E-Paper
Advertisement

Spirit Movie: తనపై వస్తున్న వార్తలకు సీరియస్ అయిన నటుడు ప్రకాష్ రాజ్.. ఇంకా స్టార్ట్ కాలేదా?

Spirit Movie: తనపై వస్తున్న వార్తలకు సీరియస్ అయిన నటుడు ప్రకాష్ రాజ్.. ఇంకా స్టార్ట్ కాలేదా?
Advertisement

Spirit Movie: ప్రభాస్ హీరోగా, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా చుట్టూ రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ముఖ్యంగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని, దర్శకుడితో వచ్చిన విభేదాల వల్లే ఆయన వైదొలిగారనే వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. ఈ నెగెటివ్ ప్రచారంపై ప్రకాష్ రాజ్ తాజాగా తనదైన శైలిలో స్పందిస్తూ, పుకార్లకు చెక్ పెట్టారు.

Read also-Podarillu Today Episode : హాస్టల్ కోసం వెళ్లిన మహా.. మాధవ్ సీరియస్.. అయ్యో.. మహాకు ఎన్ని కష్టాలో..?

అసలు విషయం ఏంటి?

Advertisement

కొంతకాలంగా సోషల్ మీడియాలో “ప్రకాష్ రాజ్ ‘స్పిరిట్’ నుంచి ఎగ్జిట్ అయ్యారు” అనే వార్త ట్రెండ్ అవుతోంది. దీనిపై ప్రభాస్ అభిమానులు కూడా అయోమయానికి గురయ్యారు. అయితే ఈ వార్తలపై స్పందించిన ప్రకాష్ రాజ్, ఇవన్నీ కేవలం అభూతకల్పనలని కొట్టిపారేశారు. దీని గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. “నాకు సంబంధించిన సీన్ల షూటింగ్ ఇంకా ప్రారంభమే కాలేదు. అసలు షూటింగ్‌కే వెళ్లనప్పుడు, ఇక సినిమా నుంచి తప్పుకోవడం అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది?” అని ఆయన లాజికల్‌గా ప్రశ్నించారు. సోషల్ మీడియాలో నిరాధారమైన వార్తలు పుట్టించే వారిపై ఆయన మండిపడ్డారు. వీటిని ‘వాట్సాప్ ఫ్యాక్టరీలో పుట్టే కట్టుకథలు’ అని సంబోధిస్తూ, ఇలాంటి ఫేక్ న్యూస్‌ను నమ్మవద్దని ప్రేక్షకులను కోరారు. తాను ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నానని, త్వరలోనే షూటింగ్‌లో పాల్గొంటానని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు.

Read also-Akira Nandan: అకీరా నందన్ కోసం ఆ దర్శకుడిని స్టోరీ అడిగిన పవన్ కళ్యాణ్..

వదంతులకు ఫుల్ స్టాప్

Advertisement

పెద్ద సినిమాల విషయంలో చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూపించడం సోషల్ మీడియాలో పరిపాటిగా మారింది. ప్రకాష్ రాజ్ వంటి సీనియర్ నటుడు ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటే అది సినిమా బరువును తగ్గిస్తుందని కొందరు నెగెటివ్ ప్రచారం మొదలుపెట్టారు. కానీ, ఆయన ఇచ్చిన క్లారిటీతో ఆ ప్రచారానికి ఒక్కసారిగా బ్రేక్ పడింది. సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో పాత్రలు చాలా రా గా, పవర్‌ఫుల్‌గా ఉంటాయి. ప్రకాష్ రాజ్ వంటి నటుడు ఆ టీమ్‌లో ఉండటం ఖచ్చితంగా సినిమాకు ప్లస్ పాయింట్ అవుతుంది. ఇప్పుడు ఆయన క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఏదైనా వార్తను షేర్ చేసే ముందు అది నిజమో కాదో సరిచూసుకోవాలని, కేవలం వ్యూస్ కోసం లేదా నెగెటివిటీ కోసం వార్తలు సృష్టించడం సరికాదని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ప్రస్తుతానికి ‘స్పిరిట్’ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ప్రకాష్ రాజ్ ఆ ప్రాజెక్టులో కొనసాగుతున్నారు.

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×