BigTV English

OTT Movie : ల్యాబ్ లో అమ్మాయిల అస్థి పంజరాలు… కపుల్ ను కలవనివ్వని దెయ్యం… రాత్రిపూట సింగిల్ గా చూశారో ఫసక్

OTT Movie : ల్యాబ్ లో అమ్మాయిల అస్థి పంజరాలు… కపుల్ ను కలవనివ్వని దెయ్యం… రాత్రిపూట సింగిల్ గా చూశారో ఫసక్

OTT Movie : హారర్ జానర్ లో వస్తున్నసినిమాలను చూడటానికి చాలా మంది ప్రేక్షకులు ఉత్సాహం చూపిస్తుంటారు. వీటిని చూడటానికి భాష కూడా అవసరం ఉండదు. ఏ భాషలో ఉన్నా వాటిని చూస్తూ థ్రిల్ అవుతుంటారు. రీసెంట్ గా తెలుగులో వచ్చిన ఈ జానర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ స్టోరీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఒక బిల్డింగ్ లో జరుగుతుంది. ఇది అతీంద్రియ శక్తులతో కూడిన రివెంజ్ థ్రిల్లర్ గా గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో

‘గార్డ్: రివెంజ్ ఫర్ లవ్’ (Guard: Revenge for Love) 2025లో విడుదలైన తెలుగు హారర్-థ్రిల్లర్ చిత్రం. జగ పెద్ది దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. ఇందులో విరాజ్ రెడ్డి చీలం (సుశాంత్), శిల్ప బాలకృష్ణ (సామ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2025 ఫిబ్రవరి 28న థియేటర్లలో విడుదలై, IMDbలో 7.3/10 రేటింగ్ ను పొందింది. 121 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు హిందీ, ఇంగ్లీష్ డబ్బింగ్‌లలో అందుబాటులో ఉంది.


కథలోకి వెళ్తే …

మెల్‌బోర్న్‌లోని బిల్డింగ్ Mలో నైట్ షిఫ్ట్ సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేసే సుశాంత్ తన కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడుతుంటాడు. ఒక రాత్రి బిల్డింగ్‌లో వింత శబ్దాలతో అతన్ని ఎవరో చూస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ భయంతో అతను సామ్ అనే ఒక డాక్టర్‌ను సంప్రదిస్తాడు. ఈ సమయంలో వీళ్ళ మధ్య ప్రేమ మొదలవుతుంది. సామ్, సుశాంత్‌తో కలిసి ఈ రహస్యాలను ఛేదించడానికి బిల్డింగ్‌లోకి వస్తుంది. కానీ ఒక దుష్ట శక్తి సామ్‌ను ఆవహిస్తుంది. సామ్‌ను రక్షించడానికి బిల్డింగ్ గతాన్ని, ఒక ప్రతీకార ఆత్మ సీక్రెట్ గురించి సుశాంత్ తెలుసుకుంటాడు.

ఇది ఒక పురాతన శాపంతో ముడిపడి ఉంటుంది. సామ్‌ను రక్షించడానికి, అతను ఈ శక్తితో నేరుగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది భయంకరమైన యాక్షన్ సీక్వెన్స్‌లకు దారితీస్తుంది. సుశాంత్, సామ్‌ల మధ్య ప్రేమ, ఈ పోరాటంలో ఒక ఆశాకిరణంగా నిలుస్తుంది. కానీ ఆత్మ శక్తి వీళ్ళ బంధాన్ని పరీక్షిస్తుంది. క్లైమాక్స్‌లో సుశాంత్ ఆత్మకు న్యాయం చేయడానికి ఒక కఠిన నిర్ణయం తీసుకుంటాడు. ఈ నిర్ణయం ఏమిటి ? సామ్‌ను వదిలి ఆత్మ వెళ్ళిపోతుందా ? ఈ ఆత్మా గతం ఏమిటి ? ఈ స్టోరీ క్లైమాక్స్ ఎలా ఉంటుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : మూవీలో ఆ సీన్స్ ఉండాలని పట్టుబట్టే అమ్మాయి… సమ్మర్ హాలీడేస్ లో సినిమా ప్లాన్… ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి బుర్రపాడు

Related News

OTT Movie : వీడియో కాల్ లో అన్నీ విప్పి పాడు పనులు… ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఆమె వలలో… అబ్బాయిలు మస్ట్ వాచ్

OTT Movie : భర్త పట్టించుకోవట్లేదని మరొకడితో… డైరెక్ట్ గా మొగుడికే చెప్పే ఇల్లాలు… అతనిచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : పాపులర్ అవ్వడానికి ఎంతకైనా తెగించే జంట… వెంటాడే మిస్టీరియస్ వ్యక్తి… లాస్ట్ ట్విస్ట్ హైలెట్

OTT Movie : 2 ఓటీటీల్లోకి 105 కోట్ల రివేంజ్ డ్రామా… ఆ సీన్లు కూడా… ఒక్కో ట్విస్టుకు మైండ్ బ్లాక్

Akhanda2 Ott Deal: రికార్డు స్థాయిలో బాలయ్య ఆఖండ2 ఓటీటీ డీల్!

Big Stories

×