BigTV English

SSMB 29: షూటింగ్ సెట్ ఫోటోలను లీక్ చేసిన ప్రియాంక చోప్రా.. నమ్రత రియాక్షన్ చూసారా?

SSMB 29: షూటింగ్ సెట్ ఫోటోలను లీక్ చేసిన ప్రియాంక చోప్రా.. నమ్రత రియాక్షన్ చూసారా?

SSMB 29: దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli)దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తున్న చిత్రం ఎస్ఎస్ఎంబి 29 (SSMB 29).ప్రస్తుతం ఈ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాబోతున్న ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్ గా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9వ తేదీన మహేష్ బాబు ఫేస్ రివీల్ చేయకుండా మెడలో ఉన్న లాకెట్ ను హైలైట్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు రాజమౌళి. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ నవంబర్లో ఇస్తానని కూడా క్లారిటీ ఇచ్చారు.


ఎస్ ఎస్ ఎం బి 29 మూవీ సెట్ ఫోటోలు లీక్ చేసిన ప్రియాంక..

ఇప్పుడు ఆఫ్రికాలో షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సెట్ ఫోటోలను ప్రియాంక చోప్రా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా లీక్ చేసింది. ఇది చూసిన మహేష్ బాబు భార్య నమ్రత (Namrata Shirodkar) వీటికి రియాక్షన్ కూడా ఇచ్చారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్ గా నటిస్తూ ఉండడంతో చాలామంది ఈమె సోషల్ అకౌంట్ ను ఫాలో అవుతూ .. అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రా కొన్ని ఫోటోలు ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయడంతో మరోసారి ఈ సినిమా ట్రెండింగ్ లోకి వచ్చింది


నమ్రత రియాక్షన్..

గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆఫ్రికాలో జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రియాంక తాను తీసిన కొన్ని నేచర్ ఫోటోలను పంచుకున్నారు.. ఇది చూసిన వారంతా కూడా ఈ ప్రాంతాన్ని గుర్తు పడుతూ..” మీరు కెన్యాలో ఉన్నారా? ఇది ఉత్తర ఆఫ్రికాలో తీసిన ఫొటోస్ కదా!”.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. పైగా ఈ ఫోటోలకు మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ రియాక్ట్ అవుతూ లవ్ సింబల్ ఏమోజిని ఆమె కామెంట్ గా పెట్టారు. మొత్తానికైతే సినిమా లొకేషన్ కి సంబంధించిన షూటింగ్ సెట్ ఫోటోలను ప్రియాంక లీక్ చేసి అభిమానులలో అంచనాలు పెంచేసింది.

ఆయన చేతుల మీదుగా ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ లాంఛ్..

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నవంబర్లో ఈ సినిమాకు సంబంధించి ఒక పెద్ద అప్డేట్ ఇస్తానని రాజమౌళి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ సినిమా టైటిల్ టీజర్ ను నవంబర్లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం ఎందుకంటే డిసెంబర్ 19వ తేదీన ఆయన దర్శకత్వం వహించిన అవతార్ : ఫైర్ అండ్ యాష్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని ప్రమోషన్స్లో భాగంగా ఆయన నవంబర్లో ఇండియాకి వస్తున్నారట. అందుకే రాజమౌళి ఇలా ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

also read:SreeMukhi: ఆంటీ అంటూ శ్రీముఖి పరువు తీసిన హరి.. నీకంటే ఆమె బెటర్ అంటూ!

Related News

Balakrishna: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్న బాలయ్య… స్టేజ్ పై హీరో రియాక్షన్

Nandamuri Balakrishna: సీఎం రిలీఫ్ ఫండ్ కు బాలకృష్ణ భారీ విరాళం

Amitabh Bachchan: సారీ బాలకృష్ణ … బాలయ్యకు లేఖ రాసిన అమితాబ్ !

Tvk Party – Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతిలో విజయ్ టీవీకే పార్టీ జెండా?

NTR-Neel Movie: ప్రశాంత్‌ నీల్‌ భారీ స్కేచ్‌.. కేజీయఫ్‌, సలార్‌ల మించి ఎన్టీఆర్‌-నీల్‌ మూవీ, బడ్జెట్‌ పరిమితులే లేవు..

S.S.Thaman: తమన్ అంతమాటనేశాడేంటి బ్రో.. అది కూడా ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే బాలయ్యను..!

Big Stories

×