Anudeep KV: టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అనుదీప్ కె.వి (Anudeep KV)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిట్టగోడ(Pittagoda) అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమైన ఈయన అనంతరం జాతి రత్నాలు(Jathi Ratnalu) సినిమాతో ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ప్రిన్స్, ఫస్ట్ డే ఫస్ట్ షో వంటి సినిమాలకి దర్శకుడుగా పనిచేసిన అనుదీప్ ప్రస్తుతం కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా అనుదీప్ కి సంబంధించి ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డైరెక్టర్ కు అవమానం..
తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని విమల్ థియేటర్ లో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ అనుదీప్ కూడా పాల్గొని సందడి చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో డైరెక్టర్ అనుదీప్ కు ఘోర అవమానం జరిగిందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి ట్రైలర్ అంటే అభిమానుల హంగామా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా ఆ క్రౌడ్ ను పోలీసులు కంట్రోల్ చేస్తూ ఉన్న సమయంలోనే అనుదీప్ ఆ జనం మధ్యలో ఒక సాధారణ వ్యక్తి లాగే లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.
వెనక్కు నెట్టిన పోలీసులు..
ఈ క్రమంలోనే పోలీసులు అతను డైరెక్టర్ అని గుర్తించకపోవడంతో తనని కూడా వెనక్కి తోసేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ వీడియో పై మీమ్స్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఇక ఈ వీడియో వైరల్ గా మారడంతో ఎంతోమంది అయ్యయ్యో పాపం అనుదీప్.. ఇది ఘోర అవమానం… అతను ఒక డైరెక్టర్ అని గుర్తించండయ్యా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా తనకు సంబంధించిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నప్పటికీ అనుదీప్ మాత్రం ఎక్కడ స్పందించలేదు.
?utm_source=ig_web_copy_link
అనుదీప్ ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమా తర్వాత తదుపరి ఎలాంటి ప్రాజెక్టులను ఇప్పటివరకు ప్రకటించలేదు కానీ, తన సినిమాలకు సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈయన మాస్ మహారాజ రవితేజకు ఒక అద్భుతమైన కథను వినిపించినట్టు తెలుస్తుంది. ఈ కథకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు కూడా ముగిసాయని అతి త్వరలోనే ఈ సినిమాను గురించి అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయని వార్తలు బయటకు వచ్చాయి. ఇదే కనుక నిజమైతే రవితేజ ఆన్ స్క్రీన్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కు అనుదీప్ కామెడీ తోడైతే సినిమా మామూలుగా ఉండదని చెప్పాలి. ఇది నిజంగా రవితేజ(Ravi Teja) అభిమానులకు పండగ లాంటి వార్త.ఇక రవితేజ కూడా ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: స్వరాల మాంత్రికుడు.. ఆస్కార్ అవార్డు గ్రహీత.. కీరవాణి బర్త్ డే స్పెషల్!