరీస్ మంచి హిట్ అందుకుంది .ఆ తర్వాత కోర్ట్ సినిమాతో మంగపతిగా మారి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఇక అక్కడ నుంచి ఎంచుకునే ప్రతి పాత్ర ఆయన ఎదుగుదలకు ఒక్కో మెట్టుగా మారుతూ వచ్చాయి .అలా దండోరా, సాంప్రదాయిని సుప్పిని శుద్ధ పూసని ఇలాంటి చిత్రాలు ఈయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేలా చేశాయి.

వరుస అవకాశాలతో దూసుకుపోతున్న శివాజీ..

ఇక మరొకవైపు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమాలో నటించాడు. జూలై 10వ తేదీన విడుదల కాబోతోంది ఈ సినిమా.. ఇలా టాలీవుడ్ లో వరుస అవకాశాలంటూ దూసుకుపోతున్న ఈయన అటు కోలీవుడ్ లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా.. మమిత బైజు నటిస్తున్న ఒక చిత్రంలో శివాజీ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోని ఉపయోగించుకొని.. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు పక్క రాష్ట్రాలకి తన క్రేజ్ ను విస్తరిస్తూ ఊహించని పాపులారిటీ సొంతం చేసుకుంటున్నారు శివాజీ. ఇక ఈయన మైండ్ గేమ్, స్ట్రాటజీని చూసి బిగ్ బాస్ నే వాడుకున్న పోటుగాడు అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Related News

పరారీలో ప్రముఖ యూట్యూబర్.. నగదుతో పాటు బంగారం చోరీ!

Gundeninda GudiGantalu Today episode: బాలుకు అనుమానం.. పిల్లాడిలా మారిన మనోజ్.. బాలు రచ్చ రచ్చ..

Podarillu Today Episode : కేశవ కోరిక తీరుతుందా? మహా, విక్కీ మధ్య దివ్య..మహాకు గుడ్ న్యూస్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి, పార్థును చంపేసిన నిజం సీతారాం అందరికీ చెప్తాడా..?  

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు మైండ్ బ్లాక్.. వేదవతి మాటతో షాక్..శ్రీవల్లి అవుట్..

Intinti Ramayanam Today Episode: అయ్యో పార్వతి.. కమల్ పై రివేంజ్.. పల్లవికి వాతలు..

Karthika Deepam 2 Serial Today Episode October 8th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ను మాలిని చంపేస్తుందా..?              

Ninnu kori Serial Today Episode October 8th ‘నిన్ను కోరి’ సీరియల్‌: గతం గుర్తుకు వచ్చిన విరాట్ ఏం చేశాడో తెలుసా..? 

Big Stories

Advertisement
×