Chiranjeevi Birthday: అసలే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.ఇటు ఇండస్ట్రీలోనూ,అటు సోషల్ మీడియాలోనూ సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పక్కర్లేదు.ఇలా ఇప్పటికే ఎంతో మంది టాలీవుడ్‌కి చెందిన ప్రముఖులు తమ తమ విషెస్ తో బాస్ పై తమ ప్రేమని తెలియపరుస్తున్నారు.ఇక ఇదే క్రమంలో చిరూ బర్త్‌డే సందర్భంగా ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా టీమ్ కూడా తమ విషెస్ ని తెలియపరుస్తూ ఒక క్రేజీ పోస్ట్ వదిలింది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాటు స్పిరిట్ టీమ్ అంతా చిరంజీవితో ఉన్న ఒక అరుదైన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక చిరు సినిమా ప్రయాణం మొదలైన తొలి రోజుల్లో చిరంజీవిని కలిసిన సమయానికి సంబంధించిన ఈ పిక్ ఉన్న వీడియో నిమిషాల్లోనే వైరల్ అయిపోయింది.ఇక ఈ వీడియోలో చిరు సూపర్ డూపర్ హిట్ గ్యాంగ్ లీడర్ టైటిల్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో రావడంతో రిపీట్ మోడ్ లో చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.
భద్రాకాళి పిక్చర్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ, చిరంజీవి రావడంతోనే ఆ క్షణానికి ఒక కొత్త ఊపు వచ్చిందని, ఆయన రాకతో వాతావరణమే మారిపోయిందని ఎమోషనల్ కామెంట్ వదిలింది.అంతేకాకుండా, తరాలు మారినా చిరంజీవికి ఉన్న క్రేజ్, ఇమేజ్ కొద్దిగా కూడా తగ్గదని వివరిస్తూ ‘స్పిరిట్’ అధికారిక ఖాతా పెట్టిన విష్ మెగా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
ఇక ఈ ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో చిరంజీవి, ప్రభాస్ అభిమానుల మధ్య పెద్ద చర్చే మొదలైంది. వీరి కాంబినేషన్‌లో ఏదైనా సర్‌ప్రైజ్ ఉండబోతోందా లేక కేవలం గౌరవంతోనే ఈ ఫోటో బయటకు వదిలారా అని నెటిజన్లు ఆసక్తిగా ఆరా తీస్తున్నారు.
ఇక ‘స్పిరిట్’ ప్రాజెక్ట్ విషయానికి వస్తే, ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’ లాంటి సెన్సేషనల్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న సంగతి తెల్సిందే. ప్రభాస్ ఇమేజ్‌ను, మాస్ ఎలిమెంట్స్‌ను సరికొత్తగా చూపేందుకు సందీప్ పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి నటిస్తుండగా, వివేక్ ఒబెరాయ్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఐశ్వర్య దేశాయ్ ఈ చిత్రంతోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం.
Happy Birthday @KChiruTweets Sir ❤️❤️
We love you… A HABIT that generations could never resist …#SPIRIT https://t.co/9so3GUWg4G
— Spirit (@InSpiritMode) August 22, 2026
ఇక భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్ వరల్డ్ మూవీ 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుందని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా.ఏది ఏమైనా ఇంటెన్స్ సినిమాలు తీసే సందీప్ వంగా ఇంటెన్సిటీ ని అధ్బుతంగా పలికించగల చిరు తో సినిమా తీస్తే అది ఇండస్ట్రీ రికార్డ్స్ ని రీ రైట్ చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు !
also read :ప్యారడైజ్‌లో అసలేం జరుగుతోంది?