San Rechal : ఈమధ్య సెలబ్రిటీలు చిన్నచిన్న కారణాలవల్లే ఆత్మహత్యలు చేసుకుని ప్రాణాలను వదిలేస్తున్నారు. గత రెండు మూడు నెలల్లో ఇలాంటి వార్తలు ఎక్కువగా వింటున్నాము. సీరియల్, సినిమాలు చేసే నటీనటులు మాత్రమే కాదు. మోడల్స్ కూడా ఆత్మహత్య చేసుకుని మధ్యలోనే జీవితాన్ని ముగించేస్తున్నారు. తాజాగా ఓ మోడల్ ఆత్మహత్య చేసుకొని ప్రాణాలను వదిలేశారు. ఆమె మరెవరో కాదు.. పుదుచ్చేరికి చెందిన మోడల్ శాన్ రేచల్. అధిక మోతాదులో మాత్రలు వేసుకొని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. పుదుచ్చేరి కారామణికుప్పంకు చెందిన శంకరప్రియ అలియాస్ శాన్ రేచల్ అతి చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోయింది. క్యాన్సర్ కారణంగా ఆమె చనిపోయారు.. నల్లగా ఉండటంతో చాలామంది ఆమెను దూరం పెట్టారు. చర్మం రంగుతో సంబంధం లేకుండా తన ప్రతిభతో మోడలింగ్ రంగంలో రాణించారు. 2019లో మిస్ డార్క్ క్వీన్ గా, బెస్ట్ యాటిట్యూడ్ తో పాటుగా పలు టైటిల్స్ ను శాన్ సొంతం చేసుకుంది. అనారోగ్య సమస్య కారణంతోనే ఆమె ఆదివారం అధిక మోతాదులో మాత్రలు వేసుకుని ఆత్మహత్య చేసుకున్నని పోలీసులు వెల్లడించారు. ఆత్మహత్య చేసుకోవడానికి ఆమెకు గల బలమైన కారణాలేంటో పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..
పుదుచ్చేరిలోని ఇంట్లోనే ఆత్మహత్య..
పుదుచ్చేరికి చెందిన ప్రముఖ మోడల్, సోషల్ మీడియా పర్సనాలిటీ సన రేచల్ గాంధీ తన ఇంట్లోనే సూసైడ్ చేసుకొని చనిపోయిన సంగతి తెలిసిందే.. భారతీయ సినిమా, ఫ్యాషన్ పరిశ్రమలో వర్ణవివక్ష కు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించడంలో రేచల్ ముందున్నారు. 2022లో ఆమె మిస్ పుదుచ్చేరి టైటిల్‌ను గెలుచుకున్నారు. అలాగే మరెన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ మధ్య రేచల్ పెద్దగా బయట కనిపించలేదు. కొన్ని పర్సనల్ కారణాల వల్లే ఆమె బయటకు రాలేదని మీడియా వర్గాల సమాచారం. కానీ ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకొని చనిపోవడం బాధాకరం. అతి చిన్నవయసులోనే జీవితాన్ని ముగించడం ఆమె అభిమానులు జీర్ణించుకోలేకున్నారు. ఆమె భౌతికాయానికి ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు.
ఆర్థిక ఇబ్బందులే కారణమా..?
పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. ఆమె తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, భారీ అప్పుల కారణంగా ఆమె మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఫ్యాషన్ షోలు నిర్వహించడంలో జరిగిన నష్టాలు ఈ ఆర్థిక సమస్యలకు దారితీసినట్టు తెలుస్తోంది. అంతేకాక.. కొన్ని సోషల్ మీడియా పోస్ట్‌లు ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నట్టు సూచిస్తున్నాయి. ఇది ఆమె మానసిక ఒత్తిడిని మరింత పెంచడంతో ఆమె సూసైడ్ చేసుకొని ఉంటుందని అనుమానిస్తున్నారు. సూసైడ్ నోట్ లభించినట్టు తెలిసింది. అయితే దాని గురించి ఇంకా వివరాలు వెల్లడి కాలేదు. పుదుచ్చేరి తహసీల్దార్ ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు.. గత ఏడాది వివాహం చేసుకున్నారు. భర్త గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి.