BigTV English

Nikhil Abburi: 100% లవ్ బుడ్డోడు, ఇప్పుడు ఎలా అయిపోయాడో, బన్నీ వాస్ కి షాక్.!

Nikhil Abburi: 100% లవ్ బుడ్డోడు, ఇప్పుడు ఎలా అయిపోయాడో, బన్నీ వాస్ కి షాక్.!

Nikhil Abburi: కొంతమంది యాక్టర్ పేర్లు చెప్పినప్పుడు వాళ్లు పెద్దగా గుర్తుకురారు. కానీ వాళ్ళు చేసిన పర్ఫామెన్స్ మాత్రం డెఫినెట్ గా గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఆ పాత్రలు ప్రేక్షకులకు అంతలా కనెక్ట్ అయిపోయాయి కాబట్టి. అలా చాలామంది చైల్డ్ ఆర్టిస్టులు ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన పేర్లు సంపాదించుకున్నారు. అప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఎలా ఉన్నారు అని ఎవరు ఊహించలేరు.


ఎందుకంటే సినిమా శాశ్వతం కాబట్టి చిన్నప్పుడు వాళ్లు ఎలా ఉన్నారు? ఇప్పటికీ కూడా అలానే ఉంటారు అని ప్రేక్షకుడు ఆల్రెడీ తమ మైండ్లో ఫిక్స్ అయి ఉంటాడు. కానీ సడన్ గా వాళ్ళని చూసినప్పుడు అరెరే ఇంత పెద్దవాడు అయిపోయాడు అనిపిస్తుంది. మరి ఇలా మారిపోయాడు ఏంటి అనే థాట్ కూడా వస్తుంది. అచ్చం అలానే అనిపిస్తున్నాడు నిఖిల్ అబ్బూరి.

ఎంత మారిపోయాడో 


నిఖిల్ అబ్బూరి అంటే చాలామందికి తెలియకపోవచ్చు. కానీ 100% లవ్ సినిమాలో నటించిన బుడ్డోడు గుర్తుండే ఉంటాడు గా, అలానే మిర్చి (Mirchi) కూడా అద్భుతమైన పర్ఫామెన్స్ చేశాడు. ముఖ్యంగా సత్యం రాజేష్ (Satyam Rajesh) తో తాను చేసే సీన్స్ అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా చాక్లెట్లు ఇవ్వకు బాగోదు అనే డైలాగ్ థియేటర్లో అద్భుతంగా పండింది. ఆయా పాత్రలను చేసిన అబ్బాయి నిఖిల్ అబ్బూరి. ప్రస్తుతం మౌళి టాక్స్ (Mouli Talks) నటిస్తున్న లిటిల్ హార్ట్స్ (Little Hearts) అనే సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.

Also Read : AR Murugadoss : తెల్లార్లు అంటే కుదరదు… ఆ హీరోపై డైరెక్టర్ అసహనం

బన్నీ వాస్ షాక్

100% లవ్ సినిమా బన్నీ వాస్ కు చాలా ప్రత్యేకమైనది. ఆ సినిమాతోనే నిర్మాతగా బన్నీ వాసు మారారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఇక లిటిల్ హార్ట్స్ సినిమాను బన్నీ వాసు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అయితే ఈ తరుణంలో ఈ ఈవెంట్ కు నిఖిల్ అబ్బూరి కూడా హాజరయ్యాడు. నిఖిల్ అబ్బూరిని మౌలి టాక్స్ స్టేజ్ పైకి ఆహ్వానించాడు. గుర్తుపట్టారా అంటూ నిఖిల్ అబ్బూరి గురించి అందరికీ గుర్తు చేశాడు మౌళి. వెంటనే నిఖిల్ అబ్బురి మాట్లాడుతూ బన్నీ వాసు గారు నేను 100% లవ్ సినిమా అప్పుడు మిమ్మల్ని కలిసాను. బహుశా ఇప్పుడు మీరు గుర్తుపట్టకపోయి ఉంటారు. అనగానే బన్నీవర్ షాక్ అయ్యారు. కేవలం బన్నీ వాసు మాత్రమే కాదు చాలామంది షాక్ అయిపోయాక మారిపోయాడు నిఖిల్ అబ్బూరి.

Also Read: Little Hearts Teaser: అన్ని తిట్లు మీ అమ్మకే రా, ఇంత దారుణంగా తయారయ్యారు ఏంటయ్యా?

Related News

Shivani Nagaram: అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు శివాని.. సౌత్ ఇండస్ట్రీని ఏలుతున్న ముద్దుగుమ్మలు?

Chandra Bose: ఆస్కార్ రచయితను బెదిరించిన సినిమా డైరెక్టర్

Anil Ravipudi : టైటిల్ గురించి క్లారిటీ ఇచ్చేసిన అనిల్ రావిపూడి, ఇక సంక్రాంతి లేనట్లేనా? 

Samantha: మరో గౌరవం అందుకున్న సమంత.. ప్రముఖ  మ్యాగజైన్ పై మెరిసిన నటి!

Suriya: ఆర్థిక ఇబ్బందుల్లో సూర్య సినిమా… వెనకడుగు వేస్తున్న నిర్మాతలు?

Big Stories

×