Samantha: సినీనటి సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా వేదికగా అభిమానులకు మాత్రం చాలా దగ్గరవుతున్నారు. ఇటీవల కాలంలో సమంత సినిమాలు చాలా తక్కువగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. చాలా సంవత్సరాల తర్వాత సమంత మా ఇంటి బంగారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత సమంత (Samantha)ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈమె ప్రెగ్నెంట్ కావడంతో కొంతకాలం పాటు ఇండస్ట్రీకి విరామం ప్రకటించారు.
సమంత ప్రెగ్నెన్సీ కారణంగా పూర్తిగా విరామం తీసుకుని తన ఈ ప్రెగ్నెన్సీ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇకపోతే సమంత ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన జీవితంలో ఎదురైనా ఒడిదుడుకుల గురించి ఈ సందర్భంగా అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా నాగచైతన్య( Naga chaitanya) నుంచి విడాకులు తీసుకున్న తర్వాత సమంత ఎంతగానో కృంగిపోయింది అదే సమయంలో మయోసైటిస్ ( Myositis)వ్యాధికి గురి అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సమంత ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తాజాగా ఆ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే సమంత మయోసైటిస్ గురించి మాట్లాడుతూ.. తనకు మయోసైటిస్ నిర్ధారణ జరిగిన సమయంలో ఒక్కసారిగా తాను తన ఐడెంటిటీని కోల్పోయాననే భావన కలిగిందని తన జీవితంపై నియంత్రణ లేదనే అభద్రత భావంలోకి వెళ్లిపోయాను అంటూ అప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఒక నటిగా నిరంతరం వర్కౌట్స్ చేస్తూ ఆరోగ్యంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంపొందించుకున్నాను అయితే కష్ట కాలంలో తనకు మయోసైటిస్ రావడంతో మానసికంగా ఎంతో కృంగిపోయానని నాకే ఎందుకు ఇలా జరుగుతుందని మదనపడ్డానని సమంత తెలిపారు. ఇలా మయూసైటిస్ నిర్ధారణ అయినప్పటికీ ఆ పరిస్థితుల నుంచి తాను ఎలా బయటపడాలి అనేది పూర్తిగా నా చేతుల్లో ఉందనే విషయం గ్రహించడం కోసం నాకు కాస్త సమయం పట్టిందని తెలిపారు.
సమాజం కోసం లేని ఆత్మవిశ్వాసాన్ని ఉన్నట్టు నిరూపించుకోవడం కంటే మన జీవితంలో నేర్చుకోవాల్సిన కొన్ని పాఠాలు ఉన్నాయని గ్రహించానని ఈ అనారోగ్యం నాకు జీవితంలో కీలకమైన అంశాలను నేర్పించింది. ఈ సమయంలో తాను ఎక్కువగా ఓర్పు, సహనం, నాలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అయ్యాయని సమంత తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి కష్టతరమైన సమయం ఉంటుందని వాటన్నింటినీ ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అంటూ ఈ సందర్భంగా సమంత తెలిపారు. ఇలా ఆమెకు మయోసైటిస్ వచ్చిన సమయంలో ఈ వ్యాధి నుంచి బయటపడటం కోసం ఎన్నో రకాల చికిత్సలు తీసుకున్నారు. ఆత్మవిశ్వాసంతో మయోసైటిస్ నుంచి సమంత బయటపడి తిరిగి తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఎంపిక చేసుకొని ఎంతో సంతోషంగా గడుపుతున్న సంగతి తెలిసిందే.
Also Read: లోకేష్ ‘డీసీ’ హిట్..ఆ ముగ్గురికి బీఎండబ్ల్యూ కార్లను గిఫ్ట్ గా ఇచ్చిన ప్రొడ్యూసర్!