Viral News: దేశంలో ట్రెండ్ మారిందా? పెళ్లి ముందు ప్రెగ్నెన్సీ టెస్టు చేయించుకునే రోజులొచ్చాయా? ఈ తరహా సినిమాలు చాలానే ఉన్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది. వివాహం తర్వాత ఫస్ట్ నైట్ భార్యకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఇచ్చి పరీక్ష చేయమని చెప్పాడు ఆమె భర్త. భర్త వ్యవహారంపై ఓ రేంజ్‌లో మండిపడింది. ఆ తర్వాత ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ జిల్లాలో ఈ ఘటన వెలుగు చూసింది. జూలై 12న ఓ మహిళకి వివాహం జరిగింది. వధూవరులు ఇంటికి చేరుకున్నారు. వరుడు ఊర్లో నూతన దంపతులను ఊరేగించారు. పెళ్లంటే అలసిపోవడం సహజం. దానికితోడు వేడిగా వాతావరణం ఉంటే నిరసంగా కనిపిస్తారు. తనకు తల తిరుగుతున్నట్లు భర్తతో చెప్పింది.
ఇంకా ఫస్ట్ నైట్ కాకుండా తల తిరగడం ఏంటంటూ భయపడ్డాడు వరుడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరువుపోతుందని భావించారు. మొదటి రోజు గదిలోకి వెళ్లగానే భార్యకు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ ఇచ్చాడు భర్త. గర్భ ధారణ పరీక్ష చేసుకోమని చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది భార్య.
తన వారికి ఫోన్ చేసి జరిగిన వ్యవహారాన్ని చెప్పింది. దీంతో అమ్మాయి బంధువులు అల్లుడి ఇంటికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య పెద్ద గొడవ జరిగింది. గ్రామస్తులు జోక్యం చేసుకోవడంతో పెద్దల సమక్షంలోకి ఈ పంచాయతీ జరిగింది.
ALSO READ: ఏడాదికి 40 లక్షలు జీతం, కానీ ప్రతీనెల డబ్బు కొరతేనంటున్న టెక్కీ
అసలు విషయాన్ని వరుడు పెద్దల ముందు వివరించాడు. ఊరేగింపు రోజు భార్యకు అలసట, తల తిరిగినట్టు ఉందని చెప్పిందన్నాడు. ఈ విషయాన్ని స్నేహితులకు చెప్పాడు. గర్భం దాల్చిన సంకేతాలు ఉండచ్చేమోనని వరుడిపై జోక్స్ వేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న వరుడు, మరింత కలత చెందాడు.
మెడికల్ షాప్‌లో ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ కొనుగోలు చేసి భార్యకు ఇచ్చానని తెలిపాడు. అందరి ముందు తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. మరోసారి ఈ విధంగా ప్రవర్తించనని హామీ ఇచ్చాడు. దీంతో భార్యభర్తల మధ్య వివాదం సద్దు మణిగింది.