Vishal and Sai Dhanshika net worth: కోలీవుడ్ హీరో విశాల్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నటి సాయి ధన్సీకను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల వీరిద్దరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అప్పటి నుంచి విశాల్, సాయి ధన్సికలు హాట్ టాపిక్ గా మారారు. తన పుట్టిన రోజు ఆగష్టు 29న విశాల్, సాయి ధన్సికతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. చెన్నైలోని విశాల్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. విశాల్, సాయి ధన్సికలు కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ, వీరిద్దరు కొంతకాలంగా రిలేషన్‌లో ఉన్నారు. ఇదే విషయాన్ని కొన్ని నెలల క్రితం వీరు ప్రకటించారు.
గతంలోనే పెళ్లి ప్రకటన
సాయి ధన్సిక మూవీ రిలీజ్ సందర్భంగా ఆ చిత్ర ప్రమోషన్స్‌లో విశాల్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా వీరిద్దరి కలిసి తమ పెళ్లి ప్రకటన చేశారు. ఆగష్టు, సెప్టెంబర్‌లో నిశ్చితార్థం, పెళ్లి చేసుకుంటామని వెల్లడించారు. చెప్పినట్టుగా ఈ నెల సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకుని సర్‌ప్రైజ్ చేసింది ఈ జంట. అప్పటి నుంచి విశాల్, సాయి ధన్సికలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నెటిజన్స్ వీరిద్దరికి సంబంధించిన పలు విషయాలపై ఆరా తీస్తున్నారు. వీరిద్దరి సినిమాలు, ఏజ్ గ్యాప్, ఆస్తులను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా విశాల్ వయసు ప్రస్తుతం 48 సంవత్సరాలు కాగా.. సాయి ధన్సిక వయసు 35. ఇద్దరి మధ్య 13 ఏళ్ల వయసు వ్యత్యాసం ఉంది.
విశాల్ ఆస్తులు ఇవే
తమిళ్, తెలుగులో విశాల్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. తన 25 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్స్ హిట్స్, బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాల్లో నటించాడు. ఇప్పటికీ హీరో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. కోలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోల్లో విశాల్ ఒకడు. నటుడిగా బాగానే సంపాదించిన అతడు పదేళ్ల క్రితం నిర్మాతగాను మారాడు. తన పేరుతో ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’ పేరుతో 2013లో ప్రొడక్షన్ హౌజ్ స్థాపించాడు. దీని ద్వారా సినిమాలు నిర్మిస్తున్నారు. మరోవైపు విశాల్ తల్లిదండ్రులు కూడా ధనవంతులే. విశాల్ తండ్ర బిజినెస్ మ్యాన్. వారికి గ్రానైట్ వ్యాపారం ఉంది. ఇలా విశాల్ తల్లిదండ్రుల నుంచే కాదు.. సొంతంగా కూడా బాగానే సంపాదించాడు. మొత్తం ఆయన ఆస్తులు విలువ రూ. 125 కోట్లు ఉంటుందట. విశాల్ దగ్గర పలు లగ్జరీ కార్లు, బైక్స్ ఉన్నాయి.
సాయి ధన్సిక రెమ్యునరేషన్
తన కార్ల గ్యాలరీలో జాగ్వార్ XF(Jaguar XF), ఆడి Q7(Audi Q7), బీఎండబ్ల్యూ X6(BMW X6), టయోట ఇన్నోవా క్రిస్టా(Toyota Innova Crysta) ఉన్నాయి. ఇక సాయి ధన్సిక సహానటి పాత్రలతో మంచి గుర్తింపు పొందింది. ఇప్పటి వరకు ఆమె లీడ్ రోల్లో నటించలేదు. సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి చిత్రంలో తనదైన నటన, లుక్‌తో ఒక్కసారిగా కోలీవుడ్‌లో సెన్సేషన్ అయ్యింది. కబాలి మూవీతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం సహాయ నటిగా ఆమె ఒక్కొక్కొ సినిమాకు రూ. 10 నుంచి రూ. 15 లక్షల వరకు పారితోషికం తీసుకుంది. ఈ లెక్కన నటిగా సాయి ధన్సిక ఇప్పటి వరకు రూ. 6 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు వెనకేసుకుందట. ప్రస్తుతం ఆమె నెట్ వర్త్ రూ. 6 కోట్ల నుంచి రూ. 7 కోట్లు ఉంటుందట. ఇక వీరిద్దరి నెట్ వర్త్ కలిపి రూ. 131 కోట్ల నుంచి రూ. 132 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ విశాల్, సాయి ధన్సికలు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నట్టు నిశ్చితార్థం సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
Also Read: The Door OTT: సుమారు ఐదు నెలల తర్వాత ఓటీటీకి వచ్చేసిన భావన మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!