E-Paper
Advertisement

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!

వికారాబాద్ జిల్లాలో గుప్తనిధుల వేట.. మట్టి తవ్వుతుండగా ఊహించని ట్విస్ట్!
Advertisement

Treasure Hunt: అర్ధరాత్రి చుట్టూ కటిక చీకటి.. పాడుబడ్డ గుడి వెనక పొదల్లో జేసీబీ ఘీంకారం మధ్యలో కుంకుమ ముగ్గులు పసుపు ముద్దలు ధూపం పొగలు కోసిన నిమ్మకాయలు పక్కనే తీసిన పెద్దగొయ్యి. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా గుప్త నిధుల వేట బంగారం మూటల కోసం ఈ ముఠా కోసం గోతులు తీస్తోంది.

భూమి కింద లంకె బిందె..

అనగనగా ఓ బాబా ఆయన నోట్లోంచి వచ్చిన ఒకే ఒక్క మాట.. భూమి కింద లంకె బిందె ఉంది. అంతే వికారాబాద్ జిల్లా యాలాల మండలం, బండమీదిపల్లిలో కొందరికి నిద్ర పట్టలేదు. చీకటి పడగానే జేసీబీ తీసుకొచ్చారు. కళ్లల్లో బంగారం కలలు దురాశ గుండెల్లో ఆశల దీపం పట్టుకొని ఊరవతలికి వెళ్లారు. పూజలు చేసి తవ్వకాలు స్టార్ట్ చేశారు. తవ్విన కొద్దీ ఏమొస్తోంది? మట్టి మట్టి మళ్లీ మట్టే తవ్వేకొద్దీ వీళ్ల మూఢనమ్మకం వస్తుంది తప్పా లంకెబిందె తగలడం లేదు. అయినా వాళ్ల ఆశ మాత్రం చావడం లేదు.

Advertisement

Also read: మటన్ చాప్స్ రోస్ట్ ఇలా చేయండి.. ఒక్కసారి తింటే మళ్లీ ఇదే కావాలంటారు!

పోలీసులు సైరన్..

ఈ సీక్రెట్ ఆపరేషన్ మ్యాటర్ యాలాల పోలీసుల చెవిన పడింది. రాత్రికి రాత్రే పోలీసులు సైరన్ లేకుండా సౌండ్ లేకుండా సడెన్ ఎంట్రీ ఇచ్చారు. పోలీసుల్ని చూడగానే ముగ్గురు జంప్ జిలానీలు చీకట్లో పారిపోయారు. కానీ ఆరుగురు మాత్రం అడ్డంగా బుక్కయ్యారు. తవ్వకాలకు వాడిన జేసీబీ రెండు కార్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్‌కి తరలించారు. అక్కడ పూజల ఆనవాళ్లు కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. పట్టుబడ్డవాళ్లలో ఓ సర్పంచ్ భర్త, ఓ మాజీ సర్పంచ్ ఉన్నారంటూ ఊరంతా గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ పోలీసుల నుంచి మాత్రం ఇంకా నో కన్ఫర్మేషన్.

వెనక సూత్రధారి ఎవరు?

Advertisement

అసలు ఈ తవ్వకాల వెనక సూత్రధారి ఎవరు? ఆ బాబాకి ఎవరు ఐడియా ఇచ్చారు? ఇది కేవలం నిధి వేటేనా లేక తెర వెనక మరేదైనా గేమ్ ప్లాన్ ఉందా? అన్ని కోణాల్లో ఖాకీలు ఎంక్వైరీ స్పీడప్ చేశారు. భూమి లోతుల్లో నిధి ఉందో లేదో తెలియదు భయ్యా..! మీ బుద్ధిని పాతిపెట్టి బంగారం వెతికితే దొరుకుతుందా.. నేల లోతుల్లో కాదు నీ బుర్రలో వెతుకు చీకట్లో కాదు వెలుగులో నడువు. మూఢనమ్మకం అంటే నువ్వే తవ్వుకునే గొయ్యి ఆ గొయ్యిలో పడేది నీ బంగారు భవిష్యత్తే బాసూ..

Also read: తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

Tags

Related News

తెలంగాణ కాంగ్రెస్‌లో నామినేటెడ్ పదవుల రచ్చ.. 15 నుండి 18 మందికి మళ్లీ ఛాన్స్?

తెలంగాణ ప్రజలకు షాకింగ్ న్యూస్.. నవంబర్ నుంచి పెరగనున్న కరెంట్ బిల్లులు!

ఏడాది సస్పెన్షన్‌ వేటు పడనుందా? ఎథిక్స్‌ కమిటీ నివేదిక ఏం కోరనుంది..? పాడికి వివరణ ఇచ్చేందుకు రేపే చివరి చాన్స్‌….!

ధర్మేంద్ర రాజీనామా విషయంలో ఒత్తిడి పెంచిన ఆర్ఎస్ఎస్ చీఫ్‌..! సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా అంశంలో వెనక్కి తగ్గొద్దనే కేంద్రానికి సూచన..!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి.. ఈ నెలలోనే నోటిఫికేషన్ రానుందా.?

సెప్టెంబర్ 30న ఆల్ టైమ్ రికార్డ్.. విద్యుత్ వాడకంలో తెలంగాణ సరికొత్త చరిత్ర!

మహబూబాబాద్ జిల్లాలో విచిత్ర రైల్వే స్టేషన్.. అయోమయంలో ప్రయాణికులు!

Big Stories

Advertisement
×