E-Paper
Advertisement

నమ్మితే నట్టేట ముంచేశారు.. నిర్మాతకు దిమ్మతిరిగే షాక్!

నమ్మితే నట్టేట ముంచేశారు.. నిర్మాతకు దిమ్మతిరిగే షాక్!
Advertisement

Producer Accountants Scam:సినీ ఇండస్ట్రీ ..ఇక్కడ ఎవరేం చేయాలన్నా డబ్బులు ఖర్చు పెట్టే నిర్మాత ఉండాల్సిందే.కానీ అలాంటి నిర్మాతకే అడ్డంగా పంగనామాలు పెడితే .పెట్టి అడ్డంగా దొరికిపోతే..? ఇదిగో సినీ ఇండస్ట్రీని ఇపుడు ఇలాంటి ఓ వ్యవహారమే కుదిపేస్తుంది.

విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో ఓ నిర్మాతకు రెండు బ్యానర్లు ఉన్నాయట. ఒక బ్యానర్‌పై వందల కోట్ల బడ్జెట్‌తో భారీ సినిమాలు నిర్మిస్తుంటే, మరో బ్యానర్‌కు సంబంధించిన లెక్కల్లో మాత్రం ఊహించని ట్విస్ట్ బయటపడిందనే ప్రచారం ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపొయింది.
ఎన్నో ఏళ్లుగా నిర్మాత దగ్గర పనిచేసే అకౌంటెంట్లే మోసానికి తెగ బడి నిర్మాతని అడ్డంగా ముంచారట.

Advertisement

మాములుగా పెద్ద సినిమాలు నిర్మించే నిర్మాతలకు పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెల్సిందే. ఓవైపు హీరోల డేట్లు, మరోవైపు షూటింగులు, ఇంకోవైపు సినిమా బడ్జెట్, బిజినెస్ లెక్కలు.. ఇలా నిర్మాతలు బిజీ బిజీగా గడిపేస్తుంటారు. అలాంటి సమయంలోనే ఆఫీసులలోని అకౌంటెంట్లపై ఎక్కువగా ఆధారపడుతుంటారు. డబ్బు విషయాలు, వడ్డీలు ఇలా దేన్నైనా వాళ్ళే చూసుకుంటారు. అయితే ఇదే నమ్మకాన్ని కొందరు తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారనే ప్రచారం ఇండస్ట్రీలో జోరందుకుంది.

వినిపిస్తున్న టాక్ ప్రకారం ఆ నిర్మాత తన ప్రధాన బ్యానర్‌పై భారీ సినిమాల నిర్మాణంలో బిజీగా ఉంటే, మరో బ్యానర్‌కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాల్లో కొందరు అకౌంటెంట్లు తమదైన పద్ధతిలో పనులు చక్కబెట్టారట. ఆ రెండో బ్యానర్ ని అడ్డం పెట్టుకుని బయట వ్యక్తులకి ఎక్కువ వడ్డీకి డబ్బులు ఇవ్వడం ,లా వచ్చిన వడ్డీ డబ్బులను రెండో బ్యానర్‌కు సంబంధించిన ఖాతాల్లో జమ చేసేవారనే ప్రచారం కూడా ఉంది.

Advertisement

ఈ వ్యవహారం ఒకటి రెండు నెలలకే పరిమితం కాలేదని, దాదాపు పదేళ్లుగా సాగిందనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే ఇంతకాలం ఈ తతంగం నిర్మాత దృష్టికి ఎలా రాలేదనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్.

ఇక ఈ కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే, నిర్మాతకు అనుమానం రావడంతో లెక్కలు పరిశీలించారట .ఇక తీగ లాగితే డొంక కదిలినట్టు అసలు సంగతి తెలిసిపోయిందట.తను నమ్మిన సొంత మనుషులే ఇలా తనని మోసం చేశారని తెలీడంతో షాక్ అవ్వడం నిర్మాత వంతయింది.

ఇక విషయం తెలిసిన తర్వాత అ అకౌంటెంట్లను కార్యాలయంలోనే ప్రశ్నించారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంలో నిజంగా ఏం జరిగింది? ఎవరు ఎంత మొత్తంలో లావాదేవీలు నిర్వహించారు? వడ్డీ రూపంలో ఎంత డబ్బు చెల్లించారు? అనే విషయాలపై మరింత వివరాలు రావాల్సి ఉంది.

మొత్తానికి, రెండు బ్యానర్లు, భారీ బడ్జెట్ సినిమాలు, పదేళ్లుగా సాగిందనే ప్రచారం, అకౌంటెంట్ల చుట్టూ తిరుగుతున్న ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. సినిమాలలో ఎంత బిజీ ఉన్నా ఆఫీసుల్లో జరుగుతున్న వాటిపై ఒక కన్ను వేసి ఉంచకపోతే ఇదిగో ఇలాంటి సమస్యలే ఎదురవుతాయి.చూడాలి మరి ఈ మోసంలో ఇంకెన్ని తలలు బయటికి వస్తాయో !

ALSO READ :మిడిల్ క్లాస్‌కు గుడ్ న్యూస్.. విజయ్ దేవరకొండ సినిమాలకు టికెట్ హైక్ ఉండదా?

Tags

Related News

సత్య సాయిబాబా బయోపిక్ సినిమా చేయాలని ఉంది..కానీ: విజయ్ దేవరకొండ

మిడిల్ క్లాస్‌కు గుడ్ న్యూస్.. విజయ్ దేవరకొండ సినిమాలకు టికెట్ హైక్ ఉండదా?

రణబాలికి రూ. 120 కోట్లు.. అప్పుడే వచ్చిందెంతంటే?

‘రణబాలి’ ట్రైలర్ పై నారా లోకేష్ ఆసక్తికర పోస్ట్.. !

లగ్జరీ కారు కొన్న ప్రేమలు హీరో.. ఖరీదు ఎంతంటే?

శ్రీ విష్ణులో ఇంత టాలెంటా? హీరో కాకపోయి ఉంటే?

త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ మరో సంచలన పోస్ట్..!

Big Stories

Advertisement
×