BigTV English

WCL 2025: అప్పుడు ధోని అవుట్.. కానీ ABD మ్యాచ్ నిలబెట్టాడు…. రన్ ఔట్ సీన్ రిపీట్

WCL 2025: అప్పుడు ధోని అవుట్.. కానీ ABD మ్యాచ్ నిలబెట్టాడు…. రన్ ఔట్ సీన్ రిపీట్

WCL 2025: వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ {WCL 2025} లో భాగంగా యువరాజ్ సింగ్ సారధ్యంలోని ఇండియా ఛాంపియన్స్ తమ మొదటి మ్యాచ్ ని జులై 22వ తేదీన ఎబి డివిలియర్స్ సారథ్యంలోని దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ జట్టుతో తలపడింది. దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ జట్టు తమ మొదటి మ్యాచ్ ని వెస్టిండీస్ ఛాంపియన్స్ తో ఆడి విజయం సాధించారు. వర్షం వల్ల ప్రభావితమైన ఆ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు 80 పరుగుల లక్ష్యం లభించింది. ఈ లక్ష్యాన్ని వారు నిర్ణీత 11 ఓవర్లలోనే సాధించారు.


Also Read: IND VS ENG, 4Th Test: మాంచెస్టర్ లో పిడుకులతో కూడిన వర్షం…ఇండియా VS ఇంగ్లాండ్ మ్యాచ్ వాయిదా ?

ఇక జూలై 22న ఇండియా ఛాంపియన్స్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ని ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇండియా ఛాంపియన్స్ జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా ఛాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్లలో ఆమ్లా 22, రుడోల్ఫ్ 24, సెరెల్ ఎర్వే 15, ఎబి డివిలియర్స్ {63*}, డుమిని 16, పార్నెల్ 11, స్ముట్స్ 30, వన్ వ్యక్ 18 పరుగులు చేశారు.


ఇక ఇండియా ఛాంపియన్స్ బౌలర్లలో మిథున్ 1, చావ్లా 2, యూసఫ్ పటాన్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా ఛాంపియన్స్ 18.2 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇండియా ఛాంపియన్స్ బ్యాటర్లలో స్టువర్ట్ బిన్నీ 37, ఇర్ఫాన్ పఠాన్ 10, వినయ్ కుమార్ 13, సురేష్ రైనా 16 పరుగులు మినహా.. మరే బ్యాటర్ రెండంకెల స్కోర్ సాధించలేకపోయారు.

సౌత్ ఆఫ్రికా బౌలర్లలో పార్నెల్ 2, తాహిర్ 2, ఫంగిసో 3, విల్గొన్ 1 వికెట్లు పడగొట్టారు. దీంతో ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో ఏ.బి డివిలియర్స్ 63 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన విషయం తెలిసిందే. కాగా 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని పోరాటంతో గట్టెకుతామని అంతా భావించారు. కానీ దురదృష్టం రానౌట్ రూపంలో వెక్కిరించింది. దీంతో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడిపోయింది. భారత్ విజయం సాధించడానికి ఇంకా 31 పరుగులు అవసరం ఉండగా.. 50 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు ధోని.

Also Read: Sai Sudharsan: మాంచెస్టర్ లో భారీ వర్షం… కవర్స్ ఉండగానే బ్యాటింగ్ చేస్తున్న సాయి సుదర్శన్

అయితే 2015 వన్డే ప్రపంచ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఏబి డివిలియర్స్ కూడా రన్ అవుట్ అయ్యాడు. ఈ రనౌట్ కూడా సౌత్ ఆఫ్రికా ఓటమికి ఓ కారణం అయ్యింది. ఈ ఇద్దరు ఆటగాళ్లు కూడా కీలక సమయంలో రనౌట్ కావడంతో.. వారి జట్ల ఓటమికి దారి తీసింది. కానీ తాజాగా జరిగిన ఈ మ్యాచ్ లో ఎబి డివిలియర్స్ రన్ అవుట్ కాలేదు. దీంతో ఈ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో రన్ అవుట్ నుండి తప్పించుకున్నాడు ఏబీడీ. ఒకవేళ ఈ మ్యాచ్ లో ఏబిడీ కూడా త్వరగా అవుట్ అయితే.. ఈ మ్యాచ్ ని సౌత్ ఆఫ్రికా కోల్పోయేదని అభిప్రాయపడుతున్నారు క్రీడాభిమానులు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×