E-Paper
Advertisement

స్వయంభు’ వెనుక సంయుక్త కష్టం.. వీడియో వైరల్!

స్వయంభు’ వెనుక సంయుక్త కష్టం.. వీడియో వైరల్!
Advertisement

Samyuktha Menon: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ గా, గోల్డెన్ లెగ్ గా భారీ పాపులారిటీ అందుకున్న సంయుక్త మీనన్ (Samyuktha Menon) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. వరుస విజయాలతో.. వరుస ప్రాజెక్టులతో బిజీగా మారిన ఈ ముద్దుగుమ్మ.. తాజాగా నటించిన చిత్రం స్వయంభు. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక మూవీపై ఎప్పటికప్పుడు అంచనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. భరత్ కృష్ణమాచార్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ (Samyuktha Menon), నభా నటేష్ (Nabha natesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్లపై భువన్ , శ్రీకర్ నిర్మిస్తున్న ఈ సినిమా సుమారుగా రెండేళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ ఇటీవల పూర్తి చేసుకుంది.

స్వయంభు మూవీ కోసం సంయుక్త ఇంత కష్టపడ్డారా?

ఇకపోతే సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొకవైపు సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే ఈరోజు సంయుక్త మీనన్ పుట్టినరోజు కావడంతో సుమారుగా 40 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ తో పాటు సినిమాలో తన పాత్ర కోసం ఆమె పడ్డ కష్టాన్ని కూడా అందులోనే చూపించారు. ఇందులో వీరనారి పాత్రలో సంయుక్త కనిపించిన తీరు, కత్తి యుద్ధాలు చేసిన విధానం ప్రేక్షకులలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

బర్త్ డే స్పెషల్ .. ఆకట్టుకుంటున్న టీజర్..

Advertisement

గ్లామర్, ఎమోషనల్ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సంయుక్త.. తొలిసారి స్వయంభు చిత్రంలో పూర్తి భిన్నమైన అవతారంలో కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే స్పష్టం అవుతుంది. ముఖ్యంగా తాడు సహాయంతో కొండలు ఎక్కడం , యుద్ధ సన్నివేశాలలో పాల్గొనడం లాంటివి చూస్తూ ఉంటే సంయుక్త వీరనారి పాత్ర కోసం ఎంత కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు.

అంచనాలు పెంచేస్తున్న టీజర్లు..

ఇకపోతే అంతర్యుద్ధాలు, రాజ్యాలు, ప్రజలను కాపాడేందుకు జరిగే పోరాటాలు.. వీరత్వంతో కూడిన సన్నివేశాలు చూస్తుంటే సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. చేతిలో కత్తి పట్టుకుని యుద్ధరంగంలో పోరాడుతున్న ఆమె సన్నివేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీరనారి గెటప్లో సంయుక్త చాలా అద్భుతంగా ఉంది అంటూ అభిమానుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

యువరాణి పాత్రలో నభానటేష్..

Advertisement

ఇదిలా ఉండగా ఇందులో నటిస్తున్న మరో హీరోయిన్ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో ఈమె యువరాణి పాత్రలో కనిపించనుంది.మొన్నా మధ్య విడుదలైన టీజర్ లో ఆమె లుక్ కూడా రాజసం ఉట్టిపడేలా కనిపించింది. చారిత్రక నేపథ్యానికి తగ్గట్టుగా రూపొందించిన సెట్స్ , వస్త్రధారణ, పాత్రల లుక్స్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచేసాయి. మొత్తానికి అయితే హీరోయిన్స్ బర్తడేల సందర్భంగా విడుదల చేస్తున్న ఈ టీజర్ లు సినిమాలపై అంచనాలు పెంచేయడమే కాకుండా ఆ సినిమాల కోసం వీరు పడుతున్న కష్టాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇకపోతే ఈ సినిమాలో కమెడియన్ సునీల్ కీలక పాత్రలో నటించబోతున్నారు.

also read:నందన అరెస్ట్.. ఏం పీ*క*లే*రు అంటూ అన్వేష్ వీడియో రిలీజ్!

సంయుక్త మీనన్ మూవీ పోస్టర్స్..

ఇకపోతే సంయుక్త మీనన్ చాలా చిత్రాలలో నటిస్తున్న విషయం తెలిసిందే.అందులో పూరీ జగన్నాథ్ , విజయ్ సేతుపతి కాంబినేషన్లో వస్తున్న స్లమ్ డాగ్: 33 ఆన్ రోడ్ మూవీ నుండి ఆన్ సెట్ చిత్రాలను విడుదల చేస్తూ చిత్ర బృందం ఈమెకు స్పెషల్ తెలియజేసింది . అలాగే రామ్ పోతినేని Rapo 23 మూవీ నుండి కూడా ఈమెకు స్పెషల్ విషెస్ లభించాయి.

 

Related News

శ్రీలీలకు బిగ్ ఛాన్స్.. మోక్షజ్ఞతో జోడీ కడుతుందా?

మరో బిజినెస్‌లోకి అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ.. కొత్త స్కిన్‌కేర్ బ్రాండ్ ఇదే!

నడవలేని స్థితిలో టాలీవుడ్ లేడీ కమెడియన్.. వీడియో వైరల్!

‘స్లమ్ డాగ్’ నుండి సంయుక్త ఆన్ సెట్ పిక్స్.. రిలీజ్ డేట్ పై మేకర్స్ క్లారిటీ?

మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు.. అసలేం జరిగిందంటే?

నిహారిక నీలో ఈ టాలెంట్ కూడా ఉందా.. బొజ్జ గణపయ్య లుక్ చూశారా?

వైష్ణవితో నిజంగానే లవ్ ఉందా ?..అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ !

Big Stories

Advertisement
×