Kingdom Ragile Ragile Song :విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా , గౌతమ్ తిన్ననూరి(Gowtham Thinnanuri) దర్శకత్వంలో వస్తున్న చిత్రం కింగ్డమ్ (Kingdom). శ్రీలంక నేపథ్యంలో భారీ అంచనాల మధ్య జూలై 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri borse) హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యదేవ్ (Sathyadev) కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మలయాళ నటుడు వీపీ వెంకటేష్(VP Venkatesh) ఈ సినిమా ద్వారా విలన్ గా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి “రగిలే రగిలే” అంటూ సాగే ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
ఆకట్టుకుంటున్న రగిలే రగిలే లిరికల్ సాంగ్..
తాజాగా కింగ్డమ్ మూవీ నుంచి “రగిలే రగిలే” అంటూ సాగే లిరికల్ సాంగ్ ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అందిస్తున్న మ్యూజిక్ సినిమాకే హైలెట్గా నిలవనుంది. “మృత్యువు జడిసేలా పద పద.. శత్రువు బెదిరేలా పద పద.. గర్జన తెలిసేలా పద పద.. దెబ్బకు గెలిచేలా పద పద.. పది తలల రావణునితో.. పోరు కొరకే కదిలాడు.. ఇక ఎవరు ఆపగలరు.. దహనం చేస్తాడు.. తెగబడిన రాక్షసులతో నేడు సహనం మరిచాడు. ఇక ఎవరూ ఆపగలరు.. మరణం రాస్తాడు.. రగిలే రగిలే” అంటూ సాగే ఈ పాట నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ముఖ్యంగా యాక్షన్ హై వోల్టేజ్ పెర్ఫార్మెన్స్ తో రిలీజ్ అయిన ఈ లిరికల్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచేస్తుందని చెప్పవచ్చు. కృష్ణ కాంత్ (Krishna Kanth) అందించిన ఒక్కో పదం ఒక్కో తూటాలా పేలుతోంది. ప్రముఖ సింగర్ సిద్ధార్థ్ బస్రూర్ (Siddharth Basrur) తన గొంతుకు పనిచెప్పి.. పాటకు ప్రాణం పోశారు. అంతేకాదు యూట్యూబ్లో ట్రెండ్ సృష్టించబోతోంది అని అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు.
కింగ్డమ్ సినిమా విశేషాలు..
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఎన్టీఆర్ (NTR ) ఇచ్చిన వాయిస్ ఓవర్ తో టీజర్ ను విడుదల చేయగా.. టీజర్ ఆధ్యంతం ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను మే 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేశారు. ఆ తర్వాత జూలై 4వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఇప్పుడు జూలై 31కి వాయిదా పడింది. 160 నిమిషాల నిడివితో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ఇటీవల సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఇక హై వోల్టేజ్ యాక్షన్ పర్ఫామెన్స్ తో విజయ్ దేవరకొండ ఈసారి అదరగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా నిర్మాత నాగ వంశీ కూడా అర్జున్ రెడ్డికి అమ్మ మొగుడు అంటూ కూడా కామెంట్ చేశారు. మరి ఇన్ని అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
ALSO READ:Vishwambhara: టీజర్ కాపీ ట్రోల్స్ పై స్పందించిన డైరెక్టర్.. నిజమే అంటూ క్లారిటీ!