Pawan Kalyan HHVM Movie : పవన్ కళ్యాణ్‌కు ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో అందరికీ తెలుసు. ఆయన నుంచి సినిమా వస్తుంది అంటే ఓ పండగ వాతావరణం ఉంటుంది. ఆయన అభిమానులు ఆఫీస్‌లకు, స్కూల్స్, కాలేజీలకు సెలవులు పెట్టి మరీ థియేటర్స్‌కు వెళ్తారు.
ముఖ్యంగా నైజాం ఏరియాలో అయితే… జాతరనే అని చెప్పొచ్చు. కొన్ని సెంటర్స్ దగ్గర అభిమానులు ఒక్క రోజు ముందు నుంచే ఆ హడావుడి ఉంటుంది. ఇప్పుడు రాబోయే హరి హర వీరమల్లు కూడా అలాంటి కల్ట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ముఖ్యంగా నైజాం ఏరియాలో పవన్ కు మాస్ ఫ్యాన్ బేస్ ఉంది. నైజాంలో చాలా థియేటర్స్ దగ్గర పవన్ కళ్యాణ్ సినిమా టైంలో ఉండే వాతావరణం అందరికీ తెలిసిందే.
అలాగే, పవన్ కళ్యాణ్‌కు కూడా నైజాం ఏరియాలో మంచి గ్రిప్ ఉంది. ఆయన సినిమాలకు ఇక్కడ మంచి కలెక్షన్లు వస్తాయి. రీ రిలీజ్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాలు నైజాం ఏరియాలో రికార్డులు క్రియేట్ చేశాయి. అలాంటి నైజాం ఏరియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు ఘోర అవమానం ఎదురైందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో, ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది.
పవన్ కళ్యాణ్ తొలిసారిగా పీరియాడికల్ మూవీ చేస్తున్నాడు. ఆ సినిమానే హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి స్టార్ట్ చేసిన ఈ మూవీని తర్వాత జ్యోతికృష్ణ కంప్లీట్ చేశాడు. దీనిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా డైరెక్షన్ లో సాయం చేశాడు.
దాదాపు 5 ఏళ్ల పాటు సాగిన ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యే పూర్తి. అలాగే, అనేక సార్లు వాయిదా పడుతూ… ఎట్టకేలకు ఈ నెల 25న విడుదల కాబోతుంది. నిజానికి జూన్ 12న రిలీజ్ కావాల్సింది. కానీ, బిజినెస్ అవ్వలేదు అనే కారణంతో… వాయిదా పడింది. ఇక ట్రైలర్ వచ్చిన తర్వాత.. సినిమాపై కాస్త పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ పాజిటివ్ టాక్ వల్ల బిజినెస్ కు మార్గం కొంత వరకు క్లియర్ అయింది.
నైజాం రైట్స్ ఎవరూ తీసుకోలేదా ?
ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా… బిజినెస్ పూర్తిగా కాలేదని తెలుస్తుంది. ఈ మూవీ నైజాం రైట్స్ ఎవ్వరూ తీసుకోలేరు అనే టాక్ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తుంది. దీనికి కారణం.. నిర్మాత ఎఎం రత్నం నైజాం రైట్స్ కు భారీ ధర చెప్పరట. అంత భారీ ధరను పెట్టి నైజాం రైట్స్ తీసుకోవడానికి బయ్యర్లు ఎవ్వరూ ముందుకు రాలేదని సమాచారం.
దీంతో నైజాం ఏరియాలో నిర్మాత రత్నమే ఓన్ రిలీజ్ చేస్తున్నాడని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టి.. నైజాంలో దిల్ రాజు కొన్ని థియేటర్స్ ఇవ్వొచ్చు. అలాగే నిర్మాత నాగ వంశీ కింగ్ డం సినిమా.. హరి హర వీరమల్లు డేట్ కు ఒక వారం తేడా ఉంది. అంటే అప్పటి వరకు నైజాం ఏరియాలో వీరమల్లు సినిమాకు థియేటర్స్ ఎక్కువగానే ఉండొచ్చు.
ఓన్ రిలీజ్ – ఓన్ రిస్క్
అందుకే నిర్మాత రత్నం ఓన్ రిలీజ్ ధైర్యం చేసి ఉంటాడని తెలుస్తుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే… ఓన్ రిలీజ్ చేసినా.. లాభాలు రావొచ్చు. కానీ, మూవీకి మిక్సిడ్ టాక్ వచ్చినా… భారీగా నష్టపోవాల్సి వస్తుంది.
ఇది అంతా పక్కన పెడితే… పవర్ స్టార్, అందులోనూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా నైజాం రైట్స్ ఎవ్వరూ కొనుగోలు చేయకపోవడం అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.