E-Paper

థియేటర్లలో మళ్లీ ‘గబ్బర్ సింగ్’ పూనకాలు.. రీ-రిలీజ్ హంగామా ఎప్పుడంటే?

థియేటర్లలో మళ్లీ ‘గబ్బర్ సింగ్’ పూనకాలు.. రీ-రిలీజ్ హంగామా ఎప్పుడంటే?
Advertisement

Gabbar Singh ReRelease: తెలుగు చలనచిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసి, బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్రను సృష్టించిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్లలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా పేరు చెబితే ఇప్పటికీ అభిమానులకు పూనకాలు వస్తాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఆ మ్యాజిక్‌ను, ఆ ఎనర్జీని వెండితెరపై మరోసారి చూడాలని పవర్ స్టార్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు.

Read also-కేరళ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ ‘హ్యాపీ’ సరికొత్త రికార్డు.. 4 రోజుల్లోనే భారీ కలెక్షన్స్!

Advertisement

ఆ నిరీక్షణకు తెరదించుతూ, ఫ్యాన్స్ అందరికీ సరికొత్త పండుగ లాంటి వార్త వచ్చేసింది. ఈ నెల 26న ‘గబ్బర్ సింగ్’ చిత్రం థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ కాబోతోంది.

బాక్సాఫీస్ షేక్ చేసిన డైలాగులు, పాటలు!
“నాకొంచెం తిక్క ఉంది… కానీ దానికి ఓ లెక్క ఉంది!” అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్స్ థియేటర్లలో ఎలాంటి ఈలలు, గోలలు రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్, ముఖ్యంగా ‘కెవ్వు కేక’, ‘పిల్లా నువ్వు లేని జీవితం’ వంటి పాటలు ఇప్పటికీ చార్ట్‌బస్టర్స్ గానే ఉన్నాయి. అంత్యాక్షరి సీన్, కటౌట్ డైలాగులు థియేటర్లలో ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పించాయి.

Advertisement

Read also-సంచిత ఉగాలే ఆత్మహత్య.. నటీనటులపై పని ఒత్తిడి.. నటి ఆంచల్ ఖురానా సంచలన వ్యాఖ్యలు!

సెలబ్రేషన్స్‌కు సిద్ధమవుతున్న ఫ్యాన్స్
రీ-రిలీజ్ ట్రెండ్‌లో ‘గబ్బర్ సింగ్’ రాకతో థియేటర్ల వద్ద హంగామా నెక్స్ట్‌ లెవెల్‌లో ఉండబోతోంది. ఆ మాస్ డైలాగులు, ఆ పవర్ ప్యాక్డ్ ఎనర్జీని పెద్ద తెరపై గ్రూప్‌గా ఎంజాయ్ చేయడానికి పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పటికే భారీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

పవర్ స్టార్ ఫ్యాన్స్.. థియేటర్లలో మరోసారి రికార్డులు బద్దలు కొట్టడానికి, ఆ పాత జ్ఞాపకాలను భారీ ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ నెల 26న థియేటర్లలో కలుద్దాం! జస్ట్ వెయిట్ ఫర్ ద పవర్ స్టార్ రాంపేజ్!

Related News

ప్రధాని మోదీ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో అల్లు అర్జున్ ‘AA23’ థీమ్ మ్యూజిక్..

అజయ్ భూపతి ‘శ్రీనివాస మంగాపురం’ నుండి ‘గుండె పేలిపోతోందే’ లిరికల్ సాంగ్ వచ్చేసింది..

రామ్ చరణ్ ‘పెద్ది’ నుండి ‘హెల్లాల్లోల్లో’ ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..

కేరళ బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ ‘హ్యాపీ’ సరికొత్త రికార్డు.. 4 రోజుల్లోనే భారీ కలెక్షన్స్!

ఒకే వేదికపై సన్నీ డియోల్, అమీషా పటేల్.. ‘గదర్ 3’ ఒక న్యూక్లియర్ బాంబ్ అన్న దర్శకుడు!

‘వారణాసి’ తర్వాత మహేష్ రూట్ మార్చుతున్నారా? అనిల్ రావిపూడితో స్పోర్ట్స్ డ్రామా?

సంచిత ఉగాలే ఆత్మహత్య.. నటీనటులపై పని ఒత్తిడి.. నటి ఆంచల్ ఖురానా సంచలన వ్యాఖ్యలు!

×