Weather Update: గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళఖాతంలో మరి కొన్ని గంటల్లో అల్పపీడనం బలపడనుందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు రాత్రంతా భారీగా వర్షాలు ఛాన్స్ ఉందని వివరించంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ అధికారులు రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు కీలక అప్డేట్ ఇచ్చారు.
ఇవాళ ఈ జిల్లాలో వర్షం దంచుడే దంచుడు…
ఈ రోజు తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ, ఉత్తర తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, మెదక్, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో చెల్లాచెదరుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని వివరించింది. ఇక హైదరాబాద్ లో మోస్తరు నుంచి తేలికపాటి వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ALSO READ: Junior Associate Jobs: ఎస్బీఐలో 6589 జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలు.. భారీ వేతనం, మరి ఇంకెందుకు ఆలస్యం
మరి కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం…
మరి కాసేపట్లో జగిత్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, వరంగల్, హన్మకొండ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మహబూబ్ నగర్, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు పడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ లో మోస్తారు పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వివరించారు.
ALSO READ: NIACL Jobs: డిగ్రీ అర్హతతో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.96వేల జీతం, ఇదే మంచి అవకాశం
ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి నది…
భారీవర్షాలకు తెలంగాణలో ములుగు జిల్లాలో గోదావరి నది ఉదృతంగా ప్రవహిస్తోంది. వాజేడు మండలంలోని పేరూర్ పరిసర ప్రాంతాల్లో భారీ వరద నీరు చేరింది. టేకుల గూడెం వద్ద జాతీయ రహదారి లో లెవెల్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. పలు చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో తెలంగణ- ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జాతీయ రహదారిపై పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో బోగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. బొగత జలపాతంలోకి దిగకుండా సందర్శనకు మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు. వెంకటాపురంలోని పాలెం ప్రాజెక్టుకు సైతం భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 3600 క్యూసెక్కుల వరద దిగువకు విడుదల చేశారు.