Vijay Devarakonda: సినీ నటుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు అయితే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా విజయ్ దేవరకొండ పుట్టపర్తి సత్య సాయిబాబా బయోపిక్(Sathya Sai Baba) సినిమా గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
విజయ్ దేవరకొండకు పుట్టపర్తి సత్య సాయిబాబా అంటే ఎంతో అమితమైన భక్తి ,గౌరవం ఉంది. చిన్నప్పుడు విజయ్ దేవరకొండ పుట్టపర్తి లోనే తన విద్యాభ్యాసం మొత్తం పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇలా పుట్టపర్తితో విజయ్ దేవరకొండకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఇప్పటికి కూడా తరచూ పుట్టపర్తికి వచ్చి బాబా మహా సమాధిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక తాజాగా సత్య సాయి బాబా బయోపిక్ సినిమా గురించి విజయ్ దేవరకొండ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఇదివరకు దేవుళ్లకు సంబంధించి ఎన్నో బయోపిక్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే తనకు కూడా పుట్టపర్తి సత్యసాయిబాబా బయోపిక్ సినిమా చేయాలని ఉంది కానీ తాను చేయలేనని తెలిపారు. విజయ్ దేవరకొండ ఈ బయోపిక్ సినిమా చేయకపోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కూడా తెలిపారు. పుట్టపర్తి సత్య సాయిబాబా ఎంతో పవిత్రమైనటువంటి వ్యక్తి అలాంటి గొప్ప వ్యక్తి పాత్రను నేను పోషించలేను నాలో కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి.. అంతటి పవిత్రమైన వ్యక్తి పాత్ర తాను చేయనని విజయ్ దేవరకొండ తెలియజేశారు. బయోపిక్ సినిమా చేయాలని ఉన్నప్పటికీ కూడా చేయలేనంటూ విజయ్ చేసిన కామెంట్స్ విన్న అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
రణబాలి సినిమా విషయానికి వస్తే బ్రిటిష్ పాలనకు వ్యతిరేక పోరాటం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో కనిపించబోతున్నారు. రష్మిక మందన్న హీరోయిన్గా సందడి చేయబోతున్నారు. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల కాలంలో సరైన సక్సెస్ లేక సతమతమవుతున్న విజయ్ దేవరకొండకు రణబాలి ఎలాంటి సక్సెస్ అందిస్తుంది అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్, పాటలు ఇతర అప్డేట్స్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి.
Also Read: రామ్ చరణ్ నన్ను నమ్మలేదు… ఒకేసారి అంత మాట అన్నారా: రంగస్థలం మహేష్