SIR Preparations: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ మీటింగ్ నిర్వహిచారు. ఆ మీటింగ్‌లో ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ తదితరులు పాల్గోని సర్ పైన చర్చించారు. మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. Sir కార్యక్రమంలో చాలా చురుకుగా పాల్గొనాలని, ఎక్కడ చిన్న నిర్లక్ష్యంగా కూడా ఉండొద్దని అన్నారు. 27వ తేదీన జరిగే ఓటర్ గ్రామ సభలు చాలా కీలకం అని, మనం గతంలో బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో జరిగిన ఎసైఆర్ వల్ల జరిగిన పరిణామాలను చూశాం మనం జాగ్రత్తగా లేకపోతే నష్టపోతాం అని అన్నారు.
అణమాలిస్, ఆన్ మ్యాపుడ్, ఆన్ డిజలైటయిడ్ ఓట్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అర్హత కలిగిన ఓటును పరిశీలించాలి. ఒక్క ఓటు కూడా నష్టపోవొద్దు. ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంచార్జ్ లు చాలా కీలకంగా పని చేయాలి. డీసీసీ అధ్యక్షులు పూర్తి స్థాయిలో ఈ పని అయ్యే వరకు ఎలాంటి అలసత్వం లేకుండా పనిలో నిమగ్నం కావాలన్నారు. కాంగ్రెస్ ఓట్లను తొలగించే కుట్ర జరుగుతుందని, ఈ విషయంలో పూర్తి స్థాయిలో పని చేయాలన్నారు. బిఎల్ఏ తమ వద్ద సమగ్రమైన డేటాతో గ్రామ సభలలో పాల్గొని ప్రతి ఓటును పరిశీలించాలన్నారు. మండల కమిటీలను ఈ నెలాఖరులోగా వేయాలన్నారు. సహకార సంఘాల కమిటీలను కూడా ప్రతిపాదనలు పూర్తి చేయాలన్నారు.
Also read: చేతికి అదిరిపోయే లుక్.. బెస్ట్ అమోలెడ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్!
రాష్ట్రంలో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేనంత ఓట్ల తొలగింపు జరిగింది. అణమాలిస్, ఆన్ మ్యాపుడ్ ఓట్లను పరిశీలించండన్నారు. బీజేపీ కుట్ర చేస్తుంది. ఎన్నికల కమిషన్‌ను అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తుంది. ఇక్కడ మనం 2 శాతం ఓట్లతోనే గెలుచాము. కానీ ఇప్పుడు లక్షల ఓట్లను మాయం చేస్తున్నారన్నారు. ఇది చాలా ప్రమాదకరమైన అంశం ప్రతి ఒక్కరు సీరియస్‌గా పని చేయాలి. ఒక్క ఓటు కూడా నష్టపోవొద్దని అన్నారు. ఇంకా సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, sir కో ఆర్డినేటర్ గంప వేణుగోపాల్, టీపీసీసీ ఎన్నికల కమిషన్ చైర్మన్ రాజేష్ తదితరులు మాట్లాడారు.
Also Read: రూ.వెయ్యిలోపు అద్భుతమైన ఇయర్‌బడ్స్.. 40గంటల బ్యాటరీ బ్యాకప్!