Python Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో వల్ల ప్రపంచంలో ఏం జరిగినా ఇట్టే తెలిసిపోతుంది. క్షణాల్లో వీడియోలు వైరల్ అవుతున్నాయి. మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తున్నాయి. తాజాగా జార్ఖండ్ లో భారీ కొండచిలువ నక్కన మింగిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ ఘటకు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
?utm_source=ig_web_copy_link
జార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లాలోని బలేదిహా గ్రామం సమీపంలోని అడవిలో భారీ కొండచిలువ ప్రాణంతో ఉన్న నక్కను మింగిన భయానక ఘటన స్థానికులను హడలెత్తించింది. ఈ సంఘటన సరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో చోటుచేసుకుంది.
పశువులను మేపడానికి అలాగే వ్యవసాయ పనుల కోసం అడవికి వెళ్లిన స్థానిక గ్రామస్థులు ఈ భారీ కొండచిలువను నక్కను మింగుతుండగా గుర్తించారు. ఈ వీడియోలో, కొండచిలువ నక్కను సగం వరకు మింగిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ తర్వాత కాసేపటికి బయటకు కక్కుతున్నట్టు వీడియోలో తెలుస్తోంది. దీనిని చూసిన స్థానిక ప్రజలు భయాందోళనకు గురై కేకలు వేయడంతో పెద్ద సంఖ్యలో జనాలు అక్కడకు చేరుకున్నారు. కొందరు స్థానికులు ఈ దృశ్యాన్ని చూసి భయపడగా, మరికొందరు అసాధారణ సంఘటనను ఆశ్చర్యంగా చూశారు.
కొండ చిలువలు.. పెద్ద జీవులను ఎలా మింగగలవు?
నేషనల్ జియోగ్రాఫిక్ ప్రకారం, కొండచిలువలు తమ తల కంటే చాలా పెద్ద జంతువులను మింగగలవు. దీనికి కారణం వాటి దవడలు అత్యంత దృఢంగా ఉండడం. దీంతో వాటి కన్నా పెద్ద జీవులను కూడా కొండ చిలువలు సులభంగా మింగగలవు. కొండచిలువలు సాధారణంగా ఎలుకలు, చిన్న జంతువులను తింటాయి. కానీ అవి ఒక నిర్దిష్ట పరిమాణానికి చేరుకున్న తర్వాత పెద్ద జంతువులైన పందులు, ఆవులు లేదా అరుదైన సందర్భాల్లో మానవులను కూడా తినగలవు. ఈ వీడియోలో కనిపించే కొండచిలువ దాదాపు 12 నుంచి 15 అడుగుల పొడవు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇండోనేషియాలో మనుషులను మింగిన కొండచిలువ
ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఈ వీడియో కింద నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఈ దృశ్యాన్ని చూసి భయపడగా.. మరికొందరు ఆసక్తిగా చూశారు. ఓ నెటిజన్ దీనిని నెమ్మదిగా తిననివ్వండని కామెంట్ చేయగా.. మరొ నెటిజన్ అయితే కొండ చిలువ ఫ్రంటెండ్, బ్యాకెండ్ తింటోందని సరదగా కామెంట్ చేశాడు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. 2024లో, ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలోని పరానా గ్రామం సమీపంలో ఒక 16 అడుగుల కొండచిలువ ఒక దూడను మింగిన సంఘటన జరిగింది. ఇండోనేషియాలో అయితే మనుషులను కొండచిలువలు మింగిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.