Ustaad bhagat Singh : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. గతంలో హరీష్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ నమోదు చేసుకుంది.
దాదాపు పది సంవత్సరాలు పవన్ కళ్యాణ్ కి హిట్ లేకపోతే హరీష్ డైరెక్షన్ తర్వాత బ్లాక్ బస్టర్ దక్కింది. పవన్ కళ్యాణ్ ని అభిమాని ఎలా చూడడానికి ఇష్టపడతాడో అచ్చం అలా చూపించి ప్రేక్షకుల్ని జోష్ తో నింపాడు. ఒరిజినల్ సినిమా కంటే కూడా 10 టైమ్స్ బెటర్ ఉంది అని రాంగోపాల్ వర్మ లాంటి దర్శకులే గబ్బర్ సింగ్ సినిమాకి కితాబిచ్చారు.
ఈసారి కూడా ఫుల్ మీల్స్ ఖాయం
వాస్తవానికి గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందు సినిమా ఆడియో లాంచ్ జరిగింది. ఆ ఆడియో లాంచ్ లో హరీష్ శంకర్ మాట్లాడిన మాటలు చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. అలానే ట్రైలర్ కూడా విపరీతంగా కనెక్ట్ అయింది. అయితే ఆ ఆడియో లాంచ్ లో హరీష్ శంకర్ ఒక మాట చెప్పాడు. ఆకలితో ఈ సినిమాకు వచ్చిన వాళ్ళు బుక్తాయాసంతో తిరిగి బయటికి వెళ్తారు అంటూ చెప్పాడు. హరీష్ అప్పట్లో చెప్పిన మాటలు అలానే నిజమయ్యాయి.
వింటేజ్ పవన్ కళ్యాణ్
ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి రేపు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా నిల్చుని హ్యాట్ పెట్టుకొని స్టిల్ ఇచ్చారు. ఈ ఫస్ట్ లుక్ చూసిన వెంటనే ఇది కదా అసలైన పవన్ కళ్యాణ్ అంటే అని అనిపిస్తుంది. పోస్టర్లో స్వాగ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మంచి హ్యాపీనెస్ అని చెప్పాలి. ఈ పోస్టర్ చూస్తుంటే పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాలి అని హరీష్ ఫిక్స్ అయ్యాడో దాదాపు అర్థమైపోతుంది. ఈ పోస్టర్ తో పవన్ కళ్యాణ్ కు బర్త్ డే విషెస్ తెలియజేసింది చిత్ర యూనిట్.
Happy Birthday to the USTAAD of style, swag and box office – POWER STAR @PawanKalyan ❤🔥#UstaadBhagatSingh will be a feast for fans and a delight for the audience 💥💥#HBDPawanKalyan@harish2you @sreeleela14 #RaashiiKhanna @ThisIsDSP @DoP_Bose #AnandSai @MythriOfficial… pic.twitter.com/dWGSIKO5KI
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) September 1, 2025