E-Paper
Advertisement

Premante First Day Collections: ప్రేమంటే ఫస్ట్ డే కలెక్షన్స్.. స్టార్ నటీనటులు ఉన్నా… మరీ అంత తక్కువా ?

Premante First Day Collections: ప్రేమంటే ఫస్ట్ డే కలెక్షన్స్.. స్టార్ నటీనటులు ఉన్నా… మరీ అంత తక్కువా ?
Advertisement

Premante First Day Collections: టాలీవుడ్ హీరో ప్రియదర్శి(Priyadarshi) ఇటీవల బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.గత నెలలో ఈయన మిత్రమండలి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రియదర్శి, ఆనంది(Aanandi) జంటగా తెరకెక్కిన ప్రేమంటే (Premante)సినిమా నవంబర్ 21వ తేదీ విడుదల అయ్యి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్ల విషయానికి వస్తే..

అంచనాలను చేరుకోలేకపోయిన ప్రేమంటే..

ప్రేమంటే సినిమా విడుదలకు ముందు భారీ స్థాయిలో ప్రమోషన్లను నిర్వహించి సినిమాపై మంచి అంచనాలను పెంచేశారు. సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా మంచిగానే జరిగిందని తెలుస్తుంది. అయితే సినిమా విడుదలైన తర్వాత అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా మొదటి రోజు అన్ని ఏరియాల్లో కలిపి కేవలం 32 లక్షల కలెక్షన్లు మాత్రమే రాబట్టింది. ఇలా ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి అంటే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి. ఈ సినిమాలో ప్రియదర్శి ఆనంది జంటగా నటించగా యాంకర్ సుమ, హైపర్ ఆది ఆటో రాంప్రసాద్, వెన్నెల కిషోర్ వంటి తదితరులు నటించినప్పటికీ ఏమాత్రం ప్రేక్షకులను మెర్పించలేకపోయారు.

రూ.32 లక్షల కలెక్షన్లతో సరిపెట్టుకున్న ప్రేమంటే..

Advertisement

ఈ సినిమా రూ. 8 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుపుకుందని తెలుస్తుంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే సుమారు పది కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టాలని తెలుస్తుంది. అయితే ఈ సినిమా మొదటి రోజు కేవలం 32 లక్షల రూపాయల కలెక్షన్లను మాత్రమే రాబట్టడంతో టార్గెట్ చేరుకోవడం కష్టతరమే అవుతుందని తెలుస్తోంది. ఇక నవంబర్ 21వ తేదీ పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

టార్గెట్ చేరుకోవటం కష్టమేనా?

Advertisement

ఈ సినిమాలలో రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాల కలెక్షన్ల పై ప్రభావం పడిందనే చెప్పాలి. మరి ప్రేమంటే సినిమాకు మిగిలిన రెండు రోజులలో మంచి టాక్ వస్తే తప్ప టార్గెట్ రీచ్ అవ్వడం చాలా కష్టమని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పెళ్లి తర్వాత భార్య భర్తల జీవితంలో చోటుచేసుకునే గొడవలు నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు నవనీత్ శ్రీ రామ్ (Navaneeth Sri ram)దర్శకత్వం వహించగా,పుస్కూర్‌ రామ్మోహన్‌రావు, జాన్వీ నారంగ్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మరి ఈ వీకెండ్ లోగా ఈ చిత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని మంచి సక్సెస్ అందుకుంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

Also Read: Paanch Minaar First Day Collections: రాజ్ తరుణ్ పాంచ్ మినార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. అర కోటి కూడా కలెక్ట్ చేయలని మూవీ

Related News

సాయి ధరమ్ తేజ్ పెళ్లి వేడుకలు షురూ… ఘనంగా పసుపు వేడుక!

తెరపైకి షకీలా బయోపిక్.. సాయి రాజేష్ సంచలన నిర్ణయం!

స్వయంభు ఈ ఏడాది కూడా రానట్టేనా?

ఐదుగురు సినిమా చూడాలంటే రూ.7 వేల ఖర్చు.. టికెట్ ధరలపై శరత్ ఫైర్

సినిమాలు తక్కువే.. సోషల్ మీడియాలో మాత్రం తగ్గేదేలే అంటున్న శాలిని!

లిటిల్ హార్ట్స్‌కు భారీ లాభాలు.. కానీ నాకు మాత్రం.. మౌళి షాకింగ్ కామెంట్స్ !

ధనుష్ పొలిటికల్ ఎంట్రీ.. సాయి పల్లవి స్పెషల్ రిక్వెస్ట్.. ఆ పని చేయొద్దంటూ!

నటి అతుల్య చంద్ర ఫిర్యాదులో బయటపడ్డ సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×