E-Paper
Advertisement

Maruthi: చిరుతో మూవీపై క్లారిటీ.. అవకాశం ఇస్తారా?

Maruthi: చిరుతో మూవీపై క్లారిటీ.. అవకాశం ఇస్తారా?
Advertisement

Maruthi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)తో ప్రముఖ డైరెక్టర్ మారుతీ (Maruthi) తాజాగా దర్శకత్వం వహించిన చిత్రం ది రాజాసాబ్. సంక్రాంతి సందర్భంగా జనవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ థియేటర్లకు మాత్రం ప్రేక్షకులు బారులు తీరుతున్నారు. ఇక దీంతో కలెక్షన్లు కూడా పెరిగిపోయాయి. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వసూలు రాబట్టింది అని, ఈ చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే సక్సెస్ హ్యాపీ నెస్ ను ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ మారుతీ షేర్ చేసుకున్నారు. అందులో భాగంగానే చిరంజీవి (Chiranjeevi)తో మూవీపై ఆయన క్లారిటీ ఇచ్చారు.

చిరంజీవితో మూవీపై మారుతీ క్లారిటీ..

మారుతీ మాట్లాడుతూ.. “ది రాజాసాబ్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొందడం మరింత సంతోషంగా ఉంది. ముఖ్యంగా సైకలాజికల్ ఎలిమెంట్స్ తో కొత్త పాయింట్ తో సినిమాను చూపించాం.. కాబట్టి ప్రేక్షకులకు రీచ్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. అటు ప్రభాస్ కూడా ప్రశాంతంగా ఉండు డార్లింగ్.. మనం కొత్త ప్రయత్నం చేసాము. కచ్చితంగా ఆడియన్స్ కు రీచ్ అవుతుంది. కానీ అంతవరకు మనం ఓపిక పట్టాలి అని చెప్పారు.. ముఖ్యంగా ప్రభాస్ ను ఓల్డ్ గెటప్ లో చూపించడం , ఆ సన్నివేశాలను ఈ ఇప్పుడు సినిమాలో యాడ్ చేశాక ప్రభాస్ కి మెసేజ్ చేశాను.. ఆయన ఆ సీన్స్ అన్ని ఇప్పుడు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయని చెప్పారు. చిరంజీవి గారితో సినిమా చేయాలని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఒకవేళ ఆయన అవకాశం ఇస్తే నా లైఫ్ సర్కిల్ పూర్తవుతుందని భావిస్తున్నాను. ముఖ్యంగా నేను చిరంజీవికి వీరాభిమానిని. అందుకే ఆయనతో సినిమా చేయాలని కోరుకుంటున్నాను” అంటూ మారుతి తెలిపారు. ఇక మారుతి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి మారుతికి అవకాశం ఇస్తారా?

Advertisement

ఇక చిరంజీవి విషయానికి వస్తే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా చేశారు. ఈ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా.. అటు కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతోంది. పైగా బుక్ మై షోలో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన చిత్రంగా కూడా నిలుస్తోంది ఈ సినిమా. ఇక ఈ సినిమా తర్వాత ఆయన వశిష్ట మల్లిడి దర్శకత్వంలో వచ్చిన విశ్వంభర సినిమాను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ప్రముఖ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో సినిమా చేయాల్సి ఉంటుంది. మరి ఈ సినిమాలన్నింటి తర్వాత చిరంజీవి మారుతికి అవకాశం ఇస్తారా? లేక మరో డైరెక్టర్ తో ఆయన సినిమా చేయనున్నారా? అన్న విషయం తెలియాల్సి ఉంది. ఒకవేళ మారుతీతో సినిమా చేస్తే మారుతి కెరియర్ కూడా టర్న్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ:Vishwambhara: విశ్వంభరకి లైన్ క్లియర్.. చిరంజీవి టాలెంట్ మామూలుగా లేదుగా?

Related News

చిన్న వయసులోనే గొప్ప మనసు చాటుకున్న సితార.. మహేష్ బాబు ఎమోషనల్ పోస్ట్!

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

Big Stories

Advertisement
×