E-Paper
Advertisement

శ్రీలీలతో విభేదాలపై స్పందించిన నిర్మాత.. మరీ ఇంత దారుణమా?

శ్రీలీలతో విభేదాలపై స్పందించిన నిర్మాత.. మరీ ఇంత దారుణమా?
Advertisement

Naga vamshi:డైరెక్టర్ కథను సిద్ధం చేసుకునేటప్పుడు ఫలానా పాత్రలో ఫలానా నటుడు లేదా నటి అని ఊహించుకుంటూ పాత్రలను డిజైన్ చేస్తారు. ఇక ఆ పాత్రల కోసం వారిని సంప్రదిస్తే వారికి కుదిరితే సినిమాకి సైన్ చేస్తారు.. లేకపోతే ఆ పాత్రలలో ఇంకొకరు నటించాల్సి వస్తుంది.అయితే ఇంకొంతమంది షూటింగ్ సెట్లోకి అడుగుపెట్టిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమా షూటింగ్ నుండి తప్పుకుంటే మాత్రం వారికి చిత్ర బృందంతో లేదా దర్శకుడితో, నిర్మాతతో, హీరోతో ఇలా ఎవరో ఒకరితో విభేదాలు వచ్చాయని, అందుకే వారు సినిమా నుండి తప్పుకున్నారు అనే రూమర్లు పెద్ద ఎత్తున వినిపిస్తాయి. ఇప్పటికే ఇలాంటి రూమర్లు ఎన్నో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అలా అఖిల్ హీరోగా నటించిన లెనిన్ మూవీ నుండి శ్రీలీలను తప్పించడంతో.. నిర్మాతకు శ్రీలీలతో విభేదాలు అంటూ వచ్చిన వార్తలపై నిర్మాత స్పందించి అసలు విషయం చెప్పేశారు.

శ్రీ లీలతో విభేదాలపై నిర్మాత క్లారిటీ..

అసలు విషయంలోకి వెళ్తే.. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురు చూసిన శ్రీ లీల.. మొదట అఖిల్ అక్కినేని హీరోగా నటించిన లెనిన్ సినిమాకి హీరోయిన్ గా ఎంపిక అయింది. కొంత భాగం షూటింగ్ కూడా చేశారు. అంతేకాదు అఖిల్ , శ్రీ లీల కలిసి ఉన్న పోస్టర్స్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఏమైందో తెలియదు కానీ సడన్గా శ్రీ లీలా స్థానంలో భాగ్యశ్రీ బోర్సే వచ్చింది. ఇక సడన్గా హీరోయిన్ల మార్పుపై అనేక ఊహాగానాలు పుట్టుకొచ్చాయి. అయితే దీనిపై నిర్మాత నాగ వంశీ స్పందిస్తూ సడన్గా హీరోయిన్ మార్పు వెనుక అసలు కారణాన్ని వెల్లడించారు.

Advertisement

also read:అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఐశ్వర్య రాజేష్ ఓ..! సుకుమారి ట్రైలర్ రిలీజ్.. విడుదల ఎప్పుడంటే?

తప్పంతా మాదే..

నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ..” లెనిన్ సినిమా నుంచి శ్రీలీలను తప్పించడం వెనుక ఎటువంటి విభేదాలు లేవు. కేవలం డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే హీరోయిన్ మార్పిడి జరిగింది. ముఖ్యంగా కథకు సంబంధించిన క్రియేటివ్ చర్చల వల్ల మా వైపు నుంచే కొంత ఆలస్యం జరిగింది.అందుకే మేము షూటింగ్ ప్లాన్ చేసుకునే సమయానికి శ్రీ లీలా ఇచ్చిన డేట్స్ కూడా అందుబాటులో లేవు. ఇక ఆమెకు కార్తీక్ ఆర్యన్ సినిమా పరాశక్తి వంటి పెద్ద ప్రాజెక్టులు వచ్చాయి. ఇక మళ్లీ మేము సినిమా షూటింగ్ కి సిద్ధమయ్యేసరికి పరాశక్తి సినిమా షూటింగ్ తో బిజీగా ఉండిపోయింది శ్రీ లీల. అందుకే డేట్స్ కొంచెం క్లాష్ అయ్యాయి.. ఇక హీరోయిన్ ని మార్చడం వల్ల మళ్ళీ కొంత భాగాన్ని రీ షూట్ చేయాల్సి వచ్చింది. అయితే ఫైనల్ అవుట్ పుట్ చూసాక భాగ్యశ్రీ భారతి పాత్రలో ఒదిగిపోయింది” అంటూ నిర్మాత క్లారిటీ ఇచ్చారు.

మంచి ఛాన్స్ వదులుకున్న శ్రీ లీల..

Advertisement

ఏదిఏమైనా శ్రీలీలను సడన్గా తప్పించడంతో నిర్మాతతో విభేదాలు అంటూ వచ్చిన వార్తలకు నాగవంశీ స్పందించి రూమర్స్ కి చెక్ పెట్టేశారు. ఒకవేళ శ్రీ లీల గనుక ఈ సినిమాలో నటించి ఉండుంటే ఈమెకు మంచి విజయం లభించేది . అటు పరాశక్తి సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. ఏది ఏమైనా శ్రీ లీల బంగారం లాంటి ఛాన్స్ మిస్ చేసుకుందని చెప్పవచ్చు.

 

Related News

తెలుగు సినీ చరిత్రలో అత్యంత ఎక్కువ రోజుల షూటింగ్ జరిగిన సినిమా ఏదో తెలుసా?

ఆ అభిమాని నమ్మకాన్ని అయ్యగారు నిలబెట్టేనా ?

అనిల్ రావిపూడి చేతుల మీదుగా ఐశ్వర్య రాజేష్ ఓ..! సుకుమారి ట్రైలర్ రిలీజ్.. విడుదల ఎప్పుడంటే?

మళ్లీ వచ్చాడ్రోయ్.. డై హార్ట్ ఫ్యాన్ హంగామా.. అఖిల్ ఏం చేశారంటే?

తమిళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం.. జాతీయ అవార్డు గ్రహీత, దర్శకుడు చెళియన్ కన్నుమూత

కథలో ముద్దు సీన్లు ఉంటే నన్ను తీసేయండి.. ‘సాయి పల్లవి షాకింగ్ కామెంట్స్!

ఢిల్లీ టు స్వీడన్.. సైకిల్‌పైనే 9,600 కిలోమీటర్లు! గూస్‌బంప్స్ తెప్పిస్తున్న లవ్ స్టోరీ!

Big Stories

Advertisement
×