Hari Hara Veeramallu success meet :పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇప్పుడు రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ ఇంతవరకు సాగింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటిస్తున్నారు అని అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు చాలా అంచనాలు ఉండేవి. కొన్ని రోజుల తర్వాత ఈ ప్రాజెక్టు నుంచి క్రిస్ జాగర్లమూడి తప్పుకున్నారు.
పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం డేట్లు కేటాయించకపోవడం. ఈ ప్రాజెక్టు అలా డిలే అవడం వలన, క్రిష్ జాగర్లమూడి అనుష్క తో ఘాటి అనే ప్రాజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా నుంచి వీడియో కూడా విడుదలైంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది.
నువ్వు యాక్టింగ్ మర్చిపోయావా
హరిహర వీరమల్లు సినిమా నేడు అధికారికంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమాకు సంబంధించి నిన్ననే పలుచోట్ల ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. ఈ సినిమాకు దాదాపు 30 కోట్ల వరకు నిన్ననే కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తుంది. కానీ ఈ సినిమా సక్సెస్ మీట్ ఈవెంట్ ను నేడు నిర్వహించారు. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నిన్నటి కలెక్షన్స్ గురించి అక్కడ స్టేజ్ పై ఉన్న వాళ్ళని అడిగారు. వెంటనే నిధి అగర్వాల్ 30 కోట్లు అని చెప్పింది. మీరు యాక్టింగ్ మర్చిపోయారా.? కలెక్షన్స్ అన్ని ట్రాక్ చేస్తున్నారా అంటూ నిధిపై పవన్ కళ్యాణ్ జోక్స్ వేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సినిమా రిజల్ట్ కళ్యాణ్ తెలియదు
అయితే ఈ సినిమా యునానిమస్ గా హిట్ అయిపోయింది అని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. కానీ బయట ఈ సినిమాకు వస్తున్న టాక్ వేరు. ఈ సినిమా ఫలితం తేలడానికి ఇంకో రెండు రోజులు పడుతుంది. ఈ సినిమా సెకండ్ ఆఫ్ విషయంలో చాలామందికి కంప్లైంట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఫస్ట్ ఆఫ్ మాదిరిగా సెకండాఫ్ కూడా ఆకట్టుకుని ఉండి ఉంటే ఈరోజు ఈ సినిమా టాక్ వేరేలా ఉండేది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్నిచోట్ల కార్టూన్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. అయితే సెకండ్ ఆఫ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను తీర్చిదిద్దరున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు ఈ సినిమాకు ప్లస్ అవుతుందో వేచి చూడాలి.
Also Read: Pawan Kalyan – Nidhhi Agerwal : పాప బాబు కెమిస్ట్రీ వర్కౌట్ కాలేదు, వాటి పైన కూడా ట్రోలింగ్