BigTV English

Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీలా తో పాటు, ఆ హీరోయిన్ కూడా

Pawan Kalyan : ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీలా తో పాటు, ఆ హీరోయిన్ కూడా
Advertisement

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిపోయిన తర్వాత ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తిచేసే పనిలో పడ్డారు. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాను పూర్తి చేశారు. ఓజి సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు.


ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా గురించి చాలామంది ఎంతో క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఇదివరకే హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. పవన్ కళ్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటారో అలా చూపించి మంచి ట్రీట్ అందించాడు.

ఉస్తాద్ భగత్ సింగ్ లో మరో హీరోయిన్


ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీ లీలా తో పాటు రాశి ఖన్నా కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ లో రాశి ఖన్నా కూడా ఉన్నారు. ఇప్పటివరకు చిత్ర యూనిట్ ఈ విషయాన్ని బయటపడకుండా చాలా జాగ్రత్త పడ్డారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రెండు వీడియోలు విడుదలయ్యాయి. రెండు వీడియోలు కూడా విపరీతంగా వైరల్ అయిపోయాయి. పవన్ కళ్యాణ్ ఈ సినిమా కోసం అప్పుడు కేటాయించింది తక్కువ రోజులు అయినా కూడా ఇంత కంటెంట్ హరీష్ శంకర్ ఎలా రాబట్టి గలిగాడు అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఇప్పటికీ కూడా ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు కూడా బీభత్సమైన వైరల్ అయిపోయాయి. అంతకు మించిన డైలాగ్స్ ఇప్పుడు సినిమాల్లో ఉండబోతున్నాయి అని చాలామంది అభిప్రాయం.

గబ్బర్ సింగ్ సినిమాను మించి ఉండాలి 

ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ లోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కంప్లీట్ గా మాయమైపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జల్సా సినిమా వచ్చినా కూడా అది కొంతవరకు కళ్యాణ్ కెరియర్ కు ప్లస్ అయింది. గబ్బర్ సింగ్ మాత్రం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఒక రీమేక్ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని రికార్డులు అన్ని తిరగరాయొచ్చు అని ప్రూవ్ చేసింది గబ్బర్ సింగ్. బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ సత్తా ఏంటో తెలిసేలా చేసిన సినిమా అది. హరీష్ మాత్రం చాలా పగడ్బందీగా ఆ సినిమాను డిజైన్ చేశాడు. పవన్ కళ్యాణ్ ఎటువంటి డైలాగులు చెప్తే బాక్స్ ఆఫీస్ వద్ద వర్క్ అవుట్ అవుతాయి అని ఊహించి అవే డైలాగులను పెట్టి సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ విషయానికొస్తే గబ్బర్ సింగ్ సినిమాను మించి ఉండబోతుంది అని పలు సందర్భాల్లో తెలిపాడు హరీష్.

Also Read : Thaman : పవన్ ఫ్యాన్స్ కు గూజ్బమ్స్ ఇచ్చే స్టేట్మెంట్, అన్ని లెక్కలు సెటిల్ చేద్దాం

Related News

Upasana Konidela: అఫీషియల్… రెండో వారసుడు రాబోతున్నట్లు ప్రకటించిన మెగా కోడలు

SKN: బండ్లన్న అలా చేస్తే ఇండస్ట్రీకి ప్రమాదం… నిర్మాత SKN షాకింగ్ కామెంట్!

Fauzi: పుట్టుకతో అతను ఒక యోధుడు.. అదిరిపోయిన ఫౌజీ లుక్

Bandla Ganesh: జోష్ మూవీ కోసం సిద్ధూ ఆరాటం.. కట్ చేస్తే నెక్స్ట్ రవితేజ!

Samantha: నా విడాకులు వారికి సంబరాలు.. సమంత షాకింగ్ కామెంట్స్!

HBD Prabhas: 46 ఏళ్లు.. ఇప్పటికైనా శుభవార్త చెప్పవయ్యా!

Prabhas : ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. రెబల్ స్టార్ టు పాన్ ఇండియా స్టార్..ఆస్తుల విలువ ఎంత..?

Telusukada: తెలుసు కదా సినిమా ఫస్ట్  ఛాయిస్ సిద్దు కాదా..చేతులారా హిట్ సినిమా వదులుకున్న హీరో?

Big Stories

×