AA23 Theme Music: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ మరియు పాన్-ఇండియా రీచ్ సరిహద్దులు దాటి దూసుకుపోతోంది. ఆయన ఇంకా సెట్స్‌పైకి తీసుకెళ్లని క్రేజీ ప్రాజెక్ట్ ‘AA23’ థీమ్ మ్యూజిక్ ఏకంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లోకి చేరిపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అరుదైన క్రాస్ ఓవర్ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
Read also-అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ నుండి ‘గుండె పేలిపోతోందే’ లిరికల్ సాంగ్ వచ్చేసింది..
ప్రధాని నరేంద్ర మోదీ తన స్లోవేకియా పర్యటనలో భాగంగా ఆ దేశ రాజధాని బ్రాటిస్లావాను సందర్శించారు. అక్కడ ఆయనకు స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ (ఫస్ట్ క్లాస్)’ అందించారు ఆ దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రినీ. ఈ ప్రతిష్టాత్మక అధికారిక కార్యక్రమానికి సంబంధించిన విజువల్స్‌తో కూడిన ఒక వీడియోను ప్రధానమంత్రి తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.
అయితే, ఈ వీడియోకు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌గా రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేసిన ‘AA23 థీమ్’ (23 Theme)ను ఉపయోగించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దేశ ప్రధాని ఒక అంతర్జాతీయ వేదికకు సంబంధించిన అధికారిక వీడియోలో ఈ సినిమా మ్యూజిక్ వాడటంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
సాధారణంగా ఏ సినిమాకైనా టీజర్, ట్రైలర్ లేదా సినిమా విడుదలయ్యాక థీమ్ మ్యూజిక్ వైరల్ అవుతుంది. కానీ అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన ‘AA23’ చిత్రం ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అనౌన్స్ చేసిన ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. కేవలం ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో కోసం అనిరుధ్ అందించిన ఈ థీమ్ ట్రాక్.. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 12 లక్షలకు (1.2 Million) పైగా రీల్స్‌తో ఇప్పటికే సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇప్పుడు ఏకంగా ప్రధాని రీల్‌లోకి చేరడంతో దీని క్రేజ్ మరో స్థాయికి చేరింది.
Read also-థియేటర్లలో మళ్లీ ‘గబ్బర్ సింగ్’ పూనకాలు.. రీ-రిలీజ్ హంగామా ఎప్పుడంటే?
ఈ అద్భుతమైన క్షణాన్ని చూసి అల్లు అర్జున్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పండగ చేసుకుంటున్నారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ ఇన్‌స్టా పోస్ట్‌ను షేర్ చేస్తూ రికార్డు స్థాయి కామెంట్స్ పెడుతున్నారు.
“140 కోట్ల జనాభా గల దేశ ప్రధాని.. మన ఐకాన్ స్టార్ సినిమా బీజీఎమ్ వాడారంటే అల్లు అర్జున్ కల్చరల్ ఇంపాక్ట్ మరియు పాన్-ఇండియా రీచ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ‘ది వన్ అండ్ ఓన్లీ అల్లు అర్జున్’.. ఆయన పేరే ఒక బ్రాండ్” అంటూ ఫ్యాన్స్ మరియు సినీ విశ్లేషకులు పోస్టులు పెడుతున్నారు. ‘పుష్ప’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్.. ‘AA23’తో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ స్టైల్‌లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతున్నారో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.