BigTV English

Priyanka Chopra: ఇండియన్ టామ్ క్రూజ్ అతనే.. మహేష్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Priyanka Chopra: ఇండియన్ టామ్ క్రూజ్ అతనే.. మహేష్  హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Priyanka Chopra: బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాగురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు.  ఒకప్పుడు అయితే కొంతమందికి మాత్రమే తెల్సిన ప్రియాంక.. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో SSMB29 సినిమాలో నటిస్తుండడంతో అందరికీ తెలిసింది.  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన ప్రియాంక.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లి తరువాత అమెరికా కోడలిగా మారిన ప్రియాంక అక్కడే హాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీగా మారింది.


ఇక మొట్ట మొదటిసారి SSMB29 తో ప్రియాంక తెలుగుతెరకు పరిచయం కానుంది. దీంతో అమ్మడికి సంబంధించిన  ఏ న్యూస్ అయినా చిటికెలో వైరల్ అవుతుంది. అంతేకాకుండా ప్రియాంక ఎవరి గురించి మాట్లాడినా.. మహేష్ గురించి కానీ, SSMBB 29 గురించి కానీ మాట్లాడుతుందేమో అని అందరూ చూస్తూ ఉంటారు. ఇక తాజాగా ప్రియాంక ఒక ఇంటర్వ్యూలో ఇండియన్ టామ్ క్రూజ్ ఎవరో చెప్పుకొచ్చింది. అందరూ మహేష్ బాబు అని చెప్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ, ఈ చిన్నది బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఇండియన్ టామ్ క్రూజ్ అని చెప్పుకొచ్చింది.

“బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చేసే సాహసాలు చాలా రిస్క్ తో కూడుకున్నవి. హాలీవుడ్ లో టామ్ క్రూజ్ ఇలాంటి పాత్రలు చేస్తాడు. వెండితెరపై ఇలాంటి ఇద్దరు స్టార్స్ ను చూసినప్పుడు నాకెంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. వీరిద్దరూ ఎంతో రిస్క్ ఉన్న సాహసోపేతమైన స్టంట్స్ చేస్తుంటారు. అలాంటివి అందరూ చేయలేరు. చాలామంది ఇలాంటి రిస్క్ వినగానే పారిపోతారు. కానీ, అక్షయ్ అలా కాదు.ఏమాత్రం వెనకడుగు వేయకుండా ముందుకు దూకుతాడు.


కథల విషయంలో కూడా అక్షయ్ చాలా ధైర్యవంతుడు. ఎంతకైనా తెగిస్తాడు. అందుకే అతనిని ఇండియన్ టామ్ క్రూజ్ అని అంటాను. నాకు కూడా వారిలా స్టంట్స్ చేయాలనీ ఉంటుంది. అందుకే హాలీవుడ్ లో ఎలాంటి యాక్షన్ సినిమా అవకాశం వచ్చినా అస్సలు వదులుకోను. అందులో ఎక్కువ స్టంట్స్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాంటి స్టంట్స్ నాకెంతో కిక్ ను ఇస్తాయి. ఎన్ని జానర్స్ చేసినా యాక్షన్ సినిమాలు చాలాప్రత్యేకం”అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇక ప్రియాంక చేసిన వ్యాఖ్యలు విన్న  మహేష్ ఫ్యాన్స్.. మా హీరో  కూడా టామ్ క్రూజ్ నే. అయినా మా హీరోతో సినిమా చేస్తూ వేరొక హీరో గురించి ఎలా చెప్తావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రియాంక వ్యాఖ్యలు  సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మరి ప్రియాంక SSMB 29 తో మంచి విజయాన్ని అందుకొని తెలుగులో సెటిల్ అవుతుందో లేదో తెలియాల్సి ఉంది.

Related News

Prabhas : నెక్స్ట్ ఇయర్ కు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్, రెండు సినిమాలు సిద్ధం

Akhanda2 Thaandavam : థియేటర్స్ లో శివతాండవం, తమన్ మామూలోడు కాదు

AA 22xA6: అట్లీ సినిమా కోసం అల్లు అర్జున్ కళ్ళు చెదిరే రెమ్యూనరేషన్..  ఇండస్ట్రీలోనే రికార్డు!

Director Teja : బుర్ర లేని డైరెక్టర్ లతో పని చేయడం వల్ల నేను డైరెక్టర్ అయ్యాను

Samantha: సమంత ఇంట ప్రత్యేక పూజలు..అదే కారణమా… ఫోటోలు వైరల్!

Devi Sri Prasad: దేవీశ్రీ ఎక్కడ? కొంపదీసి ఇండస్ట్రీ దూరం పెడుతోందా?

Jai hanuman: జై హనుమాన్ సినిమాపై బిగ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్.. ఎదురుచూపులు తప్పవా?

Akhanda 2: రంగంలోకి పండిట్ ద్వయం..హైప్ పెంచేసిన తమన్!

Big Stories

×