Vijay Devarakonda: విజయ్ దేవరకొండ సినీనటుడుగా ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. అదే విధంగా నిర్మాతగా కూడా ఈయన కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇలా నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగడమే కాకుండా ఈయన థియేటర్ బిజినెస్ లోకి కూడా అడుగుపెట్టారు. ఇప్పటికే ఏషియన్ వారితో కలిపి AVD మల్టీప్లెక్స్ థియేటర్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా ఈయన మరోవైపు రౌడీ బ్రాండ్ తో క్లోతింగ్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టారు.
ఇలా సినీ నటుడిగా ఎంతో బిజీగా గడుపుతూనే మరోవైపు వ్యాపార రంగంలో కూడా దూసుకుపోతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ మరొక కొత్త బిజినెస్ ప్రారంభించినట్లు తెలుస్తోంది. స్వయంగా ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇక ఈసారి ఈయన చాలా విభిన్నంగా స్కిన్ కేర్ ప్రొడక్ట్ బిజినెస్ ప్రారంభించారని చెప్పాలి.”అన్ హైప్. ఇన్” అనే పేరుతో ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశారు. ఇక ఈ విషయాన్ని విజయ్ దేవరకొండ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ…
నా జీవితంలో ఎంతో పెద్ద మార్పులు తీసుకొచ్చిన కొన్ని విషయాలు ఉన్నాయి. నా జీవనశైలి పై ప్రభావం చూపిన కొన్ని అలవాట్లు ఉన్నాయి. వాటిలో నా చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవటం టాప్ 5 లో ఉంటుందని అందుకే మీ అందరికీ UNHYPE.IN ను పరిచయం చేస్తున్నానని ఈయన తన కొత్త బ్రాండ్ గురించి తెలిపారు. నా ఈ అనుభవంలో బాగా పనిచేసిన స్కిన్ స్కేర్ విధానాల ఆధారంగా ఈ బ్రాండ్ తో సహా వ్యవస్థాపకుడిగా ప్రారంభించిన బ్రాండ్ అని తెలిపారు. ఈ బ్రాండ్ నాకోసం మీకోసం నా అబ్బాయిలు అమ్మాయిల కోసం ఒక మంచి మార్పు తీసుకురావాలని ఎంతో ప్రేమతో ఉత్సాహంతో మీ విజయ్ దేవరకొండ అంటూ ఈయన తన కొత్త బ్రాండ్ కి సంబంధించి విషయాలు తెలియజేశారు.
There are some things that have made a big difference in my life.
There are some habits that have had a huge positive effect on my lifestyle.
Taking good care of my skin is in my top 5.
So, here is-https://t.co/92McdxFYN2
A skincare brand I co-founded, built around what has… pic.twitter.com/y7DPdeBXSP
— Vijay Deverakonda (@TheDeverakonda) September 11, 2026
ఈ విధంగా విజయ్ దేవరకొండ మరొక బిజినెస్ ప్రారంభించారు అనే విషయం తెలియడంతో అభిమానులు విజయ్ దేవరకొండకు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఈయన రౌడీ జనార్ధన్ అనే సినిమాతో పాటు డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ తో కలిసి రణబాలి(Ranabaali) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఒక టీజర్ వీడియో పెద్ద ఎత్తున సినిమాపై అంచనాలను పెంచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ జోడిగా రష్మిక మందన్న(Rashmika Mandanna) నటించడం విశేషం.
Also Read: సమంత ఎంగేజ్మెంట్ రింగ్ వెనుక ఇంత స్టోరీ ఉందా.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే!