Train Hits 20 yrs Old: ఊటీ ట్రాయ్ ట్రైన్. పెద్దగా పరిచయం లేదు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా ‘దిల్ సే’ (1998) లోని ‘ఛయ్యా ఛయ్యా’ పాటలో కనువిందు చేసిన ఈ రైలు.. ఆ తర్వాత ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందింది. ఎన్నో చిత్రాల్లో తన సహజ అందాలతో ఆకట్టుకుంది. నీలగిరి పర్వత రైల్వే ఇప్పుడు ఓ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచ వారసత్వ హోదా పొంది 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అద్భుతమైన ఇంజనీరింగ్, సాంకేతికతకు నిదర్శనంగా నిలిచిన ఈ పర్వత శ్రేణి రైల్వే, 1908లో అందుబాటులోకి వచ్చింది. దేశంలోనే అత్యంత నిటారుగా ఉన్న పర్వత రైల్వేగా 2005లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది.
కనువిందు చేసే నీలగిరి పర్వత పర్యటన
‘ఊటీ టాయ్ ట్రైన్’ అని పిలిచే ఈ నీలగిరి పర్వత రైల్వే పర్యాటకులను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఆహా అనిపించే కొండలు, ప్రకృతి అందాల నడు.. మెట్టుపాళయం నుంచి ఊటీ వరకు 46 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. ఏకైక రాక్-అండ్-పినియన్ లైన్ గా గుర్తింపు తెచ్చుకుంది. నిత్యం ఈ రైల్వే ప్రయాణం చేసేందుకు దేశ, విదేశీ పర్యాటకులు తరలివస్తారు.
1960లో టాయ్ ట్రైన్ సేవలు నిలిపివేత
నిజానికి 1968 ఎండింగ్ లో ఊటీ టాయ్ ట్రైన్ సేవలను నిలిపివేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. కానీ, ప్రజలు, పర్యాటకుల నుంచి ఈ రైలు కోసం డిమాండ్లు రావడంతో మళ్లీ పునరుద్దరించారు. ఆ తర్వాత ఈ ప్రాంతం ఆర్థికంగానూ బలపడింది. ఈ రైల్వే ద్వారా ఎంతో మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి పొందుతున్నారు.
దేశ విదేశాల నుంచి పర్యాటకుల రాక
ఊటీ టాయ్ ట్రైన్ ను 1908లో బ్రిటిషర్లు నిర్మించారు. ఈ రైలు ఆవిరి లోకోమోటివ్ లతో అందుబాటులోకి వచ్చింది. 208 వంపులు, 16 సొరంగాలు, 250 వంతెనలతో ఈ మార్గం అద్భుతంగా ఆకట్టుకుంటుంది. తేయాకు తోటలు, దట్టమైన అడవులు, జలపాతాలు, మంచుతో కప్పబడిన లోయలు అద్భుతమైన దృశ్యాలను అందిస్తాయి. ప్రయాణీకులకు ఉత్కంఠ భరిత ఆహ్లాదాన్ని అందిస్తుంది. ఈ రైలు రాకపోకలకు 4 గంటల చొప్పున సమయం పడుతుంది. మెట్టు పాళయం నుంచి ఊటీకి వెళ్లి రావడానికి 8 గంటల సమయం పడుతుంది. ఈ రైలు మెట్టుపాళయం నుంచి ఊటీకి ఉదయం 7:10 గంటలకు బయలుదేరి, మధ్యాహ్నం 11:55 గంటలకు చేరుతుంది. అటు ఊటీ నుంచి మెట్టుపాళయం వరకు మధ్యాహ్నం 2:00 గంటలకు బయలుదేరి, సాయంత్రం 5:30 గంటలకు చేరుతుంది.
Read Also: కరాచీకి టికెట్ కొంటే.. సౌదీలో దింపిన విమానం.. పాక్ ఎయిర్ లైన్స్ ఘనకార్యం!
నీలగిరి రైల్వే లో తొలి సినిమా షూటింగ్
నీలగిరి మౌంటెయిన్ రైల్వే పరిధిలో ‘మూండ్రం పిరై’ (1982) అనే సినిమాను తొలిసారి షూట్ చేశారు. కమల్ హాసన్, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఆ తర్వాత పలు సినిమాలు చిత్రీకరణ జరుపుకున్నాయి.
Read Also: ఆ నగరాలకూ బుల్లెట్ రైళ్లు.. జాబితాలో ఏపీ, తెలంగాణ ఉన్నాయా? ప్రాజెక్ట్ డిటైల్స్ ఇవే!