Prabhas Fauzi:ఆగస్ట్ 15… ఈరోజుకున్న ఇంపార్టెన్స్ ఏంటో తెలియంది కాదు. ఇక ఇప్పుడు ఇదే పీరియడ్‌ను బ్యాక్‌డ్రాప్‌గా చేసుకుని వస్తున్న ప్రభాస్ ‘ఫౌజీ’ వస్తున్న సంగతి తెల్సిందే. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన టాక్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
‘సీతారామం’తో తన స్టైల్ ఏంటో చూపించిన హను రాఘవపూడి.. ఈసారి ఏకంగా ప్రభాస్‌తో ఓ భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాను పట్టాలెక్కించాడు.బ్రిటిష్ పాలన కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ మూవీకి డిసెంబర్ 3, 2026న వరల్డ్‌వైడ్ రిలీజ్‌ను అధికారికంగా ప్రకటించారు కూడా.
ఇక ఇప్పటికే ప్రభాస్ లుక్, సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించిన పోస్టర్లు అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి. ముఖ్యంగా ‘A Battalion Who Fights Alone’ అనే ట్యాగ్‌లైన్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసిందనే చెప్పాలి. ఇందులో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా, జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతం విషయంలో కూడా విశాల్ చంద్రశేఖర్‌పై టీమ్ భారీగా నమ్మకం పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
అయితే ఇలాంటి సినిమా నుంచి ఆగస్ట్ 15న ఏదైనా స్పెషల్ అప్‌డేట్ వస్తే బాగుంటుందని ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. కారణం కూడా చాలా సింపుల్. స్వాతంత్ర్య దినోత్సవం.. స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంతో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’.. పైగా ప్రభాస్. ఈ కాంబినేషన్‌కు ఇంతకంటే పర్ఫెక్ట్ డేట్ ఇంకేం ఉంటుంది అన్నది అభిమానుల ఆలోచన.
అయితే ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మాత్రం ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న రేంజ్‌లో లేదట. ఆగస్ట్ 15 కోసం ఒక టీజర్ లేదా ప్రత్యేక వీడియో తీసుకురావాలనే ఆలోచన టీమ్‌లో ఉన్నప్పటికీ, అందులో ఉండాల్సిన కీలకమైన సన్నివేశం విషయంలో అనుకోని సమస్య ఎదురైందని టాక్.ఆ సీన్‌లో పాల్గొనాల్సిన ఓ ఆర్టిస్టుకు సంబంధించిన వీసా సమస్య కారణంగా షూటింగ్ ప్లాన్ అనుకున్నట్టుగా జరగలేదని సమాచారం. దీంతో ఆ ఎపిసోడ్‌ను ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
ఆ సన్నివేశం లేకుండా టీజర్ కట్ చేస్తే ‘ఫౌజీ’ ప్రపంచాన్ని పూర్తిగా పరిచయం చేయలేమని మేకర్స్ భావిస్తున్నారట. అదే కారణంతో ఆగస్ట్ 15 టీజర్ ప్లాన్‌పై మేకర్స్ ఇంకా ఎలాంటి డిసిషన్ తీసుకోలేకపోతున్నారట.
అయితే తంటాలు పడి చివరి నిమిషంలో షూట్ చేసినా.. దాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి వెంటనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం అంత ఈజీ కాదనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.
ఇదే జరిగితే ప్రభాస్ అభిమానులు ఈసారి టీజర్ కోసం కాకుండా పోస్టర్‌తోనే సరిపెట్టుకోవాల్సి రావచ్చు. అయితే సినిమా టీమ్ నుంచి ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.అందుకే చివరి నిమిషంలో ఏదైనా సర్ప్రైజ్ ఇస్తారా? లేక ఆగస్ట్ 15 సందర్భంగా కేవలం విషెస్‌తో పాటు కొత్త పోస్టర్ మాత్రమే వదులుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
‘ఫౌజీ’కి ఇది మరింత ప్రత్యేకం కావడానికి మరో కారణం హను రాఘవపూడి. ‘సీతారామం’లో ప్రేమకథను చరిత్రతో కలిపి ప్రేక్షకులను ఎమోషనల్ చేసిన ఆయన.. ఈసారి దేశభక్తి, యుద్ధం, ప్రేమ, త్యాగం లాంటి అంశాలను ఎలా మిక్స్ చేస్తారన్నదే ఇప్పుడు పెద్ద క్యూరియాసిటీ.
ఇప్పటికే సినిమా ఫైనల్ షెడ్యూల్ త్వరలోనే షూట్ చేసుకోబోతుందని, ప్రభాస్ అన్ని పనులకు ఫుల్ స్టాప్ పెట్టి ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడని సమాచారం.
also read:థియేటర్‌లో చూసిన హీరో పక్కనే.. ఇప్పుడు హీరోయిన్‌గా!..ఇరుముడి ఈవెంట్లో ప్రియా భవాని శంకర్!
మొత్తానికి ఆగస్ట్ 15న ‘ఫౌజీ’ నుంచి ఏదైనా సర్ప్రైజ్ వస్తుందా లేదా అన్నదే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్‌లో హాట్ టాపిక్. చూడాలి మరి మేకర్స్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో!